Termites : చెద పురుగులు మీ ఇంటిని నాశనం చేస్తున్నాయా… ఇలా చేయండి…జీవితంలో మీ జోలికి రావు…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Termites : చెద పురుగులు మీ ఇంటిని నాశనం చేస్తున్నాయా… ఇలా చేయండి…జీవితంలో మీ జోలికి రావు…!!

 Authored By ramu | The Telugu News | Updated on :26 November 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Termites : చెద పురుగులు మీ ఇంటిని నాశనం చేస్తున్నాయా... ఇలా చేయండి...జీవితంలో మీ జోలికి రావు...!!

Termites : సాధారణంగా ఇంట్లో చెదలు పట్టడం అనేది సాధారణమైన విషయం. అయితే ఈ చెదలు అనేవి చూడడానికి చిన్నగా ఉన్నా కూడా వాటి వల్ల వచ్చే నష్టం మాత్రం అంత ఇంత కాదు. అలాగే ఇవి చెక్క తలుపులు మరియు కిటికీలు, గోడలను మరియు పుస్తకాలను కూడా తినేస్తాయి. అందుకే ఈ చెదలను ఎప్పటికప్పుడే వదిలించుకోవడం మంచిది. లేకుంటే ఇల్లు మొత్తం నాశనం అవ్వడం ఖాయం. అయితే ఈ చెదల సమస్య అనేది ఎక్కువగా చలికాలం మరియు వానాకాలంలో వస్తుంది. ఈ సీజన్ లో చెదలు అనేవి సంతాన ఉత్పత్తిని చేస్తాయి. అందుకే ఇంట్లో చెదలు అనేవి ఉంటే వాటిని ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఈ చెదలను ఈజీగా తొలగించాడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం…

Termites చెద పురుగులు మీ ఇంటిని నాశనం చేస్తున్నాయా ఇలా చేయండిజీవితంలో మీ జోలికి రావు

Termites : చెద పురుగులు మీ ఇంటిని నాశనం చేస్తున్నాయా… ఇలా చేయండి…జీవితంలో మీ జోలికి రావు…!!

వెనిగర్ మరియు నిమ్మరసంతో కూడా ఈ చెద పురుగులను ఈజీగా తొలగించవచ్చు. ఈ రెండిటిని బాగా మిక్స్ చేసి చెదలు ఉన్నచోట స్ప్రే చేయండి. అప్పుడు ఈ వాసనకు చెదలు అనేవి తొందరగా పోతాయి. ఇలా వారంలో ఒకసారి మూలం మూలల్లో కొడుతూ ఉంటే చెదపురుగులు అనేవి అస్సలు పట్టవు. ఈ చెద పురుగులను సిట్రస్ ఆయిల్ తో కూడా తరిమికొట్టొచ్చు. అలాగే ఈ సిట్రస్ పండ్ల నుండి వచ్చే వాసన అనేది చెదపురుగులకు అస్సలు పడదు.

అందుకే ఈ సిట్రస్ ఆయిల్ ను నీటిలో కలుపుకొని మూల మూలల్లో స్ప్రే చేసి మరియు షెల్ఫ్ లా వద్ద కూడా స్ప్రే చేస్తే చెదలు అనేవి త్వరగా పోతాయి. అలాగే చెదపురుగులను వేప నూనెతో కూడా వదిలించుకోవచ్చు. అయితే ఈ వేప నూనె నుండి వచ్చే వాసన అనేది ఎంతో ఘాటుగా ఉంటుంది. కావున ఈ నూనెను స్ప్రే చేయడం వలన చెదలను తొందరగా తరిమి కొట్టొచ్చు

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది