Star Fruit : భోజనానికి ముందు ఈ ఒక్క పండు తింటే చాలు… బోలెడు ప్రయోజనాలు…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Star Fruit : భోజనానికి ముందు ఈ ఒక్క పండు తింటే చాలు… బోలెడు ప్రయోజనాలు…!!

 Authored By ramu | The Telugu News | Updated on :20 November 2024,11:02 am

ప్రధానాంశాలు:

  •  Star Fruit : భోజనానికి ముందు ఈ ఒక్క పండు తింటే చాలు... బోలెడు ప్రయోజనాలు...!!

Star Fruit : ప్రస్తుతం చాలా మందికి స్టార్ ఫ్రూట్ గురించి తెలిసే ఉంటుంది. ఎందుకు అంటే మార్కెట్లో అన్ని రకాల పండ్లతో పాటు స్టార్ ఫ్రూట్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఈ స్టార్ ఫ్రూట్ పోషకాలా ఘని అని చెప్పొచ్చు. ఈ ఫ్రూట్ లో విటమిన్ సి మరియు విటమిన్ బి, బిటు, బిసిక్స్, బి 9, విటమిన్లు, ఫైబర్, జింక్, పొటాషియం, ఐరన్,కాల్షియం, ఫోల్లెట్, సోడియం, కాపర్, మెగ్నీషియం లాంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఈ పోషకాలు అన్నీ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఈ స్టార్ ఫ్రూట్ నక్షత్ర ఆకారంలో ఉండి జ్యూసీ జ్యూసీగా కనిపిస్తుంది. ఈ పండు బాగా పండిన తర్వాత పసుపు రంగులోకి మారి చాలా తీయగా ఉంటుంది. పచ్చి పండ్లు అయితే పుల్లగా ఉంటాయి. ఈ పండులో ఎక్కువ శాతం ఫైబర్ మరియు చాలా తక్కువ కేలరీలనేవి ఉంటాయి. దీనిలో ఉండే ఫైబర్ అనేది జీర్ణ వ్యవస్థకు మంచిది. ఈ స్టార్ ఫ్రూట్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా కూడా చూస్తుంది. అంతేకాక రక్తంలో పేర్కొన్న కొవ్వును కూడా కరిగిస్తుంది…

అయితే పోషకాలతో నిండినటువంటి స్టార్ ఫ్రూట్ చాలా తక్కువ కేలరీలను కలిగి ఉండి, బరువు తగ్గడానికి ఎంతో హెల్ప్ చేస్తుంది. అలాగే జీవక్రియను కూడా పెంచుతుంది. శరీరంలో ఎక్కువ కేలరీలను బర్న్ చేయడంలో కూడా సహాయపడుతుంది. ఈ స్టార్ ఫ్రూట్ లో సోడియం మరియు పొటాషియం, ఇతర ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. ఈ స్టార్ ఫ్రూట్ లో విటమిన్ సి తో పాటుగా యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఈ కాంబినేషన్ అనేది ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది.

Star Fruit భోజనానికి ముందు ఈ ఒక్క పండు తింటే చాలు బోలెడు ప్రయోజనాలు

Star Fruit : భోజనానికి ముందు ఈ ఒక్క పండు తింటే చాలు… బోలెడు ప్రయోజనాలు…!!

ఈ పండులో ఉన్నటువంటి మెగ్నీషియం మరియు ఐరన్, మాంగనీస్, జింక్, పొటాషియం, ఫాస్ఫరస్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇది అనారోగ్యాలను దరిచేరకుండా చూస్తాయి. ఇది పేగు ఆరోగ్యానికి కూడా రక్షిస్తాయి. ఈ స్టార్ ఫ్రూట్ మలబద్ధకంతో ఇబ్బంది పడే వారికి ఔషధంలా పనిచేస్తుంది. ఈ స్టార్ ఫ్రూట్ లో విటమిన్ బి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలు మరియు కండరాల పనితీరుకు మెరుగుపరుస్తుంది. ఇది జీవ క్రియను కూడా తగ్గిస్తుంది. అంతేకాక హార్మోన్ మరియు ఎంజెమ్ స్థాయిని సాధారణ పరిధిలో ఉండేలా చూస్తుంది

Tags :

    ramu

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది