ఇప్పుడంటే మనం ఫార్మా కంపెనీలు తయారు చేసిన మందులు వాడుతున్నాం కానీ పూర్వ కాలంలో ఎలాంటి వ్యాదికైనా కూడా ఆయుర్వేద వైద్యాన్ని మన టిప్ర్వీఆకులు ఉపయోగించేవాళ్ళు. అలా ఆయుర్వేద వైద్యంలో ఎంతో ఉపయోగపడిన వాటిలో తిప్ప తీగ ఒకటి. దీన్నే అమృత అని పిలిచేవారు. పేరుకు తగ్గట్టే ఇది అమృతంలా పని చేస్తుంది.
తిప్పతీగ వల్ల ఉపయోగాలు:
రోగ నిరోధక శక్తి
తిప్ప తీగలో ఉండే ఆల్కలాయిడ్లు, లాక్టేన్లు అనబడే బయో యాక్టివ్ సమ్మేళనాల వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధుల నుంచి రక్షిస్తాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపిస్తాయి. బాడీలో షుగర్లెవెల్స్ ను తగ్గించడంలో కూడా దోహద పడుతుంది.
ఒత్తిడి
ప్రస్తుత జనరేషన్ లో ఒత్తిడి అనేది చాలా పెద్ద సమస్యగా మారింది. దాదాపు ప్రతిఒక్కరు ఎదో ఒక సందర్భంలో ఒత్తిడికి గురి అవుతుంటారు. ఇలా ఒత్తిడిని తొలగించడానికి తిప్ప తీగ అద్భుతంగా పని చేస్తుంది. ఇది శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడమే కాక మనస్సును ప్రశాంతంగా మారుస్తుంది.
ఆర్థరైటిస్
ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరు కీళ్లవాపుల బారిన పడుతున్నారు. కీళ్లు వాపులకు గురవడం వల్ల ఆర్థరైటిస్ సమస్య వస్తుంది. తిప్పతీగలో యాంటీ ఆర్థరైటిస్ గుణాలు ఉంటాయి. అందువల్ల కీళ్ల సమస్యలు తగ్గుతాయి. అయితే తిప్ప తీగ కీళ్ల వాపులను తగ్గిస్తుంది. ఈ క్రమంలో ఆర్థరైటిస్ ఉన్నవారికి నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
శ్వాస సమస్యలు
శ్వాస సమస్యలకు తిప్పతీగ అద్భుతంగా పని చేస్తుంది. తిప్పతీగలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉండటం వల్ల జలుబు, దగ్గు తగ్గుతాయి. తిప్పతీగలో ఉండే ఔషధ గుణాలు శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి.
డయాబెటిస్
దయాబెటిస్ వల్ల మన దేశంలో అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ మధ్యకాలంలో ఇది సర్వసాధారణమైన రోగంగా మారింది. అయితే తిప్పతీగను నిత్యం తీసుకోవడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది. తిప్పతీగ మన శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగేలా చేస్తుంది. దీంతో రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గుతాయి.
విష జ్వరాలు
జ్వరాలు వచ్చిన వారు తిప్ప తీగ తీసుకోవడం వల్ల చాలా త్వరగా కోలుకునే అవకాశాలు ఉన్నాయి. ఫ్లూ, ఇతర వైరల్ జ్వరాలకు కూడా తిప్పతీగను వాడవచ్చు. తిప్పతీగ శరీర రోగ నిరోధక శక్తిని పెంచి విష జ్వరాలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
జీర్ణ ప్రక్రియ
ప్రస్తుతం అనేక మంది పాటిస్తున్న అస్తవ్యస్తమైన జీవన విధానం వల్ల వారికి జీర్ణ సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా అజీర్ణం చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. అలాంటి వారు తిప్పతీగను నిత్యం తీసుకోవాలి. తిప్పతీగ జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. చాలా మంది తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కావడం లేదని అంటుంటారు. అలాంటి వారు ఆయుర్వేదం చెబుతున్న ప్రకారం తిప్పతీగను తీసుకుంటే ఫలితం ఉంటుంది.
గమనిక: తిప్పతీగను గర్భిణీలు, పాలిచ్చే తల్లులు తీసుకోరాదు.
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
This website uses cookies.