Beauty Tips : చాలా మంది తమ మొహం నల్లగా ఉందని బాధపడుతుంటారు. నలుగురిలోకి వెళ్లేందుకు ఇష్టపడరు. తెల్లగా మారేందుకు వేలకు వేల డబ్బులు ఖర్చు చేస్తూ… సబ్బులు, ఫేస్ వాష్ లు, క్రీములు… ఇలా చాలా వాటిని వినియోగిస్తుంటారు. కానీ వీటి వల్ల అప్పుడు తెల్లబడినా మళ్లీ క్రీములు పెట్టడం మానేస్తే మునుపటి రంగు తేలుతారు. అలాగే రసాయనాలు కలిపిన క్రీముల వల్ల సైడ్ ఎఫెక్స్ట్ కూడా ఉంటాయి. వీటన్నిటికి చెక్ పెడ్తూ… ముఖాన్ని కాంతి వంతంగా తయారు చేస్కోడానికి అద్భుతమైన చిట్కా ఉంది. ఇంట్లోనే ఉండే పదార్థాలతోనే పదే పది నిమిషాల్లో ఈ ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకోవచ్చు. దీని వల్ల ముఖ చర్మానికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి.
అలాగే చర్మంపై పేరుకుపోయిన మృత కణాలు, పొల్యూషన్ వల్ల వచ్చే మురికిని శుభ్ర పరిచి ముఖాన్ని కాంతివంతంగా మెరిసేలా చేయడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఈ చిట్కా ఏమిటి, దాని వల్ల కలిగే లాభాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక గిన్నెలో స్పూన్ పంచదార, ఒక స్పూన్ రాగి పిండి, స్పూన్ శనగ పిండి, స్పూన్ కొబ్బరి నూనె వేసుకోవాలి. వీటన్నింటిని బాగా కలిపి ఇందులో కొద్దిగా నీటిని వేసి కలిపిన మిశ్రమాన్ని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ముఖాన్ని నీటితో శుభ్రంగా కడుక్కొని ఈ మిశ్రమాన్ని మొహంపై అప్లై చేసుకోవాలి. ఒక ఐదు నిమిషఆల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి. తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్ర పరుచుకోవాలి.
ఇందులో వాడిన పంచదార ముఖంపై పేరుకు పోయిన వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ను తొలగించి మూఖాన్ని కాంతి వంతంగా తయారు చేస్తుంది. అలాగే రాగి పిండిలో ఉన్న అమైనో ఆమ్లాలు.. చర్మంపై కొల్లాజెన్ ఏర్పడడానికి సహాయ పడుతుంది. లైసిన్ వంటి ముఖ్యమై అమైనో ఆమ్లాలు ఉండటం వల్ల మృత చర్మ కణజాలాన్ని డలించడం ద్వారా తగ్గిస్తుంది. ముఖంపై రాగి పండిని తరచూ రాయం వల్ల చర్మంపై వృద్ధఆప్య ప్రభావాలను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే శనగ పిండి ముఖంపై పేరుకు పోయిన టాన్ ను తొలగిస్తుంది. మొటిమలకు కారణం అయ్యే జిడ్డును కూడా వదిలిస్తుంది. యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కల్గి ఉండటం వల్ల మొటిమలు రాకుండా అడ్డుకుంటుంది.
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
This website uses cookies.