Categories: HealthNews

Drink Water : నిలబడి నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా… వెరీ డేంజర్…!

Drink Water : మన పూర్వీకులు ఆచారాల పేరుతో ఎన్నో రకాల ఆరోగ్య విషయాలను మనకు బోధించారు. భోజనం చేసే పద్ధతి నుండి నిద్రపోయే వరకు ఎన్నో రకాల పద్ధతులను మన పూర్వీకులు నుండి మనం నేర్చుకోవడం జరిగింది. ఇక వాటి వెనక కూడా ఎంతో సైన్స్ దాగి ఉంటుంది. మరి ముఖ్యంగా ఆరోగ్యం గురించి.. అయితే సాధారణంగా చాలామంది మంచినీళ్లు ఎలా పడితే అలా తాగుతుంటారు. 90 శాతం మంది మంచినీటిని తప్పుగానే తాగుతున్నారని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే నీటిని తాగేందుకు కూడా ఒక పద్ధతి ఉందని వారు సూచిస్తున్నారు. అయితే ఆయుర్వేదం ప్రకారం నీటిని భోజనానికి 30 నిమిషాల ముందు మరియు భోజనం చేసిన 30 నిమిషాల తర్వాత తాగాలి. అప్పుడే మనం తిన్న ఆహారం నుండి పోషకాలు సక్రమంగా గ్రహించబడతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే తిన్న ఆహారం కూడా సక్రమంగా జీర్ణం అవుతుంది. కావున భోజనం చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ నీళ్లు తాగకూడదని నిపుణులు చెబుతున్నారు.

ఒకవేళ అంతగా తాగాలి అనిపిస్తే మాత్రం కొద్దిగా తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. అదేవిధంగా మరో ముఖ్యమైన విషయం ఏంటంటే నీళ్లను తీసుకునేటప్పుడు నిలుచుని అస్సలు తాగకూడదట. నిలుచుని నీటిని తాగడం వలన జీర్ణ వ్యవస్థ పై నేరుగా ప్రభావం పడుతుంది. అది కిడ్నీలో పనితీరును దెబ్బతీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి నీళ్లను ఎల్లప్పుడూ కూర్చునే తాగాలని పలువురు చెబుతున్నారు. అదేవిధంగా ఎల్లప్పుడూ గోరువెచ్చని నీళ్లు లేదా గది ఉష్ణోగ్రత వద్ద ఉండే నీటిని మాత్రమే తీసుకోవాలని చల్లని నీటిని తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. అయితే చల్లని నీటిని తాగాలి అనుకునేవారు కుండ లో నీటిని తాగటం మంచిదని ఫ్రిజ్ లో చల్లబరిచిన నీటిని అస్సలు తీసుకోకూడదని హెచ్చరిస్తున్నారు. ఫ్రిజ్ లో నీటిని తీసుకోవడం వలన శరీరంలో కఫం పెరిగిపోయి శ్వాసకోశ సమస్యలు వస్తాయి. అదేవిధంగా మలబద్ధకం వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

అదేవిధంగా ఫ్రిజ్ లో కూర్చుని నీటిని తాగడం వలన ఆహారంలో ఉండే పోషకాలను కూడా శరీరం గ్రహించలేదన్నారు.అంతేకాక ఫ్రిజ్ లో చల్లబరిచిన నీటిని తాగడం వలన రక్తనాళాలు కూచించు కుపోతాయట. దీంతో గుండె సంబంధిత వ్యాధులు హార్ట్ ఎటాక్ వంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి చల్లటి నీటిని తాగకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా ప్రతిరోజు కనీసం 2 నుండి 3 లీటర్ల నీళ్లు తాగాలి. అలాగే నీటిని తాగే సమయంలో మధ్యమధ్య కొంత సమయం గ్యాప్ ఇచ్చి తాగాలి. ఎక్కువ మొత్తంలో నీటిని ఒకేసారి తాగడం కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే అది జీర్ణాశయంపై ఒత్తిడి పెరిగేలా చేస్తుంది. కాబట్టి నీటిని కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తాగటం మంచిది. గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. ది తెలుగు న్యూస్ దీనిని ధృవీకరించలేదు.

Share

Recent Posts

Today Gold Price : ఏం కొంటాం.. మళ్లీ లక్ష కు చేరుకున్న బంగారం…!

Today Gold Price : మే 7వ తేదీ బుధవారం బంగారం ధరలు Gold Rates భారీగా పెరిగాయి. 24…

48 minutes ago

Operation Sindoor : ఉగ్ర‌మూక‌ల దాడికి సిందూర్ అనే పేరు ఎందుకు పెట్టారో తెలుసా?

Operation Sindoor  : పాక్‌లోని ఉగ్రస్థావరాలపై INDian VS Pakistan  భారతదేశం మెరుపు దాడులు చేసింది. ' ఆపరేషన్ సింధూర్…

2 hours ago

Anganwadis : అంగ‌న్‌వాడీల‌కి గుడ్ న్యూస్ చెప్పిన ప్ర‌భుత్వం.. జీతాలు పెంచేశారుగా.!

Anganwadis : అంగన్‌వాడీ టీచర్లుకు తెలంగాణ Telangana Govr ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు…

3 hours ago

Double Bedroom Houses : త్వ‌ర‌లో 4 వేల డ‌బుల్ ఇండ్ల పంపిణీ.. ఎవ‌రెవ‌రికి అంటే..!

Double Bedroom Houses : గ్రేట‌ర్‌లో నిర్మించి ఖాళీగా ఉన్న డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల‌ని ల‌బ్ధి దారుల‌కి అంద‌జేయాల‌ని…

3 hours ago

Fish food : ఆహారంగా ఈ మూడు చేప‌ల విష‌యంలో జాగ్ర‌త్త‌..

fish food : చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డి, విటమిన్ బి2, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్,…

5 hours ago

AP Ration Cards : ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. నేటి నుంచే రేషన్ కార్డులకు దరఖాస్తులు

AP Ration Cards : సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఆంధ్ర్ర్రప్ర‌దేశ్‌ ప్రజల ఎదురుచూపులు ఫలించాయి. ఎట్టకేలకు నూత‌న రేషన్‌ కార్డులు ఇచ్చేందుకు…

6 hours ago

Chapati In TEA : టీలో చ‌పాతి ముంచుకొని తింటే ప్రాణాలు పోతాయి.. జ‌ర భ‌ద్రం

Chapati In TEA : కొంద‌రికి టీలో కొన్ని వ‌స్తువుల‌ని ముంచుకొని తిన‌డం అల‌వాటు. ఉదయాన్నే వేడి టీతో రెండు…

7 hours ago

Eating Raw Onion In Summers : వేసవి ఆహారంలో ఉల్లిపాయల‌ను చేర్చుకోండి.. ఈ ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పొందండి

Eating Raw Onion In Summers : మండే వాతావరణం ఆరోగ్యం మరియు శ్రేయస్సును దెబ్బతీస్తుంది. కాబట్టి, శరీరాన్ని ప్రశాంతంగా,…

7 hours ago