Sleep Tips : మీకు నిద్ర పట్టడం లేదా… అయితే, దిండు కింద ఇవి పెట్టుకోండి… క్షణాల్లో నిద్ర పడుతుంది..?

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Published on: July 27, 2025, 11:00 am
  •  Sleep Tips : మీకు నిద్ర పట్టడం లేదా... అయితే, దిండు కింద ఇవి పెట్టుకోండి... క్షణాల్లో నిద్ర పడుతుంది..?

Sleep Tips : ప్రస్తుత కాలంలో చాలామంది కూడా తమ ఈ లైఫ్ లో ఒత్తిళ్ల వల్ల నిద్రకు భంగం ఏర్పడుతుంది. తద్వారా అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఆందోళన,ఒత్తిడి వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇలా నిద్ర పట్టక ఇబ్బంది పడే వారికి,ఈ చిట్కాలను ఫాలో అయితే,మంచి నిద్ర మీ సొంతం. నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం. ఒక్కరు కూడా ఆరోగ్యకరమైన నిద్రను అలవాటు చేసుకోవడం చాలా ముఖ్యం. ఎంత నిద్రపోతే అంత ఆరోగ్యం. సంపూర్ణ ఆరోగ్యం కావాలంటే నిద్ర కూడా పోవాలి. నిద్రలోనే సర్వరోగ నివారణ ఉంది. అలాంటి నిద్రను ఈరోజుల్లో చాలామంది దూరమవుతున్నారు. నిద్ర పట్టక అస్తవ్యస్తమవుతున్నారు. అంతేకాదు,కొన్ని సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే,రోగ నిరోధక శక్తి పెంపొందించాలన్న ఈ టిప్స్ ని పాటించండి. నిద్ర కావాలంటే చాలా గగనంగా మారింది ఈరోజుల్లో. అంత కష్టపడి పని చేసి వచ్చినప్పటికీ రాత్రి నిద్రపోవడం లో ఇబ్బంది పడుతూనే ఉన్నారు. వారికి ఈ చిట్కాలను పాటించినట్లయితే సుఖవంతమైన నిద్ర కలుగుతుంది. అయితే,శరీరం నిద్రలో వివిధ ముఖ్యమైన పనులను నిర్వహిస్తుంది. మనం నిద్రపోయినప్పుడు కణాలు రీసెట్ అవుతాయి. క్యాన్సర్ కణాల నిర్మాణం పెరుగుదలను నిరోధించడంలో నిద్రా కీలకపాత్రను పోషిస్తుంది. నిద్రలో ఉత్పత్తి అయ్యే మెలటోనిన్ హార్మోన్ మనల్ని యవ్వనంగా ఉంచుతుంది. వ్యాధులను నివారించడానికి కూడా సహకరిస్తుంది. కాబట్టి, నిద్ర మనిషికి చాలా అవసరం.

Sleep Tips : మీకు నిద్ర పట్టడం లేదా... అయితే, దిండు కింద ఇవి పెట్టుకోండి... క్షణాల్లో నిద్ర పడుతుంది..?

Sleep Tips : మీకు నిద్ర పట్టడం లేదా… అయితే, దిండు కింద ఇవి పెట్టుకోండి… క్షణాల్లో నిద్ర పడుతుంది..?

Sleep Tips  నిద్ర సమస్యలు

నిద్ర సమస్యల తోటి చాలామంది కూడా బాధపడుతూ ఉంటారు. కొన్ని రకాల నిద్ర సమస్యలు. ఆందోళన వల్ల నిద్ర సరిగ్గా పట్టదు. ప్రశాంతంగా ఉన్నా కూడా నిద్ర పట్టకపోవడం జరుగుతుంది. హార్మోన్ల అసమతుల్యత లేదా రక్తంలో చక్కర స్థాయిలో హెచ్చుతగ్గుల వల్ల సరిగ్గా నిద్ర పట్టదు. చక్కర స్థాయి పడిపోయినప్పుడు శరీరం మనల్ని మేల్కొనేలా చేస్తుంది. తగినంత నిద్ర లేకపోవడం వల్ల కూడా అలసట వస్తుంది. మీకు నాసిక పాలిప్స్ సైనా సిటీస్ ఆస్తమా థైరాయిడ్ సమస్యలు లేదా విటమిన్ డి లోపం వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా సరిగ్గా నిద్ర పట్టదు.

Sleep Tips  బాగా నిద్రపోవడానికి సులభమైన మార్గాలు

రాత్రి 7-8 గంటలకు మీరు గసగసాలు చిటికెడు జాజికాయ పొడిని పాలలో కలిపి తాగవచ్చు. ఇది శరీరాన్ని ప్రశాంతంగా ఉంచి నిద్ర వచ్చేలా చేస్తుంది. ఇంకా కొబ్బరి నూనెతో పాదాలను మసాజ్ చేసినా కూడా నరాలు రిలీఫ్ అయి కూల్ అవుతాయి. మేల్కొనేవారు రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడానికి అరటిపండు తినవచ్చు. ఉదయం ఒత్తిడిని తగ్గించడానికి 10 వ్యాయామాలు చేస్తే బాగుంటుంది ఇది మనసుకు కూల్ గా ఉంచుతుంది నిద్ర త్వరగా కూడా పడుతుంది అలసిపోయినట్లు అనిపించేవారు సాయంత్రం తేలికపాటి వ్యాయామం చేసేవారికి ఇంకా ఎండలో నడవడం మంచిది జీవక్రియలను పెంచడానికి మీరు సాయంత్రం పూట పుదీనా టీ,తులసి టీ తాగితే ఇంకా మంచిది.

Sleep Tips  మెత్త కింద వీటిని పెట్టుకుంటే

పెన్నా పూలు లేదా తులసి ఆకులు మీ దిండు కింద ఉంచుకోవచ్చు.వాటి సువాసన ప్రశాంతంగా,మెదడుకు హాయిని ఇస్తుంది. పడుకునే ముందు మంచి సంగీతం లేదా కథలు విన్నా కూడా నిద్ర వస్తుంది. మొబైల్ ఫోన్, స్క్రీన్ లకు దూరంగా ఉండాలి.ఈ సాధారణ చిట్కాలు ఫాలో అయితే హాయ్ నిద్ర మీ సొంతం.

Also read

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Tags :
Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp