Tulasi : ఖాళీ కడుపుతో ఇలా చేయండి చాలు అమృతంలా పని చేస్తుంది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tulasi : ఖాళీ కడుపుతో ఇలా చేయండి చాలు అమృతంలా పని చేస్తుంది..!

 Authored By ramu | The Telugu News | Updated on :29 October 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Tulasi : ఖాళీ కడుపుతో ఇలా చేయండి చాలు అమృతంలా పని చేస్తుంది..!

Tulasi : ఉదయాన్నే ఖాళీ కడుపుతో తులసిని తీసుకుంటే ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయని తెలిసిందే. తులసిలోని యాంటిఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్ల మేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాల వల్ల రోగానిరోధశక్తి పెంచుతుంది. వ్యాధి నిరోధక శక్తి వల్ల రోగాల బారిన పడకుండా మనల్ని రక్షిస్తుంది. సీజనల్ వ్యాధులు రాకుండా కూడా దూరం చేయడం లో సహకరిస్తుంది. ఉదయాన్నే పరిగడపన తులసి ఆకులు తినడం వల్ల మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి ఆందోళనను కూడా తగ్గిస్తుంది. తులసి ఆకుల వల్ల పళ్ళు చిగుళ్ల ఆరోగ్యాన్ని మెరుగు చేస్తుంది. తులసి ఆకుల రసాన్ని నోటిలో పోసుకుని పుక్కిలిస్తే నోటి నుంచి వచ్చే చెడు వాసన పోతుంది.

Tulasi తులసితో దగ్గు, జలుబు మాయం..

ముఖ్యంగా వర్షాకాలంలో తులసి ఆకులు తింటే ఏదైనా శ్వాసకోశ సమస్యలు ఉంటే త్వరిత ఉపశమనం దొరుకుతుంది. అంతేకాదు జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలను కూడా ఇది నయం చేస్తుంది. తులసి ఆకులు నమలడం వల్ల దాని పోషకాల వల్ల జీర్ణక్రియ భాగవుతుంది. శరీరంలో సాధారణంగా వచ్చే అజీర్ణం, మలబద్ధకం లాంటివి రాకుండా తగ్గిస్తుంది. వీటితో పాటు ఆకలిని నియంత్రించడంలో తులసి సహాయ పడుతుంది. ఉదయాన్నే పరగడుపునే తులసి ఆకులను తినడం లేదా కషాయం లేదా జ్యూస్ లా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. డయాభేటీస్ వారికి చాలా మంచిది.

Tulasi ఖాళీ కడుపుతో ఇలా చేయండి చాలు అమృతంలా పని చేస్తుంది

Tulasi : ఖాళీ కడుపుతో ఇలా చేయండి చాలు అమృతంలా పని చేస్తుంది..!

తులసిలోని యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి మంచిది. రక్తపోటును కూడా తగ్గిస్తుంది. అంతేకాదు తులసిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె లు కూడా శరీరానికి మంచి చేస్తాయి. ఈ విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచి చర్మ ఆరోగ్యాన్ని కాపాడేలా చేస్తాయి. ఇందులో కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, లాంటి ఖనిజాలు ఎముకల ఆరోగ్యానికి సహకరిస్తాయి.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది