Home » Exclusive » What Are The Side Effects Of Drinking Coconut Water
Exclusive

Health Tips : ఆరోగ్యానికి మంచిదని కొబ్బరినీళ్లు తెగ తాగేస్తున్నారా? ఈ సమస్యలు ఉన్నవాళ్లు అస్సలు తాగకూడదు

Authored By
Jagadesh Gatla
The Telugu News | Updated on: February 20, 2022 6:07 pm
Advertisement

Health Tips : కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలామంచిదని అందరికీ తెలుసు. జ్వరం వచ్చినా.. ఇంకేదైనా ఆరోగ్య సమస్య వచ్చినా.. డాక్టర్లు చెప్పేది ఒక్కటే. కొబ్బరి నీళ్లు తాగండి అంటారు. కాస్త నీరసంగా ఉన్నా కూడా వెంటనే కొబ్బరి నీళ్లు తాగాలని డాక్టర్లు సూచిస్తుంటారు. నీరసం వచ్చినా.. శక్తి కావాలన్నా కొబ్బరి నీళ్లను తాగాలని సూచిస్తుంటారు.కొబ్బరి నీళ్లు తరుచుగా తీసుకోవడం వల్ల.. గుండె సంబంధ సమస్యలు తగ్గుతాయి. హైబీపీని కూడా కంట్రోల్ లో ఉంచుకోవచ్చు.

Advertisement

శరీరంలో జీవక్రియ రేటు కూడా పెరుగుతుంది. అలగే.. కొబ్బరి నీళ్లలో ఖనిజాలు ఉంటాయి. అవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.అయినప్పటికీ.. కొబ్బరినీళ్లను ఈ సమస్యలు ఉన్నవాళ్లు తాగకూడదు. కొబ్బరి నీళ్లలో ఉండే.. ఎలక్ట్రోలైట్స్.. శరీరంలో నీటి శాతాన్ని పెంచుతాయి. అందుకే.. జలుబుతో బాధపడేవాళ్లు కొబ్బరి నీళ్లను అస్సలు తాగకూడదు. అలాగే రాత్రి పూట అస్సలు తాగకూడదు.

what are the side effects of drinking coconut water

Advertisement

Health Tips : కొబ్బరి నీళ్లు ఎవరు తాగకూడదో తెలుసా?

కడుపు నొప్పి ఉన్నవాళ్లు.. హైబీపీ తగ్గేందుకు ట్యాబ్లెట్స్ వేసుకునే వాళ్లు కూడా కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగకూడదు.కొబ్బరి నీళ్లు శరీరంలో నీటి శాతాన్ని పెంచుతుండటం వల్ల.. ఈ అనారోగ్య సమస్యలు ఉంటే విరేచనాలు అవుతాయి. ఓవైపు హైబీపీకి మందులు వాడుతూ.. నిత్యం కొబ్బరి నీళ్లు తీసుకుంటే.. హైబీపీ సమస్య కాస్త లోబీపీ సమస్యగా మారుతుంది. అందుకే.. ఇటువంటి సమస్యలు ఉన్నవాళ్లు వీలైనంత కొబ్బరి నీళ్లకు దూరంగా ఉండాలి.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి