Categories: HealthNews

Paneer : పన్నీర్ అసలైందేనా లేదా నకిలీదా… వంటింటి చిట్కాలతో తెలుసుకోండిలా..!

Advertisement
Published by
Advertisement

Paneer  : నేటి ఆధునిక కాలంలో మార్కెట్లో ప్రతి ఒక్కటి నకిలీ మయం అవుతుంది. ఇక కొంతమంది వ్యాపారులైతే లాభాల కోసం ఆహార పదార్థాలను కూడా కల్తీ చేసి లాభాలను పొందుతున్నారు. అటువంటి ఆహార పదార్థాలలో పన్నీర్ ఒకటి. పన్నీర్ ని ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టంగా తింటారు. అంతేకాకుండా ఇది రుచికరంగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు ని కలిగిస్తుంది. అయితే ప్రస్తుత కాలంలో రసాయనాలతో తయారు చేసిన పన్నీర్ నీ మార్కెట్లలో విపరీతంగా అమ్ముతున్నారు. ఇక మీరు కొనుగోలు చేసిన పన్నీర్ పాలతో తయారు చేసిందా లేదా నకిలీదా అని మీరు ఇంట్లోనే సులభంగా నిర్ధారణ తెలుసుకోవచ్చు. మరి అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

Advertisement

Paneer : పన్నీర్ అసలైందేనా లేదా నకిలీదా… వంటింటి చిట్కాలతో తెలుసుకోండిలా..!

ముందుగా మార్కెట్లో కొనుగోలు చేసిన పన్నీరును ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. దీనిని చేతులతో నలపడానికి ప్రయత్నించండి. ఎందుకంటే పన్నీర్ మెత్తగా ఉంటుంది కాబట్టి దీనిని చేతులతో నలిపితే అది పొడిగా మారుతుంది. అదే నకిలీ పన్నీర్ నీ సింథటిక్ రసాయనల తో తయారుచేస్తారు కనుక ఇది గట్టిగా ఉంటుంది. అంతేకాకుండా నకిలీ పన్నీరు లబ్బరుల ఉండి ఎంత నలిపిన నలగకుండా బంతిలా ఎగురుతుంది. ఇక ఇలా ఉన్నట్లయితే అది నకిలీదని నిర్ధారించవచ్చు. అదేవిధంగా పన్నీర్ రంగుతో కూడా నకిలీదా లేదా అసలైన తెలుసుకోవచ్చు. అది ఎలా అంటే స్వచ్ఛమైన పన్నీర్ లేత తెలుపు రంగులో ఉంటుంది. అదే నకిలీ పన్నీర్ సింథటిక్ తో తయారు చేసిన తెల్లగా ఉంటుంది. కాబట్టి తెల్లగా ఉండే పన్నీర్ నకిలీదని వెంటనే గుర్తించవచ్చు. అంతేకాకుండా ఒక తెల్లటి కాగితంపై పన్నీరుని రుద్దితే అది రంగు మారితే అది నకిలీ పన్నీర్ అని సులభంగా చెప్పవచ్చు.

Advertisement

అలాగే అయోడిన్ పరీక్షలు కూడా చేయవచ్చు. అది ఎలా అంటే ముందుగా కొంత పన్నీర్ భాగాన్ని తీసుకొని నీటిలో ఐదు నిమిషాల పాటు మరిగించాలి. ఇలా మరిగించిన పన్నీర్ ని ఒక ప్లేట్ లో ఉంచి చల్లారనివ్వాలి. దీని మీద రెండు చుక్కల అయోడిన్ టింక్చర్ వెయ్యాలి. కొంతసేపటికి పన్నీర్ నీలం రంగులోకి మారిపోతే అది నకిలీదని అర్థం. ఇక పన్నీర్ వాసనని బట్టి కూడా స్వచ్ఛమైన పన్నీర్ ను గుర్తించవచ్చు. పాలతో చేసినటువంటి పన్నీర్ పెరుగు లేదా పుల్లని వాసన వస్తుంది అదే సింథటిక్ పన్నీర్ లో కృతిమ రసాయన వాసన వస్తుంది.

మార్కెట్లలో పన్నీర్ కొనే ముందు ప్యాకేజింగ్ శ్రద్ధగా పరిశీలించండి. స్వచ్ఛమైన పన్నీర్ ఘన రూపంలో ఉంటుంది. అదే నకిలీ పన్నీర్ ముక్కలు గా ఉంటుంది. ఇక నకిలీ పన్నీరుని తనిఖీ చేయడానికి ఒక గిన్నెలో పన్నీర్ ముక్కలు మరియు నీళ్లు పోసి మరిగించాలి. ఇలా మరుగుతున్న సమయంలో ఒక టీ స్పూన్ ఉప్పు వేసి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ సమయంలో పన్నీర్ లేత ఎరుపు రంగులోకి మారిపోయినట్లయితే అందులో డిటర్జెంట్ యూరియా కలిపారని అర్థం. అదేవిధంగా ఒక పన్నీర్ ముక్కను పెనం మీద వేయించితే అది గోధుమ రంగులోకి మారుతే స్వచ్ఛమైన పన్నీర్ అని అర్థం . ఒకవేళ నకిలీ పన్నీర్ అయితే కరిగి నీటిని విడుదల చేయడమే కాకుండా జిడ్డుగా ఉంటుంది

Advertisement
Tandu Ramalingaiah

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Recent Posts

Habits : సైలెంట్‌గా శరీరాన్ని దెబ్బతీసే రోజువారీ తప్పులు.. వెంటనే మార్చుకోండి!

Habits  : ప్రస్తుతం వేగవంతమైన జీవనశైలిలో చాలా మంది ఆరోగ్యంపై పూర్తిగా శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. ఉద్యోగ ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారపు…

50 minutes ago

Tea : టీని మళ్లీ మళ్లీ వేడి చేస్తున్నారా? అయితే ఈ న్యూస్ మీరు త‌ప్ప‌క చ‌ద‌వాలి..?

Tea : భారతీయుల దైనందిన జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం నిద్రలేవగానే ఒక కప్పు టీతో రోజు…

2 hours ago

Ponnam Prabhakar : ‘తెలంగాణ ప్రేమ నాటకం’.. పవన్ కళ్యాణ్‌పై పొన్నం ప్రభాకర్ ఘాటు వ్యాఖ్యలు..!

Ponnam Prabhakar  : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత Pawan Kalyan హైదరాబాద్‌లో…

10 hours ago

CM Vijay BJP : సీఎం విజయ్‌కు షాక్ ఇవ్వాలనే బీజేపీ ప్లాన్..? తమిళ రాజకీయాల్లో కొత్త సంచలనం..!

CM Vijay BJP : తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ హాట్ టాపిక్‌గా మారింది. నటుడు నుంచి…

11 hours ago

Peddi Movie : US బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ దూకుడు.. అడ్వాన్స్ బుకింగ్స్‌తో Ram Charan రికార్డుల వేట..!

Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ విడుదలకు…

12 hours ago

Peddi Movie First Review : రామ్ చ‌ర‌ణ్‌ పెద్ది మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ.. ఎలా ఉందంటే..?

Peddi Movie First Review : మెగా పవర్ స్టార్ Ram Charan హీరోగా, దర్శకుడు Buchi Babu Sana…

13 hours ago

Vaibhav Sooryavanshi : 15 ఏళ్లకే కోట్ల వర్షం.. వైభవ్ సూర్యవంశీ IPL 2026 సంపాదన చూసి షాక్ అవ్వాల్సిందే!

Vaibhav Sooryavanshi : IPL 2026 సీజన్‌లో భారత క్రికెట్‌కు మరో కొత్త సూపర్ స్టార్ దొరికాడు. కేవలం 15…

20 hours ago

Peddi Pre-Release Event : ‘పెద్ది’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు భారీ ఏర్పాట్లు.. రామ్ చరణ్ అభిమానుల్లో ఉత్సాహం!

Peddi Pre-Release Event : టాలీవుడ్‌లో ప్రస్తుతం అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న చిత్రాల్లో ‘పెద్ది’ ఒకటి. మెగా పవర్ స్టార్…

21 hours ago

Bank Holidays in June 2026 : బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. జూన్‌లో 11 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందుగానే మీ పనులు పూర్తి చేసుకోండి!

Bank Holidays in June 2026 : జూన్ నెలలో బ్యాంకులకు సంబంధించిన పనులు ఉన్నవారు ముందుగానే అప్రమత్తంగా ఉండాల్సిన…

22 hours ago

Coconut Water : కిడ్నీ స్టోన్స్, షుగర్, హ్యాంగోవర్‌పై కొబ్బరి నీళ్ల‌తో ఇన్ని బెనిఫిట్స్‌హా..!

Coconut Water  : వేసవి కాలంలో ఎక్కువ మంది సహజంగా తాగే ఆరోగ్యకరమైన పానీయాల్లో కొబ్బరి నీళ్లు ముందుంటాయి. శరీరానికి…

23 hours ago

Summer Drink : ఎండలకు చెక్ పెట్టే సౌఫ్ కా శర్బత్.. తాగితే కలిగే అద్భుత లాభాలు ఇవే!

Summer Drink : వేసవి కాలంలో మండే ఎండలు, అధిక ఉష్ణోగ్రతల వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం సాధారణ…

1 day ago