Betel Leaf : ఇంట్లో తమలపాకు మొక్కని పెంచుతున్నారా… అయితే ఈ వాస్తు నియమాలు తప్పక తెలుసుకోండి… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Betel Leaf : ఇంట్లో తమలపాకు మొక్కని పెంచుతున్నారా… అయితే ఈ వాస్తు నియమాలు తప్పక తెలుసుకోండి…

Betel Leaf : హిందూ సాంప్రదాయాలలో తమలపాకుల ప్రత్యేకత ఏంటో అందరికీ తెలిసిందే. తమలపాకు లేకుండా ఏ పూజలు గాని వ్రతాలు గాని పూర్తి కావు. ముఖ్యంగా తమలపాకు లేకుండా తాంబూలం అస్సలు ఇవ్వరు. అదేవిధంగా ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే తమలపాకుతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. తమలపాకుని తినడం వలన అనేక వ్యాధుల నుంచి బయటపడవచ్చు. ప్రస్తుతం తమలపాకు మొక్కని ప్రతి ఒక్కరు ఇంట్లో పెంచుకుంటున్నారు. ఇక వాస్తు శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే కొన్ని మొక్కలను ఇంట్లో పెంచకూడదు. […]

 Authored By ramu | The Telugu News | Updated on :10 September 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Betel Leaf : ఇంట్లో తమలపాకు మొక్కని పెంచుతున్నారా...అయితే ఈ వాస్తు నియమాలు తప్పక తెలుసుకోండి...

Betel Leaf : హిందూ సాంప్రదాయాలలో తమలపాకుల ప్రత్యేకత ఏంటో అందరికీ తెలిసిందే. తమలపాకు లేకుండా ఏ పూజలు గాని వ్రతాలు గాని పూర్తి కావు. ముఖ్యంగా తమలపాకు లేకుండా తాంబూలం అస్సలు ఇవ్వరు. అదేవిధంగా ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే తమలపాకుతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. తమలపాకుని తినడం వలన అనేక వ్యాధుల నుంచి బయటపడవచ్చు. ప్రస్తుతం తమలపాకు మొక్కని ప్రతి ఒక్కరు ఇంట్లో పెంచుకుంటున్నారు. ఇక వాస్తు శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే కొన్ని మొక్కలను ఇంట్లో పెంచకూడదు. ఒకవేళ పెంచినట్లయితే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అదేవిధంగా కొన్ని రకాల మొక్కలను ఇంట్లో పెంచడం ద్వారా ధన లాభాన్ని పొందుతారు. మరి ఇంట్లో తమలపాకు మొక్కను పెంచడం ద్వారా ఎలాంటి ఫలితాలు ఉంటాయి. ఇంట్లో ఈ మొక్కని పెంచుకోవచ్చా. ఒకవేళ ఈ మొక్క ఉంటే ఏ దిశగా ఉంటే మంచి జరుగుతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…

Betel Leaf డబ్బుకు లోటు ఉండదు.

తమలపాకు మొక్కకి మరొక పేరు నాగవల్లి. హిందూ మతంలో తమలపాకు కు ఎంతో విశిష్టత ఉంది. ముఖ్యంగా ఆయుర్వేదంలో తమలపాకును ఔషధంగా ఉపయోగిస్తారు. అలాగే ఇంట్లో తమలపాకు చెట్టు ఉంటే ఆ ఇంట్లో శని దేవుడు ఉండడు అని నమ్మకం. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో తమలపాకు మొక్క ఉన్నట్లయితే ఆర్థిక కష్టాలు ఉండవు. మరియుు డబ్బుకు ఎలాంటి లోటు ఉండదని పట్టిందల్లా బంగారంగా మారుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

Betel Leaf లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.

హిందూ సాంప్రదాయాల్లో తమలపాకు మొక్క ఇంట్లో ఉంటే ఆంజనేయస్వామి మరియు లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నారని నమ్మకం. అలాగే తమలపాకు మొక్క ఇంట్లో ఏపుగా పెరిగినట్లయితే అప్పుల బాధలు నుంచి బయట పడతారు. అదేవిధంగా బుధ గ్రహం అనుకూలం కూడా వీరికి కలిసి వస్తుంది.

Betel Leaf ఇంట్లో తమలపాకు మొక్కని పెంచుతున్నారాఅయితే ఈ వాస్తు నియమాలు తప్పక తెలుసుకోండి

Betel Leaf : ఇంట్లో తమలపాకు మొక్కని పెంచుతున్నారా…అయితే ఈ వాస్తు నియమాలు తప్పక తెలుసుకోండి…

తూర్పు వైపు ఉంచాలి.

తమలపాకు మొక్క బాగా పెరగాలి అంటే సూర్య కాంతి తగిలే చోట ఈ మొక్కను ఉంచాలి. అలాగే మరి ఎండ తగిలే చోట కూడా దీనిని ఉంచకూడదు. అలా ఉంటే ఈ మొక్క మాడిపోతుంది. ముఖ్యంగా ఈ మొక్కని తూర్పు వైపు ఉంచితే మంచి జరుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. కావున ఇంట్లో తమలపాకు మొక్కని ఎలాంటి సందేహం లేకుండా పెంచుకోవచ్చు. దీనివల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది