Turmeric : అత్యధిక పసుపుతో కాలేయం దెబ్బతినే ప్రమాదం.. అమెరికాలో ఘటన, డాక్టర్ల హెచ్చరిక! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Turmeric : అత్యధిక పసుపుతో కాలేయం దెబ్బతినే ప్రమాదం.. అమెరికాలో ఘటన, డాక్టర్ల హెచ్చరిక!

 Authored By ramu | The Telugu News | Updated on :14 July 2025,10:00 am

Turmeric : అత్యంత సాధారణంగా కనిపించే పసుపు కూడా అధిక మోతాదులో తీసుకుంటే ప్రాణాంతకమవుతుందనేది తాజాగా అమెరికాలో జరిగిన షాకింగ్ ఘటన ద్వారా వెల్లడైంది. అక్కడ 57 ఏళ్ల మహిళ ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రోజూ 2,250 మిల్లీగ్రాముల పసుపు సప్లిమెంట్లు తీసుకుంటూ, ఆమెలో కాలేయ సమస్యలు తీవ్రంగా మారిపోయాయి.ఆమె శరీరంలో మంట, వాపును తగ్గించాలనే ఉద్దేశంతో ఈ సప్లిమెంట్లు తీసుకోవడం ప్రారంభించింది.

Turmeric : ఇలా చేస్తే డేంజ‌ర్..

కానీ కొన్ని వారాల్లోనే ఆరోగ్యం క్షీణించింది. ముఖం పసిపచ్చగా మారడం, మూత్రం ముదురుగా మారడం, అలసట, నీరసం వంటి లక్షణాలు కనిపించాయి. వైద్య పరీక్షల్లో ఆమె కాలేయ ఎంజైమ్‌లు సాధారణం కంటే 60 రెట్లు అధికంగా ఉన్నట్లు బయటపడింది. ఇది కాలేయ వైఫల్యానికి బాగా దగ్గరగా ఉన్న స్థితి. పసుపులోని ముఖ్యమైన క్రియాశీల పదార్ధం కర్కుమిన్, శరీరంలోని మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది.

Turmeric అత్యధిక పసుపుతో కాలేయం దెబ్బతినే ప్రమాదం అమెరికాలో ఘటన డాక్టర్ల హెచ్చరిక

Turmeric : అత్యధిక పసుపుతో కాలేయం దెబ్బతినే ప్రమాదం.. అమెరికాలో ఘటన, డాక్టర్ల హెచ్చరిక!

కానీ దీనిని అధిక మోతాదులో, ముఖ్యంగా సప్లిమెంట్ రూపంలో తీసుకుంటే శరీరం పూర్తిగా ప్రాసెస్ చేయలేక కాలేయాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.డాక్టర్ల ప్రకారం, రోజుకు 500mg–1000mg వరకు మాత్రమే కర్కుమిన్ సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది. కానీ మార్కెట్‌లోని కొన్ని సప్లిమెంట్లలో 90% కర్కుమిన్ ఉండటంతో పాటు, నల్ల మిరియాల సారంతో కలిపి శోషణ సామర్థ్యాన్ని పెంచుతారు. ఇది శరీరంపై మరింత ఒత్తిడి పెడుతుంది.డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి సప్లిమెంట్లు తీసుకోవద్దు.పసుపు ఆరోగ్యానికి మేలు చేస్తుందనేది నిజమే. కానీ ఏదైనా ఎక్కువైతే విషమే అవుతుంది

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది