Drinking Hot Water : వర్షాకాలంలో గోరువెచ్చని నీరు తాగడం ఎందుకు ముఖ్యమో తెలుసా? నిపుణుల సూచనలు తప్పక తెలుసుకోండి.!
ప్రధానాంశాలు:
Drinking Hot Water : వర్షాకాలంలో గోరువెచ్చని నీరు తాగడం ఎందుకు ముఖ్యమో తెలుసా? నిపుణుల సూచనలు తప్పక తెలుసుకోండి.!
Drinking Hot Water : వర్షాకాలం వస్తే చల్లని గాలి, మబ్బులు, వాన చినుకులు వలన మనసు హాయిగా ఉంటుంది. అయితే, ఈ కాలంలో కొన్ని జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా నీరు తాగే విషయంలో అలసత్వం మంచిదికాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.వేసవిలో ఎక్కువగా నీళ్లు తాగే అలవాటు ఉన్న మనలో చాలామంది వర్షాకాలంలో దాహం తక్కువగా ఉండటంతో నీటిని తీసుకోవడం తగ్గిస్తారు. కాని వర్షాకాలంలో గోరువెచ్చని నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
Drinking Hot Water : వర్షాకాలంలో గోరువెచ్చని నీరు తాగడం ఎందుకు ముఖ్యమో తెలుసా? నిపుణుల సూచనలు తప్పక తెలుసుకోండి.!
Drinking Hot Water : ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
వేడి నీటితో వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు చూస్తే.. ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడుతుంది. వర్షాకాలంలో తేమ అధికంగా ఉండటం వల్ల బ్యాక్టీరియా, వైరస్‌లు, శిలీంధ్రాలు వేగంగా పెరుగుతాయి. దీంతో జలుబు, దగ్గు, గొంతు నొప్పి, డైజెస్టివ్ ఇన్ఫెక్షన్లు సులభంగా రావచ్చు. వేడి నీరు శరీరాన్ని లోపల నుంచి శుభ్రపరచి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
గోరువెచ్చని నీరు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. కడుపులో గ్యాస్, అసిడిటీ సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది. ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తీసుకునే వాళ్లకు ఇది మరింత ఉపయోగకరం.వర్షాకాలంలో కఫం, శ్లేష్మం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. గోరువెచ్చని నీరు గొంతులోని కఫాన్ని కరిగించి శ్వాసనాళాలను శుభ్రపరుస్తుంది. గొంతునొప్పి, దగ్గు నివారణకు ఇది సహాయకారి.ఉదయాన్నే తేనె, నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీరు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి. వేడి నీరు చర్మాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా, పిండి గ్రంథుల ద్వారా వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతుంది. ఫలితంగా చర్మం ఆరోగ్యంగా మారుతుంది. వీలైనంతవరకు బయట వర్షంలో తడవకుండా ఉండాలి, తడితే గోరువెచ్చని నీరు తాగడం మంచిది