Rowan Berry : రోవాన్ బెర్రీ క్యాన్సర్, కిడ్నీలను శుభ్రపరిచేందుకు సహాయపడగలదా..?
Rowan Berry : రోవాన్ బెర్రీ ఇది ఆపిల్ జాతికి చెందిన పండు. దీన్ని కలప కోసం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా శీతాకాలంలో తినవలసిన పండు అని పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు. దీనిని రోవాన్ ట్రీ టాక్సా లేదా రోవాన్‌బెర్రీ అని కూడా పిలుస్తారు. ఈ రోవాన్ పండ్లలో విటమిన్ సి, ఇ, సోర్బిక్ ఆమ్లం, డైటరీ ఫైబర్ అధిక మొత్తంలో ఉన్నాయి. ఈ రోవాన్ పండ్లలో ఆంథోసైనిన్స్, టానిన్లు, పాలీఫెనోలిక్ సమ్మేళనాలు, వివిధ రకాల క్వెర్సెటిన్ ఫ్లేవానాలు కూడా ఉన్నాయి.రోగనిరోధక వ్యవస్థను పెంచడంలోనూ, శ్వాసకోశ వ్యవస్థను బలోపేతం చేయడంలోనూ , జీర్ణక్రియను మెరుగుపరచడంలోనూ , క్యాన్సర్, వివిధ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుంచి వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలోనూ ఇవి ఉపయోగపడతాయి.
ఈ రోవాన్ పండు లో యాంటీ ఆక్సిడెంట్ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. కావున క్యాన్సర్ కణాలతో పోరాడ కలుగుతుంది. అలాగే క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా వాటిని నశింపజేస్తుంది. ఇటీవల జరిగినటువంటి పరిశోధనల్లో ఈ పండులోని టానిన్ గుండెపోటు ను నివారించే, శరీర నిరోధకతను పెంచే పదార్థాలు ఉన్నాయని ఈ పరిశోధనలో తేలింది.ఈ పండులో రోవాన్ కెరోటిన్ వీ గ్లాకోమా ఉండటం వల్ల .దీంతో రోవాన్ బెర్రీ కంటి చూపును కూడా రక్షిస్తుంది. కంటి చూపుని మెరుగుపరిచి కంటికి ఒత్తిడి కలగకుండా ఉండటంలో సహాయం చేస్తుంది. అలాగే ఈ పండులో అధికంగా విటమిన్ సి ఉండడంతో శీతాకాలంలో వచ్చే జలబు వంటి సీజనల్ వ్యాధుల నుంచి కూడా రక్షిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, సోర్బిక్ ఆమ్లం, ఆస్కార్బిక్ ఆమ్లం చర్మ ఆరోగ్యన్ని రక్షించడానికి పనిచేస్తాయి.
Rowan Berry : ఈ రోవాన్ బెర్రీస్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు…
దీనిలోని ఫైబర్ కారణంగా జీర్ణ వ్యవస్థ సమస్యలు, అజీర్తి వంటి సమస్యలను దూరం చేస్తుంది. ఇంకా ఋతుస్రావం సమయంలో వచ్చే నొప్పి నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా పండు వల్ల మరొక ప్రయోజనం కూడా ఉంది. అది మూత్ర మార్గాన్ని శుభ్రపరచడంలో. పిత్తాశయంలోని రాళ్ళను, మూత్రాశయం నుంచి కలిగే మంట నుంచి ఉపశమనన్ని ఇస్తుంది. మూత్రనాళ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.ఈ రోవాన్ బెర్రీ మొక్క నుంచి అందే బెరడు, ఆకులు, పండ్లు, మన శరీరానికి మేలు చేస్తాయి. అయితే కొంతమంది శరీరతత్వం వేరుగా ఉంటుంది కావున కొంతమందికి ఈ పండు పడకపోవచ్చు అందుకని వైద్యుని సంప్రదించి సమాచారం తెలుసుకోవడం మంచిది. ఈ పండ్లను ఎక్కువ కాలం కూడా నిల్వ చేసుకోకూడదు. ఇలా నిల్వ చేసిన వాటిని తినటం వల్ల అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందని పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు.