Sneezing : తుమ్ములు రావడం అనేది చాలా సహజలక్షణం. చిన్న పిల్లల దగ్గరి నుంచి పెద్ద వయసు వారి దాకా ఏదో ఒక సమయంలో తుమ్ములు వస్తూనే ఉంటాయి. కానీ ఎందుకు వస్తాయనేది మాత్రం చాలా మందికి తెలియదు. అయితే తుమ్ములు ఎప్పుడో ఒక సారి వస్తే పర్వాలేదు. కానీ ఎక్కువగా వస్తున్నాయంటే కచ్చితంగా ఆలోచించాల్సిన అంశమే. చాలా మందికి జలుబు చేసినప్పుడు ఎక్కువగా తుమ్ములు వస్తుంటాయి. అలా కాకుండా కొన్ని సార్లు ఇతర సమస్యలతో కూడా తుమ్ములు వస్తుంటాయి. ఎక్కువగా అలెర్జీ కారణంతోనే తుమ్ములు వస్తాయనేది అందరికీ తెలిసిందే.
అలెర్జీకి నిరంతర ముక్కు కారటం, కళ్ళు దురద, గొంతు నొప్పి, ఎరుపు ముఖం, ఎర్రటి కళ్ళు, చర్మంపై దద్దుర్లు అలాగే మరెన్నో అనేక లక్షణాలు ఉంటాయి.అయితే వీటన్నింటిలో కామన్ లక్షనం ఏంటంటే తుమ్ములు రావడమే. తుమ్ములు అనేవి ఎక్కువగా వస్తున్నాయంటే కచ్చితంగా డాక్టర్ ను సంప్రదించాల్సిందే. అయితే తుమ్ములతో పాటు మీ బాడీలో ఇంకా వేరే లక్షణాలు ఏమైనా కనిపిస్తే మాత్రం వెంటనే డాక్టర్ ను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. అలెర్టీ కాకుండా నాసికా చికాకు, దుమ్ము, ఫ్లూ, నాసికా రద్దీ, ముక్కు పొడిబారడం, జలుబు, వైరస్లు మొదలైన అనేక ఇతర కారణాలను కలిగి ఉంటాయి.
తుమ్ములు ఇంట్లో ఉన్నప్పుడే ఎక్కువగా వస్తున్నాయంటే మాత్రం కచ్చితంగా ఇంటిని క్లీన్ చేసుకోవాలి. అలా కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం మన నుంచి ఇతరులకు అలెర్టీ అంటుకునే అవకాశాలు ఉంటాయి. ఇక బయటకు వెళ్లినప్పుడు కూడా తుమ్ములు ఎక్కవుగా వస్తున్నాయంటే కచ్చితంగా అలెర్టీ కారణం అని గుర్తుంచుకోవాలి. అలాంటి సమయంలోనే ముక్కుకు అడ్డుగా శుభ్రమైన క్లాత్ ను పెట్టుకుని బయటకు వెళ్తే బెటర్. దాంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం కూడా ఎంతో ముఖ్యం అని గుర్తుంచుకోవాలి. చాలామందికి తెలియక అలెర్జీ కలిగించే ఆహారాలను తీసుకుంటారు.
అలా కాకుండా అలెర్జీ లేని ఆహారాలను తీసుకోవాలి. దాంతో పాటు మనం వేసుకునే బట్టలు కూడా ఎంతో శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడప్పుడు తుమ్ములు వస్తే దాన్ని లైట్ తీసుకోవాలి. కానీ తరచూ తుమ్ములు వస్తున్నాయంటే మాత్రం కచ్చితంగా డాక్టర్ ను సంప్రదించాలి.
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
This website uses cookies.