Home » Health » Sore Throat Difflculty In Swallowing But This Fatal Disease Is The Cause
Health

Throat : గొంతు నొప్పి, మింగటం లో ఇబ్బందా… అయితే ఈ ప్రాణాంతక వ్యాధే కారణం…!

Authored By
aruna
The Telugu News | Published on: May 27, 2024, 9:30 pm
Advertisement

Throat : భారత్ లో నోటి క్యాన్సర్ కేసుల సంఖ్య రోజురోజుకు ఎంతగానో పెరిగిపోతున్నాయి. సిగరెట్లు, బీడీలు, ఖైనీ, గుట్కా లాంటి ఇతర పొగాకుల ఉత్పత్తులను వాడే అలవాటు వలన ఈ ప్రాణాంతక వ్యాధి అనేది వస్తుంది. అయితే పొగాకు ఉత్పత్తులతో పాటుగా ఆల్కహాల్ కూడా ఈ సమస్యలను కలిగిస్తుంది. ఇది అనేది HPV వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. నోటి క్యాన్సర్ అనేది నోటిలోని ఇతర భాగాలకు వస్తుంది. పెదవులు, నాలుక, చెంప, లోపలి భాగం చిగుళ్ళు, అంగలి, నోటిలోని ఏ భాగానికైనా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కావున దాని లక్షణాలను గుర్తించటం చాలా ముఖ్యం…

Advertisement

చాలా మందికి ప్రతిరోజు కూడా ధూమపానం చేసే అలవాటు ఉంటుంది. దీనివలన నోటి లోపల తెల్లని మచ్చలు అనేవి ఏర్పడతాయి. అందువలన నోటిలో ఎరుపు లేక తెల్లని మచ్చల తో నిండి ఉన్నట్లయితే వెంటనే వైద్యుని సంప్రదించటం చాలా అవసరం. నోటి లోపల నొప్పి అనేది లేకుండా వాపు ఉన్నా కూడా ఆందోళన పడాల్సిందే. నోటి లోపల గడ్డలు లాంటివి గనుక ఏర్పడినట్లయితే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. నాలుక కదలికలో ఇబ్బంది లేక మాట్లాడేటప్పుడు ఏదైనా సమస్య లేక ఆవలింత వచ్చినప్పుడు తడబడినట్లు అనిపించినట్లయితే వెంటనే వైద్యుని సలహా తీసుకోవటం మంచిది.

Throat : గొంతు నొప్పి, మింగటం లో ఇబ్బందా… అయితే ఈ ప్రాణాంతక వ్యాధే కారణం…!

Advertisement

జలుబు లేక వైరల్ జ్వరం, గొంతులో నొప్పి,మింగటంలో ఇబ్బంది ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడాలి. ఆ నొప్పి అనేది స్వల్ప కాలికంగా ఉన్నట్లయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఈ నొప్పి అనేది దీర్ఘకాలం గా ఉన్నట్లయితే వెంటనే జాగ్రత్త పడాలి..

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి