Tuberculosis : టిబి ఇటువంటి వారికే ఎక్కువగా వస్తుందట…!!
Tuberculosis : చాలామంది టీబి సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. ఈటీబి ఎంతో ప్రమాదకరమైన వ్యాధి. ఈ వ్యాధి ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తూ ఉంటుంది. క్షయ వ్యాధిని కలిగించే బ్యాక్టీరియా తుమ్ములు, దగ్గు వచ్చేలా చేస్తాయి. ఊపిరితిత్తులు కి వచ్చే ఈ క్షయ శరీరంలోని ఇతర భాగాలైన వెన్నుపూస, కిడ్నీ, ఎముకలు, బ్రెయిన్ కి కూడా వ్యాపించి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అయితే వీటి లక్షణం విపరీతమైన దగ్గు వస్తూ ఉంటుంది. ప్రధానంగా ఓ పరిస్థితులలో వచ్చినప్పుడు సమస్య అధికమవుతూ ఉంటుంది. ఇది శరీరంలోని ఇతర భాగాలకు వచ్చినప్పుడు దగ్గు ఇబ్బంది పెట్టదు. కానీ ఆ భాగాలకు సంబంధించిన సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి..
ఆ సంకేతాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..ట్యూబర్కులో సిస్ మైక్రో బ్యాక్టీరియం అనే బ్యాక్టీరియా మూలంగా వచ్చే క్షయ. గాలి ద్వారా ఓ మనిషి నుండి ఇంకొకరికి వ్యాపిస్తుంటుంది. ఈ సమస్య ఎలాంటి వారికైనా వస్తుంది కొన్ని కారణాల వలన వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవాళ్లు అంటే హెచ్ఐవి, షుగర్ వ్యాధి కంట్రోల్ లేని వారికి ఎక్కువగా ప్రార్థిస్తూ ఉంటుంది. దాంతో పాటు రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకోవడం డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలకు అలవాటైన వాళ్లకి కొన్ని రకాల క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు స్టెరాయిడ్స్ వాడేవారికి సరైన పోషకాహారం తీసుకోని వాళ్లకి ఛాతికి సంబంధించిన సమస్యలున్న వారికి తొందరగా ఈ సమస్య వ్యాపిస్తుంది..
స్పైనల్ ట్యూబర్కులోసిస్ : ఇది అన్నముకకు వచ్చే సమస్య ఇది వస్తే ఎన్నో ముఖ ఎముకల చుట్టూ ఉన్న టిష్యూలు పాడైపోతూ ఉంటాయి. దాంతో వెన్నునొప్పి, వెన్నుపూస వంకర తిరగడం, తిమ్మిర్లు రావడం, కాళ్ళు చేతులు బలహీనంగా అవ్వడం ఇలాంటి లక్షణాలు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇంకా కొన్ని లక్షణాలు : క్షయ వ్యాధి నాడీ వ్యవస్థను చాలా రకాలుగా దెబ్బతీస్తుంది. కొన్ని సమయాలలో లక్షణాలు కనిపించదు.. టీబీ వ్యాధి మూత్రపిండాలు వెన్నుముక, మెదడు సహా మీ శరీరంలోని ఇతర భాగాలను కూడా ప్రభావితం చేస్తూ ఉంటుంది.
ఆకలి లేకపోవడం, కపంతో కూడిన దగ్గు అంతకంటే ఎక్కువ వారాలు ఉండడం బరువు తగ్గడం, తరచుగా జ్వరం, పక్షవాతం, వాంతులు, చూపు మందగించడం, తలనొప్పి చలి త్వరగా అలసిపోవడం లాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి : క్షయకు ట్రీట్మెంట్ తీసుకున్న వారు ఏ పరిస్థితుల్లోనైనా డాక్టర్ సలహా లేకుండా మెడిసిన్ ఆపవద్దు. ఇది పరిస్థితిని మరింత దిగజార్చి ప్రమాదానికి దారితీస్తుంది. మందులతో పాటు సరైన పోషకాహారం తీసుకోవడం ఎక్ససైజ్లు చేయాలి. కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ఇమ్యూనిటీని పెంచుకోవడం వలన చాలా ప్రమాదం నుంచి బయటపడేస్తుంది.
రెండు రకాలుగా ట్రీట్మెంట్ : క్షయకు ట్రీట్మెంట్ రెండు రకాలుగా చేస్తుంటారు. దానిలో ఒకటి ఇంటెన్షన్ పేస్ దానిలో నాలుగు రకాల క్షయ మందులు రెండు నెలలపాటు ఇస్తూ ఉంటారు. మెయింటెనెన్స్ ఫేస్ దీనిలో రెండు రకాల క్షయ మెడిసిన్ నాలుగు నెలల పాటు వాడాలి వ్యక్తికి ఏ భాగంలో టీబీ ఉందో ఎంత తీవ్రంగా ఉందో అనే విషయాలను బట్టి ఈ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. దీనిలో కొన్ని మార్పులు కూడా జరుగుతుంటాయి. నాడి వ్యవస్థ క్షయ ఉన్నవాళ్లు ఎక్కువ రోజులు మెడిసిన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకొంతమందిలో క్షయ ట్రీట్మెంట్ తో పాటు స్టెరాయిడ్స్ సంబంధించిన మందులు కొంత కాలం తీసుకోవాలి కొన్ని కొన్ని సమయాలలో సర్జరీ కూడా పడుతుంది..