Home » Health » Papaya Can Be Healthy People With These Problems
Health

Papaya : బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే… కానీ ఈ సమస్యలు ఉన్నవారు అస్సలు తినకూడదట…??

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: December 6, 2024, 11:00 am
Advertisement

Papaya : మనం ప్రతిరోజు ఎన్నో రకాల పండ్లను తీసుకుంటూ ఉంటాం. అయితే వాటిల్లో బొప్పాయి కూడా ఒకటి. ఈ బొప్పాయిలో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. అలాగే ఫైబర్ మరియు విటమిన్ ఏ, విటమిన్ ఇ,లాంటి యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువ స్థాయిలో ఉన్నాయి. అయితే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే గుండె జబ్బుల ప్రమాదాలను తగ్గిస్తుంది. అలాగే యాంటీ యాక్సిడెంట్లు కొలెస్ట్రాల్ ఆక్సీకరణను కూడా తగ్గిస్తుంది. అందువలన బొప్పాయి పండ్లను ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే బొప్పాయిని ప్రతిరోజు తీసుకోవాలని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేకాక బొప్పాయి జీర్ణ సంబంధించిన సమస్యలను కూడా నయం చేస్తుంది. అలాగే మలబద్ధకం మరియు జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడే వారికి బొప్పాయి చక్కటి పరిష్కారం అని చెప్పొచ్చు. అయితే బొప్పాయిని ఎక్కువగా తీసుకుంటే అది ప్రయోజనాలకు బదులుగా హాని కూడా కలిగిస్తుంది అని అంటున్నారు. అలాగే కొన్ని రకాల వ్యాధులతో ఇబ్బంది పడుతున్నా వారు ఈ పండుకు దూరంగా ఉండాలి అని అంటున్నారు. ఈ పండులో ఫైబర్ మరియు విటమిన్ సి లాంటి గొప్ప పోషకాలు ఉన్నప్పటికీ కూడా ఈ పండు చాలామందికి హాని కలిగిస్తుంది అని అంటున్నారు. అయితే ఎలాంటి వారు బొప్పాయి కి దూరంగా ఉండాలో తెలుసుకుందాం…

Advertisement

Papaya : బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే… కానీ ఈ సమస్యలు ఉన్నవారు అస్సలు తినకూడదట…??

Papaya కిడ్నీ స్టోన్ రోగులు

బొప్పాయిలో విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది. అయితే ఈ పోషకం అనేది కాల్షియం తో కలిస్తే సమస్యలు అనేవి వస్తాయి. కావున కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు ఈ పండుకు దూరంగా ఉండాలని అంటున్నారు. ఈ రకమైన ఔషధం తీసుకునే వ్యక్తులు : మీరు బ్లడ్ థినర్ ఔషధం తీసుకున్నట్లయితే పులియబెట్టిన బొప్పాయి మీకు హాని కలిగిస్తుంది అని అంటున్నారు. అలాగే గుండె సమస్యలతో బాధపడే వారు కూడా తరచూ తీసుకుంటే రక్తప్రసరణలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాంటి వారు కూడా బొప్పాయిని తీసుకుంటే గాయం అయినప్పుడు రక్తస్రావం అనేది సులభంగా మొదలవుతుంది…

Advertisement

ఆస్తమా రోగులు : మీకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటే బొప్పాయి కి దూరంగా ఉండాలి అని అంటున్నారు. ఈ పండులో ఉండే ఎంజెమ్ ఆస్తమా రోగులకు హాని కలిగిస్తుంది అని అంటున్నారు…

గర్భిణి స్త్రీలు : చాలామంది వైద్యుల అభిప్రాయ ప్రకారం చూస్తే, గర్భిణీ స్త్రీలు బొప్పాయిని అస్సలు తినకూడదు అని అంటారు. ఎందుకు అంటే ఇది వారికి ఎంతో హాని కలిగిస్తుంది కాబట్టి…

Advertisement

అలర్జీలతో ఇబ్బంది పడుతున్న వ్యక్తులు : మీరు అలర్జీ లాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చినట్లయితే బొప్పాయి కి దూరంగా ఉండాలి అని అంటున్నారు. ఎందుకు అంటే ఇందులో ఉండే పాపైన్ అనే మూలకం సమస్యలను ఇంకా పెంచుతుంది. అలాగే మీకు చర్మం లో దురద లేక మంట కూడా వచ్చే అవకాశం ఉంటుంది

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి