Tulasi : ఉదయాన్నే ఖాళీ కడుపుతో తులసిని తీసుకుంటే ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయని తెలిసిందే. తులసిలోని యాంటిఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్ల మేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాల వల్ల రోగానిరోధశక్తి పెంచుతుంది. వ్యాధి నిరోధక శక్తి వల్ల రోగాల బారిన పడకుండా మనల్ని రక్షిస్తుంది. సీజనల్ వ్యాధులు రాకుండా కూడా దూరం చేయడం లో సహకరిస్తుంది. ఉదయాన్నే పరిగడపన తులసి ఆకులు తినడం వల్ల మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి ఆందోళనను కూడా తగ్గిస్తుంది. తులసి ఆకుల వల్ల పళ్ళు చిగుళ్ల ఆరోగ్యాన్ని మెరుగు చేస్తుంది. తులసి ఆకుల రసాన్ని నోటిలో పోసుకుని పుక్కిలిస్తే నోటి నుంచి వచ్చే చెడు వాసన పోతుంది.
ముఖ్యంగా వర్షాకాలంలో తులసి ఆకులు తింటే ఏదైనా శ్వాసకోశ సమస్యలు ఉంటే త్వరిత ఉపశమనం దొరుకుతుంది. అంతేకాదు జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలను కూడా ఇది నయం చేస్తుంది. తులసి ఆకులు నమలడం వల్ల దాని పోషకాల వల్ల జీర్ణక్రియ భాగవుతుంది. శరీరంలో సాధారణంగా వచ్చే అజీర్ణం, మలబద్ధకం లాంటివి రాకుండా తగ్గిస్తుంది. వీటితో పాటు ఆకలిని నియంత్రించడంలో తులసి సహాయ పడుతుంది. ఉదయాన్నే పరగడుపునే తులసి ఆకులను తినడం లేదా కషాయం లేదా జ్యూస్ లా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. డయాభేటీస్ వారికి చాలా మంచిది.
తులసిలోని యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి మంచిది. రక్తపోటును కూడా తగ్గిస్తుంది. అంతేకాదు తులసిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె లు కూడా శరీరానికి మంచి చేస్తాయి. ఈ విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచి చర్మ ఆరోగ్యాన్ని కాపాడేలా చేస్తాయి. ఇందులో కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, లాంటి ఖనిజాలు ఎముకల ఆరోగ్యానికి సహకరిస్తాయి.
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
This website uses cookies.