Drink Water : నిలబడి నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా… వెరీ డేంజర్…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Drink Water : నిలబడి నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా… వెరీ డేంజర్…!

Drink Water : మన పూర్వీకులు ఆచారాల పేరుతో ఎన్నో రకాల ఆరోగ్య విషయాలను మనకు బోధించారు. భోజనం చేసే పద్ధతి నుండి నిద్రపోయే వరకు ఎన్నో రకాల పద్ధతులను మన పూర్వీకులు నుండి మనం నేర్చుకోవడం జరిగింది. ఇక వాటి వెనక కూడా ఎంతో సైన్స్ దాగి ఉంటుంది. మరి ముఖ్యంగా ఆరోగ్యం గురించి.. అయితే సాధారణంగా చాలామంది మంచినీళ్లు ఎలా పడితే అలా తాగుతుంటారు. 90 శాతం మంది మంచినీటిని తప్పుగానే తాగుతున్నారని నిపుణులు […]

 Authored By ramu | The Telugu News | Updated on :23 March 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Drink Water : నిలబడి నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా... వెరీ డేంజర్...!

Drink Water : మన పూర్వీకులు ఆచారాల పేరుతో ఎన్నో రకాల ఆరోగ్య విషయాలను మనకు బోధించారు. భోజనం చేసే పద్ధతి నుండి నిద్రపోయే వరకు ఎన్నో రకాల పద్ధతులను మన పూర్వీకులు నుండి మనం నేర్చుకోవడం జరిగింది. ఇక వాటి వెనక కూడా ఎంతో సైన్స్ దాగి ఉంటుంది. మరి ముఖ్యంగా ఆరోగ్యం గురించి.. అయితే సాధారణంగా చాలామంది మంచినీళ్లు ఎలా పడితే అలా తాగుతుంటారు. 90 శాతం మంది మంచినీటిని తప్పుగానే తాగుతున్నారని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే నీటిని తాగేందుకు కూడా ఒక పద్ధతి ఉందని వారు సూచిస్తున్నారు. అయితే ఆయుర్వేదం ప్రకారం నీటిని భోజనానికి 30 నిమిషాల ముందు మరియు భోజనం చేసిన 30 నిమిషాల తర్వాత తాగాలి. అప్పుడే మనం తిన్న ఆహారం నుండి పోషకాలు సక్రమంగా గ్రహించబడతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే తిన్న ఆహారం కూడా సక్రమంగా జీర్ణం అవుతుంది. కావున భోజనం చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ నీళ్లు తాగకూడదని నిపుణులు చెబుతున్నారు.

ఒకవేళ అంతగా తాగాలి అనిపిస్తే మాత్రం కొద్దిగా తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. అదేవిధంగా మరో ముఖ్యమైన విషయం ఏంటంటే నీళ్లను తీసుకునేటప్పుడు నిలుచుని అస్సలు తాగకూడదట. నిలుచుని నీటిని తాగడం వలన జీర్ణ వ్యవస్థ పై నేరుగా ప్రభావం పడుతుంది. అది కిడ్నీలో పనితీరును దెబ్బతీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి నీళ్లను ఎల్లప్పుడూ కూర్చునే తాగాలని పలువురు చెబుతున్నారు. అదేవిధంగా ఎల్లప్పుడూ గోరువెచ్చని నీళ్లు లేదా గది ఉష్ణోగ్రత వద్ద ఉండే నీటిని మాత్రమే తీసుకోవాలని చల్లని నీటిని తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. అయితే చల్లని నీటిని తాగాలి అనుకునేవారు కుండ లో నీటిని తాగటం మంచిదని ఫ్రిజ్ లో చల్లబరిచిన నీటిని అస్సలు తీసుకోకూడదని హెచ్చరిస్తున్నారు. ఫ్రిజ్ లో నీటిని తీసుకోవడం వలన శరీరంలో కఫం పెరిగిపోయి శ్వాసకోశ సమస్యలు వస్తాయి. అదేవిధంగా మలబద్ధకం వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

అదేవిధంగా ఫ్రిజ్ లో కూర్చుని నీటిని తాగడం వలన ఆహారంలో ఉండే పోషకాలను కూడా శరీరం గ్రహించలేదన్నారు.అంతేకాక ఫ్రిజ్ లో చల్లబరిచిన నీటిని తాగడం వలన రక్తనాళాలు కూచించు కుపోతాయట. దీంతో గుండె సంబంధిత వ్యాధులు హార్ట్ ఎటాక్ వంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి చల్లటి నీటిని తాగకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా ప్రతిరోజు కనీసం 2 నుండి 3 లీటర్ల నీళ్లు తాగాలి. అలాగే నీటిని తాగే సమయంలో మధ్యమధ్య కొంత సమయం గ్యాప్ ఇచ్చి తాగాలి. ఎక్కువ మొత్తంలో నీటిని ఒకేసారి తాగడం కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే అది జీర్ణాశయంపై ఒత్తిడి పెరిగేలా చేస్తుంది. కాబట్టి నీటిని కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తాగటం మంచిది. గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. ది తెలుగు న్యూస్ దీనిని ధృవీకరించలేదు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది