
Urination Causes : కొందరు మాటిమాటికి బాత్రూంలోకి పరిగెడుతూనే ఉంటారు... మీకు ఈ వ్యాధి ఉందేమో తెలుసుకోండి...?
Urination Causes : సాధారణంగా బిజీ లైఫ్ లో ప్రతి ఒక్కరు కూడా తమ ఆరోగ్యం పైన ఎటువంటి దృష్టి పెట్టరు. మన శరీరం తరచూ కొన్ని సంకేతాలను ఇస్తూ ఉంటుంది. వాటిని కొందరు విస్మరిస్తూ ఉంటారు. ఈ సంకేతాలు కొన్నిసార్లు తీవ్రమైన వ్యాధులను సూచించే విధంగా ఉంటాయి. తరచూ మూత్ర విసర్జన, థైరాయిడ్ లక్షణాలు కూడా అలాంటి సంగీతాలే ఉంటాయి. తేలిగ్గా తీసి పడేయడం చాలా ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. ప్రస్తుత కాలంలో బిజీ లైఫ్ లో మనం తరచూ మన శరీరం ఇచ్చే సంకేతాలని విస్మరిస్తూ ఉండడం. కానీ ఇవి ఒక్కోసారి తీవ్రమైన వ్యాధులను సూచించే కొన్ని లక్షణాలను కలిగి ఉంటుంది. వీటిని మనం నిర్లక్ష్యం చేసిన చాలా ప్రమాదంగా మారుతాయి. ఇందులో తరచుగా మూత విసర్జన, థైరాయిడ్ లక్షణాలు కూడా కలిగి ఉంటాయి. ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదకరం.తరచూ మూత్ర విసర్జన చేయాల్సి వచ్చినా,మీకు దాహం అధికంగా అనిపించినా, ఇది యూరిన్ ఇన్ఫెక్షన్ కు సంబంధించిన సమస్య కావచ్చు. దీనికి అనేక కారణాలు, మరికొన్ని వ్యాధులు అయి ఉండవచ్చు. రోజంతా తరచూ మూత్రవిసర్జన చేస్తే ఏ వ్యాధులు కారణమవుతాయి. దీని ప్రధాన లక్షణాలు ఏమిటి..అసలు వైద్య నిపుణులు దీని గురించి ఏం తెలియజేస్తున్నారు.. తరచూ మూత్ర విసర్జన చేస్తే ఎటువంటి వ్యాధులు సూచిస్తుందో తెలుసుకుందాం…
Urination Causes : కొందరు మాటిమాటికి బాత్రూంలోకి పరిగెడుతూనే ఉంటారు… మీకు ఈ వ్యాధి ఉందేమో తెలుసుకోండి…?
మాక్స్ హాస్పిటల్ డాక్టర్ రోహిత్ కుమార్ మాట్లాడుతూ.. మీరు రోజంతా తరచూ మూత్ర విసర్జన చేయాల్సి వస్తే, మీకు చాలా దాహం వేసినా, అది డయాబెటిస్ సంకేతం కావచ్చు. మధుమేహం శరీరంలో గ్లూకోజులను,సరిగ్గా ప్రాసెస్ చేయలేక పోతుంది. దీని కారణంగానే మూత్రపిండాలు ఎక్కువ మూత్రాన్ని ఉత్పత్తి చేస్తాయి.
మూత్ర మార్గ సంక్రమణ ( యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ -UTI ) :
ఈ తరచూ మూత్ర విసర్జన అనేది మహిళల్లో ఇది చాలా సర్వసాధారణం అంటున్నారు డాక్టర్ రోహిత్. తరచూ మూత్ర విసర్జన చేయడం, విసర్జన చేసేటప్పుడు మంట లేదా నొప్పి,దురువాసనతో కూడిన మూత్రం, ఇవన్నీ UTI క్షణాలు కావచ్చు. దీనికి చికిత్స చెయ్యకపోతే, అది మూత్రపిండాలకు చేరుతుంది.
ప్రోస్టేట్ సమస్యలు : ఇది పురుషుల్లోనూ ప్రోస్టేట్ గ్రంధి విస్తీర్ణం వల్ల మూత్రనాలంపై ఒత్తిడి పెరుగుతుంది. దీనితో తరచూ మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో ఇది ఎక్కువగా జరుగుతుంది.
అతి చురుకైన మూత్రశయం ( Overactive Bladder ) : ఈ స్థితిలో ఉన్నవారు, మూత్రాన్ని బిగబట్టుకోవడం చాలా కష్టమవుతుంది.మూత్ర విసర్జన చేయాలని కోరిక కొద్దిగా వచ్చిన వెంటనే టాయిలెట్ కి వెళ్లాల్సి వస్తుంది.ఇది నాడీ సంబంధిత కారణాల వల్ల కూడా కావచ్చు.
పందులు తీసుకోవడం లేదా చాలా నీరు తాగడం : కొన్ని సార్లు మూత్ర విసర్జన ( మూత్ర విసర్జనను పెంచే మందులు ) ఇది కొన్ని మందులు కూడా మూత్ర విసర్జనకు దారితీస్తాయి. ఎండాకాలంలో ఎక్కువ నీరు త్రాగడం వల్ల కూడా ఈ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. అయితే, తరచూ మూత్ర విసర్జన లక్షణాలు గమనిస్తే,వెంటనే వైద్య నిపుణులను దించి వారి సలహా మేరకు చికిత్సను పొందండి.
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
This website uses cookies.