Swallow Bubble Gum : బబుల్ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు. ఏదైనా పని చేస్తున్నప్పుడు, కాలేజీలో క్లాసులు వింటున్నప్పుడు, ఇంకొందరు డ్రైవింగ్ లో ఉన్నప్పుడు, ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు.. టైమ్ పాస్ కోసం చాలామంది బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు. చాలాసేపు దాన్ని నమిలిన తర్వాత బయట ఊసేస్తారు.
#image_title
కానీ.. కొందరు తెలియకుండా మరిచిపోయి దాన్ని మింగేస్తుంటారు. వాటర్ తాగేటప్పుడు కావచ్చు.. లేదా నములుతూ కావచ్చు.. ఏదో మాట్లాడుతూ కావచ్చు.. కొందరు ప్రమాదవశాత్తు దాన్ని మింగేస్తారు. మింగిన తర్వాత అయ్యో.. అంటూ భయపడుతుంటారు. ఎందుకంటే.. గమ్ లా సాగే గుణం ఉన్న బబుల్ గమ్ ను తింటే లోపల పేగుల్లో అతుక్కుపోతుందనే భయం ఉంటుంది చాలామందికి. కానీ.. అసలు బబుల్ గమ్ ను ప్రమాదవశాత్తు మింగినా కూడా ఏం కాదు. దాని వల్ల ఎలాంటి సమస్య ఉండదు. అది కడుపులోకి వెళ్లాక జీర్ణాశయంలోకి వెళ్లి జీర్ణం కాకుండానే అక్కడి నుంచి నేరుగా పెద్ద పేగుల ద్వారా లాట్రిన్ వెళ్లిన సమయంలో బయటికి వచ్చేస్తుంది. కాబట్టి ఒకవేళ అనుకోకుండా బబుల్ గమ్ ను మింగినా పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి మాత్రం బబుల్ గమ్ ను కావాలని మింగకండి. ఓకేనా.