
Turmeric : అత్యధిక పసుపుతో కాలేయం దెబ్బతినే ప్రమాదం.. అమెరికాలో ఘటన, డాక్టర్ల హెచ్చరిక!
Turmeric : అత్యంత సాధారణంగా కనిపించే పసుపు కూడా అధిక మోతాదులో తీసుకుంటే ప్రాణాంతకమవుతుందనేది తాజాగా అమెరికాలో జరిగిన షాకింగ్ ఘటన ద్వారా వెల్లడైంది. అక్కడ 57 ఏళ్ల మహిళ ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రోజూ 2,250 మిల్లీగ్రాముల పసుపు సప్లిమెంట్లు తీసుకుంటూ, ఆమెలో కాలేయ సమస్యలు తీవ్రంగా మారిపోయాయి.ఆమె శరీరంలో మంట, వాపును తగ్గించాలనే ఉద్దేశంతో ఈ సప్లిమెంట్లు తీసుకోవడం ప్రారంభించింది.
కానీ కొన్ని వారాల్లోనే ఆరోగ్యం క్షీణించింది. ముఖం పసిపచ్చగా మారడం, మూత్రం ముదురుగా మారడం, అలసట, నీరసం వంటి లక్షణాలు కనిపించాయి. వైద్య పరీక్షల్లో ఆమె కాలేయ ఎంజైమ్‌లు సాధారణం కంటే 60 రెట్లు అధికంగా ఉన్నట్లు బయటపడింది. ఇది కాలేయ వైఫల్యానికి బాగా దగ్గరగా ఉన్న స్థితి. పసుపులోని ముఖ్యమైన క్రియాశీల పదార్ధం కర్కుమిన్, శరీరంలోని మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది.
Turmeric : అత్యధిక పసుపుతో కాలేయం దెబ్బతినే ప్రమాదం.. అమెరికాలో ఘటన, డాక్టర్ల హెచ్చరిక!
కానీ దీనిని అధిక మోతాదులో, ముఖ్యంగా సప్లిమెంట్ రూపంలో తీసుకుంటే శరీరం పూర్తిగా ప్రాసెస్ చేయలేక కాలేయాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.డాక్టర్ల ప్రకారం, రోజుకు 500mg–1000mg వరకు మాత్రమే కర్కుమిన్ సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది. కానీ మార్కెట్‌లోని కొన్ని సప్లిమెంట్లలో 90% కర్కుమిన్ ఉండటంతో పాటు, నల్ల మిరియాల సారంతో కలిపి శోషణ సామర్థ్యాన్ని పెంచుతారు. ఇది శరీరంపై మరింత ఒత్తిడి పెడుతుంది.డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి సప్లిమెంట్లు తీసుకోవద్దు.పసుపు ఆరోగ్యానికి మేలు చేస్తుందనేది నిజమే. కానీ ఏదైనా ఎక్కువైతే విషమే అవుతుంది
India vs Namibia : ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. గ్రూప్-A లో…
ధన్య బాలకృష్ణ, Dhania Balakrishna ,, Ester Noronha ఎస్తర్ నోరోన్హా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న హారర్ థ్రిల్లర్ చిత్రం…
Funky Movie Review : సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ Producer Naga Vamsi…
TVK Vijay : తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా 'దళపతి' విజయ్ పోటీపైనే చర్చ జరుగుతోంది. తన కొత్త…
BB JODI Season 2 Manas : బిగ్ బాస్ జోడీ సీజన్ 2 లేటెస్ట్ ప్రోమో బుల్లితెర ప్రేక్షకులను…
BB JODI Season 2 : బీబీ జోడీ సీజన్ 2 లేటెస్ట్ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో వైరల్ అవుతోంది,…
Viral : విలువలనేవి అటకెక్కిన వైనం ఇది. మనిషి తన విచక్షణను కోల్పోయి, వావి వరసలను విస్మరించి ప్రవర్తిస్తే సమాజం…
Vijay - Rashmika : టాలీవుడ్‌లో క్రేజీ జంటగా పేరుగాంచిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గురించి మరోసారి ఆసక్తికరమైన…
This website uses cookies.