Mosquitoes : మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల ప్రాంతాలలో మనతో పాటుగా ఎన్నో రకాల జీవరాసులు కూడా నివసిస్తున్నాయి. వాటిలో దోమలు కూడా ఒకటి. ఈ దోమలలో కూడా మనుషుల మాదిరిగా ఆడ,మగ దోమలు రెండు ఉన్నాయి. వీటిలో మగ దోమలు పువ్వుల నుండి తేనెను తీసుకుంటాయి. కానీ ఆడ దోమలు మాత్రం ఆహారం కోసం మనుషులను కుడతాయనే సంగతి మీకు తెలుసా. ఈ దోమలు గుడ్లను ఉత్పత్తి చేసేందుకు మానవ రక్తంలోని కొన్ని ప్రోటీన్లను తీసుకుంటాయి. అయితే మనిషిని కుట్టే ఈ ప్రక్రియలో ఆడ దోమ యొక్క లాలాజలాన్ని మానవ రక్తంలోనికి పంపిస్తుంది. దీంతో మలేరియా, డెంగ్యూ,చికెన్ గునియా, జీక వైరస్ ఇన్ఫెక్షన్లు మొదలై ఇతర వెక్టర్ బర్ను ఇన్ఫెక్షన్ లాంటి సమస్యలకు దారితీస్తుంది. అయితే ఈ వెక్టర్ బర్న్ వలన సంక్రమించే అంటూ వ్యాధులు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ మంది మరణానికి కారణం అవుతుంది. అసలే ఇది వర్షాకాలం దోమల బెడద కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే దోమలు మనలో కొందరిని మాత్రమే ఎక్కువగా కుడతాయి. దానికి కారణం ఏమిటో అని ఎప్పుడైనా ఆలోచించారా. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం…
దోమలు కుట్టేందుకు ముఖ్య కారణం మనం ధరించే బట్టలు. ఎందుకు అంటే. ఈ దోమలు లేత రంగుల కంటే ముదురు రంగు దుస్తులకు ఎక్కువగా ఆకర్షితులవుతాయి. అలాగే హాఫ్ స్లీవ్ బట్టలు మరియు పొట్టి బట్టలు వేసుకోవడం వలన కూడా దోమలు కొట్టడానికి ఎక్కువగా ఇష్టపడతాయి. అయితే ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే. ఈ డెంగ్యూ వ్యాధికి కారణమయ్యేటటువంటి ఎడిస్ దోమ కాళ్ళను కాకుండా చేతులనే ఎక్కువగా కొడుతుంది అంట. ఇక మలేరియాకు కారణం అయ్యే అనాఫిలిస్ జాతికి చెందినటువంటి దోమలు కాళ్లపై కొట్టేందుకు ఎక్కువగా ఇష్టపడతాయట. కావున వర్షాకాలంలో ఫ్లూ అంటు వ్యాధుల టైమ్ లో పూర్తిగా దుస్తులను ధరించటం చాలా అవసరం. అలాగే లేత రంగులో ఉన్నటువంటి దుస్తులు ధరించడం వలన కూడా ఈ దోమల బారిన పడకుండా ఉండవచ్చు. ఇకపోతే దోమలు అధికంగా కొట్టేందుకు మరొక ముఖ్య కారణం కూడా ఉంది.
అది ఏమిటంటే. ఈ దోమలు కొన్ని బ్లడ్ గ్రూపులో ఉన్న మనుషులను ఇతరుల కంటే ఎక్కువగా కుడతాయి అని నిపుణులు అంటున్నారు. ఈ ఇతర బ్లడ్ గ్రూపులతో పోలిస్తే ‘O’ బ్లడ్ గ్రూపు ఉన్నటువంటి మనుషులను దోమలు అధికంగా ఆకర్షిస్తాయని నిపునులు అంటున్నారు. ఇక శరీర ఉష్ణోగ్రత అధికంగా ఉండే వారిని కూడా ఈ దోమలనేవి ఎక్కువగా కొట్టడానికి ఎక్కువగా ఇష్టపడతాయని నిపుణులు అంటున్నారు. అయితే ఆల్కహాల్ తీసుకోవడం వలన శరీర ఉష్ణోగ్రత అనేది బాగా పెరుగుతుంది. దీంతో శరీరంలో జీవక్రియ కూడా ఎంతో బాగా పెరుగుతుంది. అలాగే చెమట బాగా పెరుగుతుంది. ఈ కారకాలన్నీ కూడా దోమలకు ఎంతో ఆకర్షణియంగా పని చేస్తాయని అంటున్నారు నిపుణులు…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.