
Rythu Bandhu : రైతన్నలకు శుభవార్త...రైతుబంధు నిధులు విడుదల...!
Rythu Bandhu : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుండి ఇచ్చిన 6 హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తూ వస్తుంది. ఇక ఈ 6 హామీలలో ఇప్పటికే 5 హామీలను పూర్తి చేసినట్లుగా వారు తెలియజేస్తున్నారు. ఇక వీటిలో మహాలక్ష్మి యోజన పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అలాగే 500 కి గ్యాస్ సిలిండర్ ,అదేవిధంగా గృహ జ్యోతి యోజన కింద ప్రతి ఇంట్లో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ,ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలాలు ప్రారంభించనున్నారు. అదేవిధంగా ఇంటి స్థలం కలిగి ఉండి ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సహాయం కూడా ఇవ్వడం జరిగింది. అదే విధంగా బీమా సౌకర్యం ఆరోగ్య శ్రీ యోజన కింద 10 లక్షలు ఇస్తున్నారు.
అయితే గత ప్రభుత్వం రైతన్నలకు రైతుబంధు పథకం ద్వారా ఎకరాకు 10,000 రూపాయలను ఏడాదికి రెండు విడతల్లో ఖాతాలలో జమ చేసేది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత ఇది కాస్త ఆలస్యమైందని చెప్పాలి.ఈ క్రమంలోనే గతంలో ఎకరం లోపు వ్యవసాయ భూమి కలిగి ఉన్న రైతులు ఖాతాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు జమ చేయడం జరిగింది. అదేవిధంగా మొన్నటి వరకు మూడు ఎకరాలు కలిగి ఉన్న రైతులకు కూడా రైతుబంధు ఇచ్చేశారు. అయితే 3 నుంచి 5 ఎకరాల లోపు భూమి కలిగిన రైతులకు రైతు బంధు డబ్బులు ఇంకా చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పాలి.దీంతో రైతన్నలు మాకు డబ్బు జమ చేయాల్సిందిగా అధికారులకు మొరపెట్టుకున్నారు.
ఎట్టకేలకు వారి నిరీక్షణ ముగిసింది అని చెప్పాలి. ఎందుకంటే తాజాగా 3 నుంచి 4 ఎకరాలు కలిగి ఉన్న రైతుల ఖాతాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మధ్యాహ్నం నుంచి డబ్బులు జమ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో పలువురు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశాలలో రాష్ట్రంలో 93 శాతానికి పైగా రైతులకు కచ్చితంగా రైతుబంధు ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం విడతల వారీగా రైతు సోదరులకు నగదు విడుదల చేస్తూవస్తుంది. అయితే మరికొన్ని రోజుల్లో లోక్ సభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల నియమావళి విడుదలయితే కొత్త ప్రాజెక్ట్ లను ప్రారంభించడం కష్టమే కానీ ఉన్న ప్రాజెక్టులు మాత్రం కచ్చితంగా అమలు చేస్తారని తెలుస్తోంది.
Peddi 6 Days Box Office Collection : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ram charan హీరోగా,…
Students Good News : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక…
PM Kisan : దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం…
Gold Rate Today : బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మరోసారి శుభవార్త అందింది. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులు…
Rythu Bharosa : రైతు సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి…
Banana Health Tips : ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన పండ్లలో అరటిపండు ఒకటి. మన దేశంలో ప్రతి ఇంట్లో…
Tea : భారతీయుల రోజువారీ జీవితంలో చాయ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక కప్పు వేడి…
Today Horoscope : ఈరోజు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా అలసట, ఒత్తిడి సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం…
H1B Visa : అమెరికాలో విదేశీ నిపుణుల నియామకాలకు సంబంధించిన H1B వీసా విధానం మరోసారి చర్చనీయాంశంగా మారింది. విదేశీ…
Boduppal : బోడుప్పల్ సర్కిల్ సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని మాజీ మేయర్ తోటకూర అజయ్…
Meenakshi Natarajan : తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.…
Gundlapochampally : మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలోని గుండ్లపోచంపల్లి, మైసమ్మగూడ పరిసర ప్రాంతాల్లో ఎస్సీ కార్పొరేషన్‌కు కేటాయించిన భూములు ఆక్రమణలకు గురయ్యాయన్న ఆరోపణల…
This website uses cookies.