Worst Habits : మీకు ఈ 6 అలవాట్లు ఉన్నాయా….. త్వరగా వృద్ధులు అవుతారు జాగ్రత్త…!
ప్రధానాంశాలు:
Worst Habits : మీకు ఈ 6 అలవాట్లు ఉన్నాయా..... త్వరగా వృద్ధులు అవుతారు జాగ్రత్త...!
Worst Habits : ప్రస్తుత కాలంలో ఉన్న బిజీ లైఫ్ కారణంగా చాలామంది ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. అంతేకాక ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు జీవనశైలి కారణంగా అనేక రకాల వ్యాధులు మనల్ని వెంటాడుతున్నాయి. ఇక ఈ వ్యాధులతో పాటు వృద్ధాప్యం కూడా త్వరగానే వచ్చేస్తుంది. ఈ సందర్భంలోనే ఓ వ్యక్తికి కొన్ని రకాల హాని కలిగించే అలవాట్లు ఉండడం వలన మృత్యువు అంచులు దాకా వెళ్లి రావచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాంటి అలవాట్లు ఉన్నట్లయితే వెంటనే మానుకోవాల్సిందిగా హెచ్చరిస్తున్నారు. అయితే వాస్తవానికి మనిషికున్న కొన్ని రకాల చెడు అలవాట్లే అతనికి పెద్ద శత్రువు అని చెప్పాలి. కాబట్టి అలాంటి అలవాట్లను వెంటనే మార్చుకోకపోతే కొన్ని రోజులు తర్వాత అవి ఆరోగ్యం పై ప్రభావం చూపడం మొదలుపెడతాయి. మరి ఆ అలవాట్లు ఏంటి…?పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం…
Worst Habits : మొబైల్స్ – షాప్ టాప్స్ ..
ఈ రోజుల్లో మొబైల్ మరియు లాప్ టాప్స్ వినియోగం సర్వసాధారణంగా మారిపోయింది. కానీ వాటిని అతిగా ఉపయోగించడం వలన అది మీ వయసు పై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. కావున ఇలాంటి అలవాట్లు ఉన్నవారు వెంటనే మార్చుకుంటే మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొబైల్ లేదా ల్యాప్ టాప్స్ ను అవసరం ఉన్నంతవరకే ఉపయోగించాలని అవసరం లేని సమయంలో వాటికి దూరంగా ఉండటమే మంచిదంటూ సూచిస్తున్నారు.
Worst Habits : సరైన నిద్ర…
మనిషి ఆరోగ్యానికి నిద్రకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఎంత ఎక్కువ నిద్రపోతే ఆరోగ్యం అంత మంచిగా ఉంటుంది. కానీ ప్రస్తుత కాలంలో చాలామంది అర్ధరాత్రి చాలా సమయం వరకు నిద్రపోకుండా కాలక్షేపం చేస్తూ కనిపిస్తున్నారు. దీని కారణంగా అనేక రకాల వ్యాధులు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయట. కావున రాత్రి సమయంలో త్వరగా పడుకుని ఉదయాన్నే త్వరగా లేవడం కనీసం 6 నుండి 8 గంటల నిద్రపోవడం అనేది తప్పనిసరి. కాబట్టి లేటుగా నిద్రపోయే అలవాటు ఉన్నవారు ఈ అలవాటు మార్చుకుంటే మంచిది.
Worst Habits : స్పైసీ ఫుడ్…
మీరు కారంగా మరియు వేయించిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటున్నారా. అయితే తినడానికి అవి రుచిగా ఉన్నప్పటికీ ఆరోగ్యంపై అనేక రకాలుగా ప్రభావితం చూపిస్తాయి. ప్రతిరోజు ఇలాంటి ఆహారాలు తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ గుండె సంబంధిత వ్యాధులతో సహా అనేక రకాల వ్యాధులకు గురవుతారు. అంతేకాక ప్రస్తుత కాలంలో బయట ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు. కావున వాటికి వీలైనంత దూరంగా ఉండటం మంచిది…
Worst Habits : మద్యపానం ధూమపానం…
ఈరోజుల్లో సిగరెట్, బీడీ ,గంజాయి ,మద్యం తీసుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. అయితే వీటిని ఎక్కువగా తీసుకునే వారిలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని కొన్ని నివేదికలలో వెళ్లడైంది. కావున మాదక ద్రవ్యాలను వెంటనే మానేయడం మంచిది.
ఒకే చోట కూర్చోవడం…
గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం కూడా ఏమాత్రం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ప్రస్తుత కాలంలో చాలామంది వారి ఉద్యోగరీత్యా గంటల తరబడి కూర్చొని పనిచేస్తున్నారు. అలా మీరు కూడా ఒకే దగ్గర కూర్చుని పని చేస్తున్నట్లయితే మధ్య మధ్యలో లేచి అటు ఇటు నడవడం మంచిది. కదలకుండా ఒకే చోట గంటలు తరబడి కూర్చున్నట్లయితే శరీరంపై చెడు ప్రభావం పడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి జాగ్రత్త వహించండి.
గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. ది తెలుగు న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.