Weight loss : ఇప్పుడు చాలామంది పరిమితికి మించి ఆహారాన్ని తీసుకుంటూ, సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం ఇలా ఎన్నో కారణాల వలన బరువు పెరుగుతున్నారు. బరువు తగ్గటానికి వ్యాయామాలు చేస్తూ ఉంటారు. మరికొందరు బరువు తగ్గాలని మెడిసిన్స్ ను కూడా వాడుతుంటారు. అయినా శరీరంలో ఎటువంటి మార్పు రాదు. కానీ బరువు తగ్గటానికి సులభమైన మార్గాలు కూడా ఉన్నాయి. మన పూర్వీకులు రాగిజావను ప్రతిరోజు త్రాగేవారు. అందువల్లనే వారు స్ట్రాంగ్ గా ఉండేవారు. అలాగే బరువు కూడా వయసుకి తగ్గట్టుగా ఉండేవారు. అందుకనే వారు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఎక్కువ రోజులు బ్రతికే వారు. అయితే ఇప్పుడు చాలామంది రాగి జావను త్రాగటానికి ఇష్టపడుతున్నారు. ఈ రాగిజావ అధిక బరువు ఉన్న వారు సులువుగా బరువు తగ్గేలా చేస్తుంది.
ప్రతిరోజు ఉదయాన్నే ఇడ్లీ, దోస, సాంబార్, చెట్ని వంటివి తీసుకోవడం కంటే రోజు రాగి జావా, ఓట్స్ ను తీసుకోవడం మంచిది. బరువు తగ్గాలనుకునే వారు ప్రతిరోజు ఉదయాన్నే రాగిజావ తో పాటు ఓట్స్ ను తీసుకుంటే మంచిది. రాగి జావా, ఓట్స్ చేసుకోవడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. అందుకనే చాలామంది రాగిజావ, మిల్లెట్ జావ, ఓట్స్ లాంటివి తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.అలాగని ప్రతిరోజు తీసుకోవడం అంత మంచిది కాదు. మన శరీరానికి కావలసిన పోషకాలు అందించే ఆహారం తీసుకునే అవకాశం ఉన్నప్పుడు తీసుకోవడం మంచిది. మనం మూడు పూటలా ఉడికించిన ఆహారం తీసుకుంటే శరీరానికి మంచిది. న్యాచురల్ ఆహారం ద్వారా వచ్చే యాంటీ ఆక్సిడెంట్స్, సూక్ష్మ పోషకాలు ఉడికించిన ఆహారంలో ఉండవు.
రాగిజావ, ఓట్స్ ను తీసుకోవడం మంచిదే కానీ ప్రతిరోజు తీసుకోకూడదు. ప్రతిరోజు ఓట్స్, రాగిజావ, ఇడ్లీ దోస తీసుకుంటే శరీరానికి కావలసిన పొటాషియం, ఫైబర్, విటమిన్స్ లభించవు. అందుకే ప్రతిరోజు వీటిని తీసుకోవడం కంటే మొలకలను తీసుకోవడం మంచిది. రోజులో ఒక పూట అయినా సరే ఉడికించని ఆహారం తీసుకోవడం మంచిది. రాగిజావ, ఓట్స్, ధాన్యాలు అనేవి ప్రతిరోజు తీసుకోవడం కంటే ఎప్పుడైనా తినటానికి సమయం లేనప్పుడు తీసుకోవచ్చు. ఇడ్లీ, దోసెలో ఉండే కార్బోహైడ్రేట్స్ కంటే ఓట్స్, రాగిజావలోనే కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. 100 గ్రాముల ఓట్స్ తీసుకోవడం వలన 386 క్యాలరీలు లభిస్తాయి. 100 గ్రాములు రాగిజావ తీసుకోవడం వలన 336 క్యాలరీలు లభిస్తాయి. ఇలా తీసుకోవడం వలన బరువు కూడా సులభంగా తగ్గవచ్చు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.