Categories: HealthNews

Drinking Hot Water : వర్షాకాలంలో గోరువెచ్చని నీరు తాగడం ఎందుకు ముఖ్యమో తెలుసా? నిపుణుల సూచనలు త‌ప్ప‌క తెలుసుకోండి.!

Drinking Hot Water : వర్షాకాలం వస్తే చల్లని గాలి, మబ్బులు, వాన చినుకులు వ‌ల‌న మ‌న‌సు హాయిగా ఉంటుంది. అయితే, ఈ కాలంలో కొన్ని జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా నీరు తాగే విషయంలో అలసత్వం మంచిదికాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.వేసవిలో ఎక్కువగా నీళ్లు తాగే అలవాటు ఉన్న మనలో చాలామంది వర్షాకాలంలో దాహం తక్కువగా ఉండటంతో నీటిని తీసుకోవడం తగ్గిస్తారు. కాని వర్షాకాలంలో గోరువెచ్చని నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Drinking Hot Water : వర్షాకాలంలో గోరువెచ్చని నీరు తాగడం ఎందుకు ముఖ్యమో తెలుసా? నిపుణుల సూచనలు త‌ప్ప‌క తెలుసుకోండి.!

Drinking Hot Water : ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిసరి..

వేడి నీటితో వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు చూస్తే.. ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడుతుంది. వర్షాకాలంలో తేమ అధికంగా ఉండటం వల్ల బ్యాక్టీరియా, వైరస్‌లు, శిలీంధ్రాలు వేగంగా పెరుగుతాయి. దీంతో జలుబు, దగ్గు, గొంతు నొప్పి, డైజెస్టివ్ ఇన్ఫెక్షన్లు సులభంగా రావచ్చు. వేడి నీరు శరీరాన్ని లోపల నుంచి శుభ్రపరచి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

గోరువెచ్చని నీరు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. కడుపులో గ్యాస్, అసిడిటీ సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది. ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తీసుకునే వాళ్లకు ఇది మరింత ఉపయోగకరం.వర్షాకాలంలో కఫం, శ్లేష్మం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. గోరువెచ్చని నీరు గొంతులోని కఫాన్ని కరిగించి శ్వాసనాళాలను శుభ్రపరుస్తుంది. గొంతునొప్పి, దగ్గు నివారణకు ఇది సహాయకారి.ఉదయాన్నే తేనె, నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీరు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి. వేడి నీరు చర్మాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా, పిండి గ్రంథుల ద్వారా వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతుంది. ఫలితంగా చర్మం ఆరోగ్యంగా మారుతుంది. వీలైనంతవరకు బయట వర్షంలో తడవకుండా ఉండాలి, తడితే గోరువెచ్చని నీరు తాగడం మంచిది

Recent Posts

TGSRTC | టీఎస్‌ఆర్టీసీ ప్రయాణికుల కోసం లక్కీ డ్రా.. ₹5.50 లక్షల బహుమతులు సిద్ధం!

TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…

2 hours ago

OG Collections | రికార్డులు క్రియేట్ చేస్తున్న ఓజీ.. తొలి రోజు ఎంత వ‌సూళ్లు రాబ‌ట్టింది అంటే..!

OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…

4 hours ago

OG | ‘ఓజీ’ టికెట్ రేట్ల పెంపుపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం.. ఇక నుండి పెంపు ఉండ‌దు

OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…

6 hours ago

Coconut | కొబ్బరి తినడం మంచిదేనా.. ఇందులో దాగిన‌ అపాయం ఏంటో తెలుసా?

Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…

7 hours ago

Jackfruit seeds | వైరస్‌లకు చెక్ పెట్టే పనస గింజలు.. రోగనిరోధక శక్తి పెంచే ఆరోగ్య రహస్యం ఇదే!

Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…

8 hours ago

Tulsi Leaves | తులసి నీరు ఆరోగ్యానికి చాలా ఉప‌యోగం.. నిపుణులు చెబుతున్న అద్భుత ప్రయోజనాలు

Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…

9 hours ago

Garlic Peel Benefits | వెల్లుల్లి తొక్కలు పనికిరానివి కావు. .. ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు

Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…

10 hours ago

Health Tips | బరువు తగ్గాలనుకుంటున్నారా? గ్రీన్ టీ బెటరా? మోరింగ టీ బెటరా?

Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…

11 hours ago