Walnuts : ప్రస్తుతం చాలా మంది ఆరోగ్యం కోసం ఎన్నో రకాల డ్రై ఫ్రూట్స్ ను తీసుకుంటున్నారు. వాటిలో వాల్ నట్స్ కూడా ఒకటి. అయితే ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా చెప్పాలంటే. బాదం పప్పులు రాత్రంతా నానబెట్టుకొని ఉదయాన్నే తీసుకున్నట్లయితే శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే కేవలం నానబెట్టిన బాదంపప్పు మాత్రమే కాదు, నానబెట్టిన వాల్ నట్స్ లో కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి అనే సంగతి మీకు తెలుసా. ఇది నిజం. అయితే నానబెట్టిన వాల్ నట్స్ ను ప్రతినిత్యం ఉదయాన్నే తీసుకోవడం వలన ఎన్నో లాభాలు ఉన్నాయి అని అంటున్నారు. ఆ లాబాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
ఈ వాల్ నట్స్ లో ఉన్నటువంటి ఒమేగా త్రీ మరియు ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని ఎంతో మేలు చేస్తాయి. దీనిలో ఉన్నటువంటి ఆరోగ్యకరమైన కొవ్వు కూడా గుండె సంబంధించిన సమస్యలు నియంత్రించడంలో సహాయపడుతుంది. అయితే ఈ వాల్ నట్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. అయితే ఇవి రోగనిరోధక శక్తిని బలంగా చేయడంలో మరియు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతో మేలు చేస్తుంది. అలాగే దీనిలో ఉన్నా యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ డామేజ్ ను తగ్గించడంలో కూడా ఎంతో మేలు చేస్తాయి. దీంతో సెల్ డామేజ్ ను నియంత్రించి, ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది…
ఈ వాల్ నట్స్ లో కేలరీలు కూడా అధికంగా ఉంటాయి. దీనివలన వీటిని తిన్న వెంటనే ఇన్ స్టాండ్ శక్తి వస్తుంది. కావున ఉదయాన్నే వీటిని తీసుకోవటం వలన మీరు రోజువారి పని చేసేందుకు ఎంతో శక్తిని ఇస్తుంది. ఈ వాల్ నట్స్ అనేవి ఫైబర్ కు పెట్టింది పేరు. ఇది జీర్ణ క్రియతో పాటుగా బరువును నియంత్రించేందుకు సహాయపడుతుంది. దీనిలో ఉన్న ఫైబర్ వలన పొట్ట ఎక్కువ సేపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. దీంతో ఆకలి అనేది ఉండదు. దీంతో బరువు కూడా కంట్రోల్ లో ఉంటుంది. ఇది మధుమేహాన్ని నియంత్రించడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఈ వాల్ నట్స్ లో విటమిన్ ఇ అనే అధికంగా ఉంటుంది. ఇవి చర్మానికి కూడా ఎంత గానో మేలు చేస్తాయి. అయితే విటమిన్ ఇ అనేది ముడతలు మరియు చర్మం కుంగిపోవడం లాంటి ఎన్నో వృద్ధాప్య సమస్యలను కూడా నియంత్రిస్తుంది…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
This website uses cookies.