Weight Loss : ప్రస్తుత కాలంలో ఎంతోమంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అయితే మారిన జీవన విధానం మరియు తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా ఈ సమస్య తో బాధపడుతున్నారు. అయితే కొన్ని సందర్భాలలో అకస్మాత్తుగా బరువు పెరుగుతున్నారు. మరీ ముఖ్యంగా మహిళలు బరువు పెరగటం అనేది చాలా ఎక్కువ అవుతుంది. అయితే ఇలా ఉన్నఫలంగా బరువు పెరగడానికి ముఖ్యమైన ఐదు కారణాలు ఉన్నాయి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే మనం తెలిసో తెలియకో చేసే కొన్ని తప్పుల కారణంగానే తొందరగా బరువు పెరుగుతున్నారు అని అంటున్నారు. అయితే ఆ తప్పులు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం… నిద్ర లేమి సమస్య కూడా ఎక్కువగా బరువు పెరగడానికి కారణం అవుతుంది అని అంటున్నారు నిపుణులు.
అంతేకాక నిద్ర లేకపోవడం వలన హార్మోల సమతుల్యత లకు భంగం అనేది కలుగుతుంది. ఇది ఆకలి పెరగటానికి కూడా కారణం అవుతుంది. దీనివల్ల సహజంగానే మనకు తెలియకుండానే మనం ఎక్కువగా తింటుంటాం. అప్పుడు ఇది బరువు పెరగటానికి దారి తీస్తుంది అని అంటున్నారు నిపుణులు. ప్రస్తుతం ఒత్తిడి బారిన పడే వారి సంఖ్య కూడా నానాటికి బాగా పెరుగుతుంది. ఈ ఒత్తిడి కూడా బరువు పెరిగేందుకు ఒక కారణమని చెప్పొచ్చు. అలాగే ఒత్తిడి కారణంగా శరీరంలో కార్టీ సాల్ అనే హార్మోన్ స్థాయి అనేది బాగా పెరుగుతుంది. దీంతో ఒత్తిడి కారణంగా జంక్ ఫుడ్ కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. దీని వలన బరువు పెరిగేందుకు కారణం అవుతుంది అని అంటున్నారు నిపుణులు… రాత్రి టైంలో తీసుకునే ఆహారం కూడా బరువు పెరిగేందుకు కారణం కావచ్చు అని అంటున్నారు నిపుణులు.
ముఖ్యంగా రాత్రి పడుకునే టైంలో ఫ్రై చేసినటువంటి ఆహారాలు తీసుకోకూడదు అని అంటున్నారు నిపుణులు. ఇవి బరువు పెరిగేందుకు ప్రధాన కారణాలు అవుతాయి. అలాగే రాత్రి పడుకునే టైమ్ లో ఆహారం లైట్ గా తీసుకోవాలి. దీని కారణం గా రాత్రి జీవక్రియ ప్రక్రియ అనేది మందగిస్తుంది. ఇది శరీరంలో కొవ్వు పెరిగేందుకు కూడా కారణమవుతుంది. అంతేకాక శారీరక శ్రమ అనేది లేకపోవటం వల్ల కూడా బరువు పెరగడానికి కారణం అవుతుంది అని అంటున్నారు నిపుణులు. మీ శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవాలి అంటే నిత్యం కొంత వ్యాయామం లేక నడవడం లాంటి వాటిని అలవాటు చేసుకోవాలి. ఇది కేలరీలను బర్న్ చేసి అధిక బరువులు ను కంట్రోల్ లో ఉంచుతుంది. అలాగే కొన్ని సందర్భాలలో అనారోగ్య సమస్యలు కూడా బరువు పెరిగేందుకు కారణం అవుతాయి. ముఖ్యంగా మహిళల్లో థైరాయిడ్ లేక ఇతర హార్మోన్ సమస్యలు కూడా బరువు పెరిగేందుకు కారణం అవుతాయి…
Renu Desai doesn't like it at all Renu Desai : తెలుగు చిత్ర పరిశ్రమలో సుపరిచితమైన నటి…
Pakistani Terror Camps : భారత సైన్యం పాక్ ఉగ్రవాదానికి గట్టి షాక్ ఇచ్చింది. పాక్ లోని మొత్తం 9…
Donald Trump : పహల్గాం ఉగ్రదాడి operation sindoor కి ప్రతీకారంగా భారత India సైన్యం బుధవారం అర్థరాత్రి 1.44…
Today Gold Price : మే 7వ తేదీ బుధవారం బంగారం ధరలు Gold Rates భారీగా పెరిగాయి. 24…
Operation Sindoor : పాక్‌లోని ఉగ్రస్థావరాలపై INDian VS Pakistan భారతదేశం మెరుపు దాడులు చేసింది. ' ఆపరేషన్ సింధూర్…
Anganwadis : అంగన్‌వాడీ టీచర్లుకు తెలంగాణ Telangana Govr ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు…
Double Bedroom Houses : గ్రేటర్‌లో నిర్మించి ఖాళీగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్లని లబ్ధి దారులకి అందజేయాలని…
fish food : చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డి, విటమిన్ బి2, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్,…
This website uses cookies.