Yoga Benefits : ప్రస్తుత కాలంలో నడుము మరియు వెన్ను, మెడ నొప్పి అనేది పెద్ద సమస్యగా మారాయి. అయితే వెన్ను నొప్పి లేక నడుము నొప్పి ఉన్నట్లయితే ప్రతిరోజు కొన్ని నిమిషాల పాటు గోముఖాసనం వేయటం మొదలు పెట్టండి. ఈ ఆసనం ఒత్తిడిని కూడా తగ్గించగలదు. అలాగే శ్వాసను మెరుగుపరుస్తుంది. అంతేకాక ఈ యోగ ఆసనం వెనుక కండరాలు మరియు వెన్నుముకను కూడా సాగదీస్తుంది. అలాగే హై బీపీని తగ్గించడంలో కూడా ఈ ఆసనం ఎంతో బాగా సహాయం చేస్తుంది. అలాగే వెన్ను మరియు మెడ నొప్పి నుండి ఉపశమనం కోసం ప్రతి రోజు భుజంగాసనం మంచి మెడిసిన్ అని చెప్పొచ్చు. ఈ యోగాసనం అనేది అంతా కష్టమైనది కాదు. ఇది వెన్ను మరియు భుజాల నొప్పి నుండి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది. అంతేకాక ఇది అలసటను కూడా తగ్గిస్తుంది. అలాగే ఊపిరితిత్తులు మరియు గుండె కండరాలను కూడా బలంగా చేస్తుంది…
ప్రతిరోజు వత్యాసనం వేయడం వలన వెన్ను పై భాగంలోని కండరాలకు కూడా ఉపశమనం కలుగుతుంది. ఇది నొప్పి నుండి వెంటనే ఉపసమనాన్ని ఇస్తుంది. అంతేకాక ఆసనాల వలన భుజాలు మరియు మోకాళ్లు, నడుము, కండరాల ఒత్తిడి ని తగ్గించటంలో కూడా బాగా ఉపయోగపడతాయి. అంతేకాక నడుము మరియు మెడ, భుజాలలో నొప్పి ఉన్నట్లయితే ప్రతిరోజు కొన్ని సెకండ్ల పాటు బాలాసనం సాధన చేస్తే చాలా మంచిది. ఈ ఆసనం వేయడం వలన చీల మండల మరియు తుంటి, తొడల కండరాలను కూడా బలంగా చేస్తుంది. ఈ ఆసనం వేయటం వలన ఒత్తిడి నుండి కూడా ఉపశమనం కలుగుతుంది. అలాగే జుట్టు మరియు చర్మానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది…
నడుము మరియు వెన్ను నొప్పి నుండి ఉపశమనం పొందటానికి మర్జరీ ఆసనం అనగా పిల్లి బంగిమ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది నడుము నొప్పి నుండి కూడా వెంటనే ఉపసమనాన్ని కలిగిస్తుంది. అలాగే సయాటికా సమస్య ఉన్నవారికి కూడా ఈ ఆసనం ఎంతో బాగా పనిచేస్తుంది అని అంటున్నారు నిపుణులు.
Dandruff : చలికాలం రానే వచ్చింది. అయితే ఇతర సీజన్ కంటే చలికాలం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అలాగే చలికాలంలో కేవలం…
PMAY : ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) 2.o ద్వారా ప్రభుత్వం అదనంగా 3 కోట్ల గృహాలను నిర్మించాలని…
Honda Activa CNG : హోండా లో సక్సెస్ ఫుల్ స్కూటర్ అయిన యాక్టివా నుంచి కొన్నాళ్లుగా సి.ఎన్.జి వేరియంట్…
Ajwain Leaves : మన చుట్టూ ఉన్నటువంటి మొక్కలు మరియు ఆకులు, పూలు, కాయలు, వేర్లు అనేవి మన శరీరానికి రోగనిరోధక…
Rythu Bharosa : రైతు భరోసా పథకం కింద తెలంగాణా రాష్ట్రం రైతులకు విడతల వారీగా డబ్బుని వారి ఖాతాల్లో…
Empty Stomach : ప్రతి ఒక్కరి వంట గదిలో ఉండే మసాలా దినుసులలో లవంగం కూడా ఒకటి. అలాగే ఈ…
Sunset : సూర్యాస్తమయం తర్వాత చీకటి పడుతుంది ఇది ప్రతికూలతకు చిహ్నంగా భావిస్తారు. ఈ సమయంలో ప్రతికూల శక్తులు చీకటిలో…
Mangal Dosha : జ్యోతిష్య శాస్త్రంలో కుజ గ్రహానికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఈ క్రమంలోనే అక్టోబర్ 21వ తేదీ నుండి…
This website uses cookies.