Spinach : ఈ ఆకు కూర గుండెకు, కంటికి.. పోషకాల ఔషధ గని... ఇంకా ఇతర వ్యాధులకు చెక్...?
Spinach : సాధారణంగానే ఆకుకూరలు ఎక్కువగా వండుకొని తింటూ ఉంటారు. కొందరు అయితే ఆకుకూరని అస్సలు ఇష్టపడరు. దీని గురించి తెలియని వారు ఆకుకూరని అసహించుకుంటారు. కానీ నిజానికి ఆకుకూరలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి పోషకాల గని అని చెప్పవచ్చు. ఆకు కూరల్లో విటమిన్లు,ఖనిజాలు, ఫైబర్,యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇంకా శరీరానికి రోగనిరోధక శక్తిని అందిస్తుంది. అనేక వ్యాధుల నుంచి కాపాడుతుంది. గుండె ఆరోగ్యం నుండి ఎముకల బలం వరకు, జీర్ణ క్రియ మెరుగుదల నుండి కంటి చూపు వరకు.ఈ ఆకుకూరలు అందించే ప్రయోజనాలు అంతా ఇంతా కాదు. అలాంటి ఆకుకూరల్లో ఒకటే పాలకూర. ఈ ఆకుకూరని రోజు తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి. అసలు నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం. పాలకూరను ప్రతిరోజు తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. పోషకాలతో నిండిన ఔషధగ్గని ఆకుకూర. ప్రతిరోజు ఆహారంలో చేర్చుకున్నట్లయితే కలిగే కొన్ని ముఖ్య ప్రయోజనాలు ఇవే.. పాలకూరలో కేలరీలు తక్కువగా ఉంటాయి.కానీ,విటమిన్లు ఖనిజాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా, విటమిన్ – k,విటమిన్ -A, విటమిన్ -C,పోలేట్ విటమిన్- బి 9,ఇనుము,మెగ్నీషియం, పొటాషియం వంటి సమృద్ధిగా ఉంటాయి. ఎముకల ఆరోగ్యానికి ఇంకా రోగనిరోధక శక్తికి,కంటి చూపు. ఈ పాలకూర ఇంకా ఆకుకూరలు మొత్తం శారీరక శ్రేయసుకు చాలా ముఖ్యమైనవి.
Spinach : ఈ ఆకు కూర గుండెకు, కంటికి.. పోషకాల ఔషధ గని… ఇంకా ఇతర వ్యాధులకు చెక్…?
పాల కూరలో బీటా- కెరోటిన్, లూటీన్, జిరాక్సంతీన్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్ లో శరీరంలో కణాలను దెబ్బతినే ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులైన క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు గుండె జబ్బులు వంటివి వయసు సంబంధించిన సమస్యలు, ప్రమాదాలను తగ్గించడంలో ముఖ్యపాత్రను పోషిస్తాయి.
గుండె ఆరోగ్యానికి : పాలకూరలు సహజంగా లభించే లైట్ రేట్లు రక్తనాళాలను విడదీయడం ద్వారా రక్త ప్రవాహాన్ని మెరుపు పరుస్తుంది.తద్వారా, రక్తపోటును తగ్గిస్తుంది.ఇందులో పొటాషియం ఉండడం చేత శరీరంలో ద్రవాలు, ఎలక్ట్రోలైట్ల సమతుల్యతలను కాపాడటానికి సహకరిస్తుంది.ఇది గుండె ఆరోగ్యానికి కీలకం.
ఎముకల బలోపేతం : కూరలో విటమిన్ -k అధికంగా ఉంటుంది.ఇది ఎముకల ఆరోగ్యానికి, ఇంకా రక్తాన్ని గడ్డ కట్టకుండా చేయగలదు. రోజు పాలకూర తీసుకుంటే ఎముకలు దృఢంగా తయారవుతాయి.
కంటిచూపు మెరుగుదల : పాల కూరలో లూటీన్, జియాక్సoతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయి. ఇవి కళ్ళను వయసు సంబంధించిన మస్క్యులర్ డిజైనరేషన్( ఏ ఎన్ డి) కంటి శుక్లాల నుండి రక్షిస్తుంది. ఇది కంటికి ఒత్తిడిని తగ్గించి, దృష్టిని మెరుగుపరుస్తుంది.
జీర్ణ క్రియ కు : పాల కూరలో అధిక ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన జీర్ణ క్రియను ప్రోత్సహిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచగలరు.
బరువు తగ్గడంలో సహాయం : తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ ఉండడం వల్ల,పాలకూర బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి మంచి ఎంపిక.ఇది కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది.
చర్మం,జుట్టు ఆరోగ్యం : పాలకూరలో ఉండే విటమిన్ ఏ సి యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యకరమైన చర్మాన్ని, జుట్టును ప్రోత్సహిస్తుంది.విటమిన్ A, C కొత్త చర్మ కణాల వృద్ధికి సహకరిస్తుంది. విటమిన్ C,కొల్లాజన్ ఉత్పత్తికి ప్రేరేపిస్తుంది.మీరు పాలకూరను సలాడ్లు స్మృతిలు, కూరలు లేదా ఇతర వంటకాలలో సులభంగా చేర్చుకోవచ్చు. దీని తేలికపాటి రుచి వల్ల ఇది అనేక వంటకాలకు సరిపోతుంది.
Niharika Konidela : మెగా ఫ్యామిలీకి చెందిన ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నటిగా…
Galla Jayadev : మాజీ లోక్‌సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…
India Vs England : లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్ విజయం…
Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…
KAntara 3 : సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…
Women : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…
Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…
Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…
This website uses cookies.