Walnuts : నానబెట్టిన వాల్ నట్స్ లో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Walnuts : నానబెట్టిన వాల్ నట్స్ లో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా…!

 Authored By ramu | The Telugu News | Updated on :30 July 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Walnuts : నానబెట్టిన వాల్ నట్స్ లో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా...!

Walnuts : ప్రస్తుతం చాలా మంది ఆరోగ్యం కోసం ఎన్నో రకాల డ్రై ఫ్రూట్స్ ను తీసుకుంటున్నారు. వాటిలో వాల్ నట్స్ కూడా ఒకటి. అయితే ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా చెప్పాలంటే. బాదం పప్పులు రాత్రంతా నానబెట్టుకొని ఉదయాన్నే తీసుకున్నట్లయితే శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే కేవలం నానబెట్టిన బాదంపప్పు మాత్రమే కాదు, నానబెట్టిన వాల్ నట్స్ లో కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి అనే సంగతి మీకు తెలుసా. ఇది నిజం. అయితే నానబెట్టిన వాల్ నట్స్ ను ప్రతినిత్యం ఉదయాన్నే తీసుకోవడం వలన ఎన్నో లాభాలు ఉన్నాయి అని అంటున్నారు. ఆ లాబాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

ఈ వాల్ నట్స్ లో ఉన్నటువంటి ఒమేగా త్రీ మరియు ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని ఎంతో మేలు చేస్తాయి. దీనిలో ఉన్నటువంటి ఆరోగ్యకరమైన కొవ్వు కూడా గుండె సంబంధించిన సమస్యలు నియంత్రించడంలో సహాయపడుతుంది. అయితే ఈ వాల్ నట్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. అయితే ఇవి రోగనిరోధక శక్తిని బలంగా చేయడంలో మరియు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతో మేలు చేస్తుంది. అలాగే దీనిలో ఉన్నా యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ డామేజ్ ను తగ్గించడంలో కూడా ఎంతో మేలు చేస్తాయి. దీంతో సెల్ డామేజ్ ను నియంత్రించి, ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది…

Walnuts నానబెట్టిన వాల్ నట్స్ లో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా

Walnuts : నానబెట్టిన వాల్ నట్స్ లో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా…!

ఈ వాల్ నట్స్ లో కేలరీలు కూడా అధికంగా ఉంటాయి. దీనివలన వీటిని తిన్న వెంటనే ఇన్ స్టాండ్ శక్తి వస్తుంది. కావున ఉదయాన్నే వీటిని తీసుకోవటం వలన మీరు రోజువారి పని చేసేందుకు ఎంతో శక్తిని ఇస్తుంది. ఈ వాల్ నట్స్ అనేవి ఫైబర్ కు పెట్టింది పేరు. ఇది జీర్ణ క్రియతో పాటుగా బరువును నియంత్రించేందుకు సహాయపడుతుంది. దీనిలో ఉన్న ఫైబర్ వలన పొట్ట ఎక్కువ సేపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. దీంతో ఆకలి అనేది ఉండదు. దీంతో బరువు కూడా కంట్రోల్ లో ఉంటుంది. ఇది మధుమేహాన్ని నియంత్రించడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఈ వాల్ నట్స్ లో విటమిన్ ఇ అనే అధికంగా ఉంటుంది. ఇవి చర్మానికి కూడా ఎంత గానో మేలు చేస్తాయి. అయితే విటమిన్ ఇ అనేది ముడతలు మరియు చర్మం కుంగిపోవడం లాంటి ఎన్నో వృద్ధాప్య సమస్యలను కూడా నియంత్రిస్తుంది…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది