Small Onions : మీరు ఊహించని చిన్న ఉల్లిపాయల ఆరోగ్య ప్రయోజనాలు
ప్రధానాంశాలు:
Small Onions : మీరు ఊహించని చిన్న ఉల్లిపాయల ఆరోగ్య ప్రయోజనాలు
Small Onions : చిన్న ఉల్లిపాయలు వంటకాలకు శక్తివంతమైనవి. భోజనానికి ప్రత్యేకమైన రుచిని అందిస్తాయి. ఇది పురుషుల హార్మోన్లను ప్రేరేపించడంలో సహాయ పడుతుంది. చిన్న ఉల్లిపాయలను కొద్దిగా వేయించి దానికి తేనె కలిపి రాత్రి తిన్న తర్వాత ఒక గ్లాసు పాలు తాగితే పురుషుల్లో శక్తి మెరుగుపడుతుంది. రోజూ పొగతాగేవారు రోజుకు మూడుసార్లు అర కప్పు చిన్న ఉల్లిపాయల రసం తాగడం వల్ల శ్వాస సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
Small Onions : మీరు ఊహించని చిన్న ఉల్లిపాయల ఆరోగ్య ప్రయోజనాలు
– బట్టతల ఏర్పడటం, జుట్టు పెరగకపోవడం సమస్యలున్నవారు కట్ చేసిన చిన్న ఉల్లిపాయను తలపై మెత్తగా రాయడం వల్ల జుట్టు పెరుగుదల మెరుగు పడుతుందంటారు. ఇది తల చర్మానికి రక్త ప్రసరణను మెరుగు పరచడంలో సహాయ పడుతుంది.
– తేలు కాటుకు గురైన చోట చిన్న ఉల్లిపాయను మెత్తగా చేసి సున్నంతో కలిపి రాయడం వల్ల విష ప్రభావాన్ని తగ్గించవచ్చునని పెద్దలు చెబుతున్నారు.
– ప్రతిరోజు మూడు చిన్న ఉల్లిపాయలు తీసుకుంటూ ఉంటే కొంతమంది మహిళల్లో కనిపించే అధిక రక్తస్రావ సమస్య తగ్గుతుందని శాస్త్రీయ ఆధారాలు రుజువు చేస్తున్నాయి.
– గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయే సమస్య ఉన్నవారు చిన్న ఉల్లిపాయలు తినడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని నిపుణులు తెలుపుతున్నారు.
– కొద్దిగా అన్నం, కొద్దిగా ఉప్పు, నాలుగు ఉల్లిపాయలను కలిపి పేస్ట్ చేసి ఆ మిశ్రమాన్ని తామరాకుపై పెట్టి కీళ్లపై కట్టు వేస్తే వాపు తగ్గుతుంది.
– ఉల్లిపాయ రసాన్ని నీటిలో కలిపి తాగడం ద్వారా ఒత్తిడి తగ్గి నిద్ర సులభంగా పడుతుంది. ఇది శరీరాన్ని ప్రశాంతంగా ఉంచుతుంది. ముఖంపై మొటిమలు, మచ్చలు ఉంటే కట్ చేసిన చిన్న ఉల్లిపాయను మచ్చలపై రాయడం వల్ల మెల్లగా తగ్గిపోతాయి.
– పాము కాటు వంటి ప్రమాదాల్లో తక్షణ సహాయ చర్యగా ఎక్కువగా ఉల్లిపాయలు తినమని మన పూర్వీకులు చెబుతుండేవారు. ఇది కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ అనుసరిస్తున్నారు.