Dialysis : డయాలసిస్ ఎవరికీ అవసరం… ఎందుకు చేస్తారు… చేయకుంటే ఏమవుతుంది..?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Dialysis : డయాలసిస్ ఎవరికీ అవసరం… ఎందుకు చేస్తారు… చేయకుంటే ఏమవుతుంది..??

Dialysis : మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కిడ్నీలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అలాగే శరీరంలో రక్తం నుండి టాక్సిన్స్ మరియు వ్యర్థ పదార్థాలను ఫిల్టర్ చేయడం కిడ్నీల యొక్క ముఖ్య పని. అలాగే శరీరం నుండి వ్యర్ధ పదార్థాలను మూత్రం రూపంలో బయటకు పంపించడం కూడా దీని యొక్క ముఖ్య బాధ్యత. ఇటువంటి పరిస్థితులలో కిడ్నీలు పనిచేయడం మానేస్తే, శరీరంలో టాక్సిన్స్ మరియు వ్యర్ధపదార్థాలు అనేవి పేరుకుపోయి ఎన్నో రోగాలకు కారణం అవుతుంది. ప్రస్తుత కాలంలో […]

 Authored By ramu | The Telugu News | Updated on :17 November 2024,11:04 am

ప్రధానాంశాలు:

  •  Dialysis : డయాలసిస్ ఎవరికీ అవసరం...ఎందుకు చేస్తారు... చేయకుంటే ఏమవుతుంది..??

Dialysis : మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కిడ్నీలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అలాగే శరీరంలో రక్తం నుండి టాక్సిన్స్ మరియు వ్యర్థ పదార్థాలను ఫిల్టర్ చేయడం కిడ్నీల యొక్క ముఖ్య పని. అలాగే శరీరం నుండి వ్యర్ధ పదార్థాలను మూత్రం రూపంలో బయటకు పంపించడం కూడా దీని యొక్క ముఖ్య బాధ్యత. ఇటువంటి పరిస్థితులలో కిడ్నీలు పనిచేయడం మానేస్తే, శరీరంలో టాక్సిన్స్ మరియు వ్యర్ధపదార్థాలు అనేవి పేరుకుపోయి ఎన్నో రోగాలకు కారణం అవుతుంది. ప్రస్తుత కాలంలో అనారోగ్య జీవనశైలి కారణం చేత ఎంతోమంది కిడ్నీల సమస్య బారిన పడుతున్నారు. దీంతో మధుమేహం మరియు అధిక రక్తపోటు, మూత్రపిండాల వైఫల్యానికి కూడా ముఖ్య కారణాలు అని చెప్పొచ్చు. ఇది కిడ్నీ ఫెయిల్యూర్ మరియు కిడ్నీ వ్యాధి లాంటి సమస్యలకు కూడా దారి తీస్తుంది. ఒకవేళ మీ మూత్రపిండాలు గనుక విఫలమైతే డయాలసిస్ ద్వారా రక్తాన్ని శుభ్రపరుస్తారు. దీనిని మన శరీరంలోని వ్యర్ధపదార్థాలను తొలగించడానికి ఎక్కువగా వాడతారు. అలాగే కిడ్నీ ఆరోగ్యాన్ని ఎలా రక్షించుకోవాలో మరియు డయాలసిస్ కు సంబంధించిన ఇతర విషయాల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం…

డయాలసిస్ అంటే ఏమిటి : మన శరీరంలో మూత్రపిండాల ప్రధాన పని రక్తాన్ని ఫిల్టర్ చేయడం మరియు శరీరంలో వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడం. అలాగే కొన్ని సందర్భాలలో మూత్రపిండాల వైఫల్యం కూడా సంభవిస్తుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనే డయాలసిస్ అవసరం అవుతుంది. అయితే ఈ డయాలసిస్ అనేది శరీరం నుండి రక్తాన్ని తీసివేసి యంత్రం ద్వారా రక్తాన్ని క్లీన్ చేసి తిరిగి శరీరానికి చేరవేసే పద్ధతిని డయాలసిస్ అంటారు…

డయాలసిస్ ఎవరికోసం చేస్తారు : కిడ్నీ ఫెయిల్యూర్ మరియు ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీస్ తో ఇబ్బంది పడే వారికి డయాలసిస్ చేస్తారు. అలాగే అధిక రక్తపోటు మరియు మధుమేహం లూపస్ లాంటి సమస్యలు ఉన్నవారికి కిడ్నీలు అనేవి తొందరగా దెబ్బతింటాయి. ఇది కిడ్నీ వ్యాధికి కారణం అవుతుంది. అంతేకాక మూత్రపిండాల వ్యాధి ఉన్నవారిలో మరియు వారి యొక్క మూత్రపిండాల సాధారణ పనితీరు తగ్గి 10 నుండి 15% వరకు మాత్రమే పనిచేస్తాయి. ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడే వారు జీవించడానికి డయాలసిస్ లేక కీడ్ని మార్పు అనేది అవసరం అవుతుంది. అలాగే కీడ్ని అనేది అందుబాటులో ఉంటేనే కిడ్నీ మార్పు చేయడం జరుగుతుంది. లేకుంటే రోగులకు డయాలసిస్ ఒకటే మార్గం…

Dialysis డయాలసిస్ ఎవరికీ అవసరం ఎందుకు చేస్తారు చేయకుంటే ఏమవుతుంది

Dialysis : డయాలసిస్ ఎవరికీ అవసరం… ఎందుకు చేస్తారు… చేయకుంటే ఏమవుతుంది..??

డయాలసిస్ ఎన్ని రోజులు చేస్తారు : ప్రతి రోగికి డయాలసిస్ టైం అనేది మారుతూ ఉంటుంది. అయితే కొంతమందికి మాత్రం ఇది రోజు అవసరం. ఇంకొంతమంది అయితే ఒకటి లేక రెండు రోజుల వ్యవధిలో చేయించుకుంటారు. అలాగే డయాలసిస్ ద్వారా రోగుల యొక్క రక్తాన్ని యంత్రం ద్వారా క్లిన్ చేస్తారు. దీంతో రక్తం నుండి వ్యర్ధపదార్థాలను బయటకు పంపించి మళ్లీ తిరిగి శుబ్రమైన రక్తాన్ని శరీరంలోకి చేరవేస్తారు.

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది