Home » Health » What If Plant Betel Leaf In Home Must Know This Vastu Tips
Health

Betel Leaf : ఇంట్లో తమలపాకు మొక్కని పెంచుతున్నారా… అయితే ఈ వాస్తు నియమాలు తప్పక తెలుసుకోండి…

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: September 10, 2024, 8:00 am
Advertisement

Betel Leaf : హిందూ సాంప్రదాయాలలో తమలపాకుల ప్రత్యేకత ఏంటో అందరికీ తెలిసిందే. తమలపాకు లేకుండా ఏ పూజలు గాని వ్రతాలు గాని పూర్తి కావు. ముఖ్యంగా తమలపాకు లేకుండా తాంబూలం అస్సలు ఇవ్వరు. అదేవిధంగా ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే తమలపాకుతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. తమలపాకుని తినడం వలన అనేక వ్యాధుల నుంచి బయటపడవచ్చు. ప్రస్తుతం తమలపాకు మొక్కని ప్రతి ఒక్కరు ఇంట్లో పెంచుకుంటున్నారు. ఇక వాస్తు శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే కొన్ని మొక్కలను ఇంట్లో పెంచకూడదు. ఒకవేళ పెంచినట్లయితే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అదేవిధంగా కొన్ని రకాల మొక్కలను ఇంట్లో పెంచడం ద్వారా ధన లాభాన్ని పొందుతారు. మరి ఇంట్లో తమలపాకు మొక్కను పెంచడం ద్వారా ఎలాంటి ఫలితాలు ఉంటాయి. ఇంట్లో ఈ మొక్కని పెంచుకోవచ్చా. ఒకవేళ ఈ మొక్క ఉంటే ఏ దిశగా ఉంటే మంచి జరుగుతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…

Advertisement

Betel Leaf డబ్బుకు లోటు ఉండదు.

తమలపాకు మొక్కకి మరొక పేరు నాగవల్లి. హిందూ మతంలో తమలపాకు కు ఎంతో విశిష్టత ఉంది. ముఖ్యంగా ఆయుర్వేదంలో తమలపాకును ఔషధంగా ఉపయోగిస్తారు. అలాగే ఇంట్లో తమలపాకు చెట్టు ఉంటే ఆ ఇంట్లో శని దేవుడు ఉండడు అని నమ్మకం. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో తమలపాకు మొక్క ఉన్నట్లయితే ఆర్థిక కష్టాలు ఉండవు. మరియుు డబ్బుకు ఎలాంటి లోటు ఉండదని పట్టిందల్లా బంగారంగా మారుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

Betel Leaf లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.

హిందూ సాంప్రదాయాల్లో తమలపాకు మొక్క ఇంట్లో ఉంటే ఆంజనేయస్వామి మరియు లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నారని నమ్మకం. అలాగే తమలపాకు మొక్క ఇంట్లో ఏపుగా పెరిగినట్లయితే అప్పుల బాధలు నుంచి బయట పడతారు. అదేవిధంగా బుధ గ్రహం అనుకూలం కూడా వీరికి కలిసి వస్తుంది.

Advertisement

Betel Leaf : ఇంట్లో తమలపాకు మొక్కని పెంచుతున్నారా…అయితే ఈ వాస్తు నియమాలు తప్పక తెలుసుకోండి…

తూర్పు వైపు ఉంచాలి.

Advertisement

తమలపాకు మొక్క బాగా పెరగాలి అంటే సూర్య కాంతి తగిలే చోట ఈ మొక్కను ఉంచాలి. అలాగే మరి ఎండ తగిలే చోట కూడా దీనిని ఉంచకూడదు. అలా ఉంటే ఈ మొక్క మాడిపోతుంది. ముఖ్యంగా ఈ మొక్కని తూర్పు వైపు ఉంచితే మంచి జరుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. కావున ఇంట్లో తమలపాకు మొక్కని ఎలాంటి సందేహం లేకుండా పెంచుకోవచ్చు. దీనివల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి