AP Union Minister post : కూటమికి మరో కేంద్ర పదవి ఇవ్వబోతున్న మోడీ...?
AP Union Minister post : బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఏడాది పాలన పూర్తిచేసుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గ విస్తరణకు తెరతీయబోతుంది. వచ్చే నెలలో వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండటంతో, ప్రధాని మోదీ తన కేబినెట్‌ను ప్రక్షాళన చేయాలని భావిస్తున్నారు. ముఖ్యంగా బీహార్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని వచ్చే ఎన్నికల దృష్ట్యా ఈ మంత్రివర్గ విస్తరణకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ మార్పుల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు మరో కేంద్ర మంత్రి పదవి లభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి…
AP Union Minister post : కూటమికి మరో కేంద్ర పదవి ఇవ్వబోతున్న మోడీ…?
ప్రస్తుతం ఏపీ నుంచి టీడీపీకి ఒక కేబినెట్ స్థాయి మంత్రి, మరో సహాయ మంత్రి పదవి దక్కగా, బీజేపీకి ఒక మంత్రి పదవి కేటాయించారు. జనసేనకు గతంలో అవకాశం ఇచ్చినా పవన్ కల్యాణ్ ఆసక్తి చూపకపోవడంతో వదిలేసారు. అయితే తాజా పరిస్థితుల్లో పవన్ కేంద్ర కేబినెట్‌లో పదవి స్వీకరించాలని ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. దీనిలో భాగంగా నాగబాబును కేంద్ర మంత్రిగా పంపించే యోచనలో పవన్ ఉన్నారు. అదే సమయంలో మచిలీపట్నం ఎంపీ బాలశౌరికి కూడా అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉండగా… చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూడా ఈసారి రాయలసీమ ప్రాంతానికి ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటోంది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాలకు కేంద్ర కేబినెట్‌లో ప్రాతినిధ్యం లభించడంతో, సామాజిక సమీకరణాల్లో భాగంగా రాయలసీమ బీసీ లేదా ఎస్సీ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలనేది చంద్రబాబు ఆలోచన. ఇందులో చిత్తూరు లేదా హిందూపూర్ ఎంపీలలో ఒకరికి అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో రెడ్డి వర్గానికి ప్రాతినిధ్యం ఇవ్వాలనే పరిగణనలో నంద్యాల ఎంపీ పేరు కూడా చర్చలో ఉంది. ప్రధాని మోదీ త్వరలో చేపట్టనున్న ఏపీ పర్యటన అనంతరం చంద్రబాబు – పవన్ కల్యాణ్ కలిసి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
INDVs ENG : క్రీడా మైదానంలో అంకితభావం అంటే ఏమిటో మరోసారి చూపించారు ఇద్దరు ధీరులు. తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని…
Father : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఓ తండ్రి వినూత్నంగా నిరసన తెలుపుతూ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. ఆనంద్ సౌత్…
Niharika Konidela : మెగా ఫ్యామిలీకి చెందిన ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నటిగా…
Galla Jayadev : మాజీ లోక్‌సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…
India Vs England : లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్ విజయం…
Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…
KAntara 3 : సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…
Women : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…
This website uses cookies.