
Screen Time : ప్రతి ఒక్కరు చేసే ఈ చిన్న తప్పులే... మీ కొంపను ముంచుతాయి... ఈ 7 అలవాట్లే మిమ్మల్ని కాపాడగలవు...?
Screen Time : నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ,చిన్నపిల్లలు దెగ్గర నుంచి పెద్దల వరకు అందరూ డిజిటల్ ప్రపంచంలో స్మార్ట్ ఫోన్లో, ల్యాప్ టాప్ లో,టీవీలు మన దైనందిన జీవితంలో అంతర్భాగంగా మారాయి. అధిక స్క్రీన్ల సమయం మన కళ్ళ పైనే కాదు,మెదడుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు. ఇది మానసిక ఆరోగ్యం పైన,నిద్ర,ఏకాగ్రతను దెబ్బతీస్తాయి.ఇది ఒక వ్యసనం అని చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితుల నుంచి, మీ మెదడును రక్షించుకోవడానికి కొన్ని కీలక నివారణ చిట్కాలు నిపుణులు తెలియజేస్తున్నారు. అధికంగా స్క్రీన్ల సమయం మెదడులోని రసాయన సమతుల్యతను దెబ్బతీస్తుంది. ముఖ్యంగా, డొకో మైన్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది. ఇది అడిక్షన్ (వ్యసనం )లాంటి లక్షణాలకు దారితీస్తుంది. నిద్రలేమి,ఏకాగ్రత లోపం, చికాకు,డిప్రెషన్,ఆందోళన వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. పిల్లల్లో అయితే మెదడు అభివృద్ధిపై కూడా దుష్ప్రభావం చూపుతుంది. స్క్రీన్ ల నుంచి వచ్చే నీలి కాంతి వెలుగులు నిద్రను నియంత్రించే మెలటోని ఉత్పత్తిని అడ్డుకుంటాయి.
Screen Time : ప్రతి ఒక్కరు చేసే ఈ చిన్న తప్పులే… మీ కొంపను ముంచుతాయి… ఈ 7 అలవాట్లే మిమ్మల్ని కాపాడగలవు…?
ఈరోజు కొంత సమయం పాటు అన్ని స్క్రీన్ లకు దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇది మీ మెదడుకు విశ్రాంతినిస్తుంది. ఉదయం నిద్ర లేవగానే, రాత్రి నిద్ర పోవడానికి ముందు స్క్రీన్ వాడకాన్ని తగ్గించాలి.
నిద్ర వేల నియమం : నిద్రపోవడానికి కనీసం ఒక గంట ముందు,ఫోన్లు,ట్యాబ్లు,టీవీలు చూడడం మానేయండి.ఇది సహజ నిద్ర విధానాలకు సహాయపడుతుంది.
60 – 20 -20 నియమం పాటించండి : ప్రతి 20 నిమిషాలకు స్క్రీన్ సమయం తర్వాత, 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువులను, 20 సెకండ్ల పాటు చూడండి. అది కళ్ళకు విశ్రాంతినిస్తుంది.కళ్ళ ఒత్తిడి తగ్గిస్తుంది.
ఆరు బయట గడపండి : ఇంట్లో ఉండి స్క్రీన్ లకి అతుక్కుపోకుండా బయట గడపడానికి ప్రయత్నించండి. ఆటలు ఆడడం నడవడం ప్రకృతిలో సమయం గడపడం వంటివి చేస్తే,మీ మెదడుకు తేజం కలుగుతుంది.మానసిక స్థితి మెరుగు పడుతుంది.
స్క్రీన్ టైం ట్రాకింగ్ : మీ డివైస్లలో ఉండే స్క్రీన్ టైం ట్రాకింగ్ యాప్ లను ఉపయోగించి మీరు ఎంత సమయం స్క్రీన్ ముందు గడుపుతున్నారో తెలుసుకోండి ఇది మీ వినియోగాన్ని నియంత్రించడం సహాయపడుతుంది.
నో స్క్రీన్ జోన్లు : ఇంట్లో కొన్ని ప్రదేశాలకు (ఉదాహరణకు బెడ్ రూమ్, డైనింగ్ టేబుల్) నో స్క్రీన్ జోన్లుగా ప్రకటించండి.ఆ ప్రదేశాలు డిజిటల్ పరికరాలను వాడకుండా ఉంచండి.
ఆప్తులతో గడపం డి : గ్రీన్ సమయాన్ని తగ్గించుకోవడానికి పుస్తకాలు చదవడం, సంగీతం వినడం,కొత్త హామీ నేర్చుకోవడం,స్నేహితులు, కుటుంబ సభ్యులతో ముఖాముఖిగా మాట్లాడటం. వంటి ప్రత్యామ్నాయ కార్యకలాపాలను ఎంచుకోండి. ఇలాంటి చిట్కాలను పాటిస్తే స్క్రీన్ సమయం ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు.ఇలా చేయడం వల్ల మీ మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. మొత్తం జీవన నాణ్యతను మెరుగుపరుచుకోవచ్చు.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.