Beauty Tips : శనగపిండిలో ఇవి కలిపి ముఖానికి రాస్తే.. పదిహేను రోజుల్లోనే తెల్లబడతారు! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Beauty Tips : శనగపిండిలో ఇవి కలిపి ముఖానికి రాస్తే.. పదిహేను రోజుల్లోనే తెల్లబడతారు!

 Authored By pavan | The Telugu News | Updated on :1 June 2022,5:00 pm

Beauty Tips : చాలా మంది తమ మొహం నల్లగా ఉందని బాధపడుతుంటారు. నలుగురిలోకి వెళ్లేందుకు ఇష్టపడరు. తెల్లగా మారేందుకు వేలకు వేల డబ్బులు ఖర్చు చేస్తూ… సబ్బులు, ఫేస్ వాష్ లు, క్రీములు… ఇలా చాలా వాటిని వినియోగిస్తుంటారు. కానీ వీటి వల్ల అప్పుడు తెల్లబడినా మళ్లీ క్రీములు పెట్టడం మానేస్తే మునుపటి రంగు తేలుతారు. అలాగే రసాయనాలు కలిపిన క్రీముల వల్ల సైడ్ ఎఫెక్స్ట్ కూడా ఉంటాయి. వీటన్నిటికి చెక్ పెడ్తూ… ముఖాన్ని కాంతి వంతంగా తయారు చేస్కోడానికి అద్భుతమైన చిట్కా ఉంది. ఇంట్లోనే ఉండే పదార్థాలతోనే పదే పది నిమిషాల్లో ఈ ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకోవచ్చు. దీని వల్ల ముఖ చర్మానికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి.

అలాగే చర్మంపై పేరుకుపోయిన మృత కణాలు, పొల్యూషన్ వల్ల వచ్చే మురికిని శుభ్ర పరిచి ముఖాన్ని కాంతివంతంగా మెరిసేలా చేయడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఈ చిట్కా ఏమిటి, దాని వల్ల కలిగే లాభాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక గిన్నెలో స్పూన్ పంచదార, ఒక స్పూన్ రాగి పిండి, స్పూన్ శనగ పిండి, స్పూన్ కొబ్బరి నూనె వేసుకోవాలి. వీటన్నింటిని బాగా కలిపి ఇందులో కొద్దిగా నీటిని వేసి కలిపిన మిశ్రమాన్ని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ముఖాన్ని నీటితో శుభ్రంగా కడుక్కొని ఈ మిశ్రమాన్ని మొహంపై అప్లై చేసుకోవాలి. ఒక ఐదు నిమిషఆల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి. తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్ర పరుచుకోవాలి.

simple and effective face pack with basan powder

simple and effective face pack with basan powder

ఇందులో వాడిన పంచదార ముఖంపై పేరుకు పోయిన వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ను తొలగించి మూఖాన్ని కాంతి వంతంగా తయారు చేస్తుంది. అలాగే రాగి పిండిలో ఉన్న అమైనో ఆమ్లాలు.. చర్మంపై కొల్లాజెన్ ఏర్పడడానికి సహాయ పడుతుంది. లైసిన్ వంటి ముఖ్యమై అమైనో ఆమ్లాలు ఉండటం వల్ల మృత చర్మ కణజాలాన్ని డలించడం ద్వారా తగ్గిస్తుంది. ముఖంపై రాగి పండిని తరచూ రాయం వల్ల చర్మంపై వృద్ధఆప్య ప్రభావాలను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే శనగ పిండి ముఖంపై పేరుకు పోయిన టాన్ ను తొలగిస్తుంది. మొటిమలకు కారణం అయ్యే జిడ్డును కూడా వదిలిస్తుంది. యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కల్గి ఉండటం వల్ల మొటిమలు రాకుండా అడ్డుకుంటుంది.

Advertisement
WhatsApp Group Join Now

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది