Silent : తమ జీవితంలో ప్రతి ఒక్కరూ విజయం సాధించాలని కచ్చితంగా కోరుకుంటారు. దానికి అనుకూలంగా ఎంతో కృషి చేస్తూ ఉంటారు. అయితే మన విజయానికి మన కష్టం ఎంత అవసరమో మన ఆలోచనలు మరియు మనం జీవించే విధానం కూడా అంతే అవసరం అని మానసిక నిపుణులు అంటున్నారు. అయితే మనిషికి మాత్రమే ఉన్న శక్తి మాట్లాడడం. అయితే ఎంతో విలువైన ఈ మాటలను చాలా పొదుపుగా వాడాలి అని మానసిక నిపుణులు అంటున్నారు. అయితే కొన్ని సందర్భాలలో మౌనంగా ఉండాలి అని అంటున్నారు. అయితే ఏ సందర్భాలలో మౌనంగా ఉండాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
– ఎవరైనా ఒకళ్ళు మీ దగ్గర తన గొప్పతనం గురించి చెబుతూ ఉంటే, అప్పుడు మీరు మౌనంగా వినండి. అయితే సాధారణంగా కొంతమంది వారి గొప్పతనంలో ఏదో ఒక లోపాన్ని గుర్తించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దీంతో ఎదుటి భావాలను మీరు ఖండించినట్లుగా భావించే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ కారణం చేత గొడవలు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే ఇలాంటి సందర్భాలలో సైలెంట్ గా ఉండటమే మంచిది…
– ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరుగుతూ ఉన్నట్లయితే, మీరు మూడో వ్యక్తిగా ఉంటే నా విషయంలో మీరు జోక్యం చేసుకోకుండా ఉంటేనే చాలా మంచిది. ముఖ్యంగా చెప్పాలంటే మీకు ఆ విషయంపై ఇలాంటి అవగాహన లేకుంటే మీరు సైలెంట్ గా ఉండటమే మంచిది…
– మిమ్మల్ని ఎదుటి వ్యక్తి ఎప్పటికీ అర్థం చేసుకోకపోతే అప్పుడు కూడా మీరు మౌనంగా ఉండటమే మంచిది. ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా మీ మాట వినకపోతే నిశ్శబ్దంగా అక్కడ నుండి వెళ్లిపోండి…
– ఇక మీ మీద ఎవరైనా కోపంతో ఊగిపోతూ ఉంటే అప్పుడు కూడా మీరు మౌనం గా ఉండటమే మంచిది. అప్పుడు మీరు వారి యొక్క కోపాన్ని మౌనంగా ఎదిరించండి. అయితే కోపంగా ఉన్న వ్యక్తితో మీరు ఎట్టి పరిస్థితుల్లో గొడవకు దిగకండి. ఇలా చేస్తే ఆ గొడవ మరింత ఎక్కువ అవడానికి కారణం అవుతుంది.
ఒక విషయం గురించి మీకు పూర్తిగా అవగాహన లేకపోతే దాని గురించి ఎక్కువగా మాట్లాడకుండా ఉండటమే మంచిది. ఇలా గనక మీరు మాట్లాడితే మీ అజ్ఞానాన్ని మీరు ప్రదర్శించినట్లు అవుతుంది…
– మీ దగ్గర ఎవరైనా వేరే వారి గురించి చెడుగా మాట్లాడితే అప్పుడు కూడా మీరు మౌనంగా ఉంటేనే మంచిది. ఎందుకంటే వారు మీ దగ్గర ఒకరి గురించి చెడుగా మాట్లాడుతున్నారు,రేపు మీ గురించి కూడా చెడుగా మాట్లాడుతారు. కాబట్టి ఆ టైమ్ లో మీరు మౌనంగా ఉండడమే మంచిది…
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
This website uses cookies.