Gas In Stomach
Gas In Stomach : తీవ్రమైన గ్యాస్టిక్ సమస్య వెనుక చాలా కారణాలు ఉంటాయి. క్రమం తప్పకుండా ఎక్కువ సేపు ఖాళీ కడుపుతో ఉండడం.. లేదా అనారోగ్యకారమైన మసాలా ఆహారం ఎక్కువగా తీసుకుంటూ ఉండడం, ఆల్కహాల్ తీసుకోవడం, ఒత్తిడి, టెన్షన్ మరియు ఆందోళన కూడా గ్యాస్టిక్ సమస్య పెరగడానికి కారణాలుగా చెప్పుకోవచ్చు.. అంతేకాకుండా కొంతమంది ఆహారం చాలా తొందరగా తినేస్తూ ఉంటారు. అంటే ఆహారం సరిగ్గా నవల కుండా తినేస్తారు. అంతేకాకుండా కడుపులో కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు కూడా గ్యాస్టిక్ సమస్యకు దారితీస్తాయి. అయితే కొందరు అదే పనిగా తీసుకుంటే ఆరోగ్యమని క్యాబేజీ కూరగాయలు తీసుకుంటూ ఉంటారు. ఈ కారణంగా ఉబ్బరంగా అనిపిస్తుంది కడుపు. చాలా మంది పచ్చి కూరగాయలతో సలాడ్లు కూడా చేసుకుని తింటారు. అందుకే వీటిని తిన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా గ్యాస్ సంబంధిత డ్రింకులు తాగితే తగ్గిపోతుంది అనుకుంటారు. ఇందులో కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది. ఇది కడుపులోకి ప్రవేశించినప్పుడు గ్యాస్టిక్ నొప్పికి కారణం అవుతుంది. అయితే ఇది ఏమంత పెద్ద సమస్య కాకపోయినా మనం జాగ్రత్త తీసుకోకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి సింపుల్ గా మన ఇంట్లో దొరికే చిట్కాలతో ప్రతిరోజు మీకు అందుబాటులో ఉండే ఇంగ్రిడియంట్స్ తో ఈ గ్యాస్ సమస్యను తగ్గించుకోవచ్చు..
కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కడుపుబ్బరం గ్యాస్టిక్ సమస్యలు రావు.. నూనె మసాలాలు తిన్న తర్వాత కలిగే నష్టాన్ని సరి చేసుకోవడానికి మీ భోజనాన్ని త్వరగా చేరడం కావడానికి ఈ చిట్కాలు ఉపయోగపడతాయి. ముందుగా మీరు మీ ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. తగినంత నీరు తాగుతూ ఉండాలి. మసాలాలు జంక్ ఫుడ్ లో జోలికి పోకుండా చూసుకోవాలి. ఏది పడితే అది తినే అలవాటు కూడా తగ్గించుకోవాలి. దాని వల్ల ముందుగా మీ పేగులు శుభ్రం అవుతాయి. అప్పుడు గ్యాస్ ట్రబుల్ రాకుండా ఈ హోమ్ రెమిడీ నూటికి నురు శాతం పనిచేసి గ్యాస్ ట్రబుల్ మీ దడిచేరకుండా కాపాడుతుంది. మీకు పొట్ట ఉబ్బరంగా అనిపించి చాలా ఇబ్బందిగా ఉంటే స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో నీళ్లను బాగా మరిగించి ఒక కప్పులో వేసుకుని మెల్లమెల్లగా తాగండి. ఈ వేడి నీళ్లు తాగేసరికి పేగుల్లో కదలికొచ్చి లోపల ఉన్న గ్యాస్ ని బయటకు పంపిస్తాయి. ఈ వేడి నీళ్లు ఈ రెమెడీ మీకు వెంటనే రిలీఫ్ ఇస్తుంది. మరుగుతున్న నీళ్లలో ఒకటి లేదా రెండు యాలకులు వేసుకొని బాగా మరిగించి ఆ నీరు తాగిన కూడా మంచి ఫలితం ఉపశమనం ఉంటుంది. మీరు కావాలనుకుంటే ఓ రెండు లవంగాలు కూడా వేసుకుని తాగొచ్చు. నీళ్లు కాచుకుని తాగేటంత ఓపిక టైం మీ దగ్గర లేకపోతే కనుక ఒక యాలకులు నోట్లో వేసుకుని బాగా నమలండి. ఇలా నమిలితే వచ్చిన రసాన్ని చక్కగా మింగితే గ్యాస్ బయటకు వెళ్ళిపోయి పొట్ట ఫ్రీగా అయిపోతుంది.
పొట్ట ఉబ్బరాన్ని తగ్గించడంలో యాలుకలు బాగా పనిచేస్తాయి. మీరు గ్యాస్ ట్రబుల్ తో బాధపడేటప్పుడు పొట్టను బెల్టుతోనో బొందులతో బిగించి ఉంచకండి. పొట్టను ఫ్రీగా ఉంచుకోవాలి అంటే వదులుగా ఉండే బట్టలు వేసుకోండి. అలాగే వేడి నీళ్లలో వాము వేసి మరిగించి తాగిన కూడా మంచి ఫలితం ఉంటుంది. ఈ చిన్న చిన్న చిట్కాలు గ్యాస్ ట్రబుల్ కి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. మరి ఈ గ్యాస్ మల్లి మల్లి మనల్ని ఇబ్బంది పెట్టకుండా పొట్ట ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలో దానికి ఒక సూపర్ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ప్రత్యేకంగా గ్యాస్ ట్రబుల్ తో బాధపడే వాళ్ళు ఎక్కువసార్లు తినడం తగ్గించాలి. అంటే రోజుకు మూడు పూటలా మాత్రం తింటే సరిపోతుంది. అంత ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణ క్రియ చక్కగా జరుగుతుంది. కడుపు ఉబ్బరంగా ఉన్న గ్యాస్ సమస్య అని తెలిసిన మీరు ఒకటి గ్రహించాలి. మీ పొట్టలో మీరు తిన్న ఆహారం అలాగే నిల్వ ఉండిపోయిందని వెంటనే వేడి నీటిలో వాము కానీ లవంగాలు గాని ఇలా ఏది మీకు వీలుగా ఉంటే ఆ నీటిని తయారు చేసుకుని అప్పటికప్పుడు తాగితే రిలీఫ్ ని పొందవచ్చు. అందుకు తగిన జాగ్రత్తలు ఎప్పటికప్పుడు తీసుకోండి. మీ పొట్టను పది కాలాలపాటు కూల్ గా శుభ్రంగా ఉంచుకోండి…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
This website uses cookies.