Silent : ఏ సందర్భంలో సైలెంట్ గా ఉండాలో తెలుసా…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Silent : ఏ సందర్భంలో సైలెంట్ గా ఉండాలో తెలుసా…!

Silent : తమ జీవితంలో ప్రతి ఒక్కరూ విజయం సాధించాలని కచ్చితంగా కోరుకుంటారు. దానికి అనుకూలంగా ఎంతో కృషి చేస్తూ ఉంటారు. అయితే మన విజయానికి మన కష్టం ఎంత అవసరమో మన ఆలోచనలు మరియు మనం జీవించే విధానం కూడా అంతే అవసరం అని మానసిక నిపుణులు అంటున్నారు. అయితే మనిషికి మాత్రమే ఉన్న శక్తి మాట్లాడడం. అయితే ఎంతో విలువైన ఈ మాటలను చాలా పొదుపుగా వాడాలి అని మానసిక నిపుణులు అంటున్నారు. అయితే కొన్ని […]

 Authored By ramu | The Telugu News | Updated on :30 September 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Silent : ఏ సందర్భంలో సైలెంట్ గా ఉండాలో తెలుసా...!

Silent : తమ జీవితంలో ప్రతి ఒక్కరూ విజయం సాధించాలని కచ్చితంగా కోరుకుంటారు. దానికి అనుకూలంగా ఎంతో కృషి చేస్తూ ఉంటారు. అయితే మన విజయానికి మన కష్టం ఎంత అవసరమో మన ఆలోచనలు మరియు మనం జీవించే విధానం కూడా అంతే అవసరం అని మానసిక నిపుణులు అంటున్నారు. అయితే మనిషికి మాత్రమే ఉన్న శక్తి మాట్లాడడం. అయితే ఎంతో విలువైన ఈ మాటలను చాలా పొదుపుగా వాడాలి అని మానసిక నిపుణులు అంటున్నారు. అయితే కొన్ని సందర్భాలలో మౌనంగా ఉండాలి అని అంటున్నారు. అయితే ఏ సందర్భాలలో మౌనంగా ఉండాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

– ఎవరైనా ఒకళ్ళు మీ దగ్గర తన గొప్పతనం గురించి చెబుతూ ఉంటే, అప్పుడు మీరు మౌనంగా వినండి. అయితే సాధారణంగా కొంతమంది వారి గొప్పతనంలో ఏదో ఒక లోపాన్ని గుర్తించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దీంతో ఎదుటి భావాలను మీరు ఖండించినట్లుగా భావించే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ కారణం చేత గొడవలు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే ఇలాంటి సందర్భాలలో సైలెంట్ గా ఉండటమే మంచిది…

– ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరుగుతూ ఉన్నట్లయితే, మీరు మూడో వ్యక్తిగా ఉంటే నా విషయంలో మీరు జోక్యం చేసుకోకుండా ఉంటేనే చాలా మంచిది. ముఖ్యంగా చెప్పాలంటే మీకు ఆ విషయంపై ఇలాంటి అవగాహన లేకుంటే మీరు సైలెంట్ గా ఉండటమే మంచిది…

– మిమ్మల్ని ఎదుటి వ్యక్తి ఎప్పటికీ అర్థం చేసుకోకపోతే అప్పుడు కూడా మీరు మౌనంగా ఉండటమే మంచిది. ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా మీ మాట వినకపోతే నిశ్శబ్దంగా అక్కడ నుండి వెళ్లిపోండి…

– ఇక మీ మీద ఎవరైనా కోపంతో ఊగిపోతూ ఉంటే అప్పుడు కూడా మీరు మౌనం గా ఉండటమే మంచిది. అప్పుడు మీరు వారి యొక్క కోపాన్ని మౌనంగా ఎదిరించండి. అయితే కోపంగా ఉన్న వ్యక్తితో మీరు ఎట్టి పరిస్థితుల్లో గొడవకు దిగకండి. ఇలా చేస్తే ఆ గొడవ మరింత ఎక్కువ అవడానికి కారణం అవుతుంది.

Silent ఏ సందర్భంలో సైలెంట్ గా ఉండాలో తెలుసా

Silent : ఏ సందర్భంలో సైలెంట్ గా ఉండాలో తెలుసా…!

ఒక విషయం గురించి మీకు పూర్తిగా అవగాహన లేకపోతే దాని గురించి ఎక్కువగా మాట్లాడకుండా ఉండటమే మంచిది. ఇలా గనక మీరు మాట్లాడితే మీ అజ్ఞానాన్ని మీరు ప్రదర్శించినట్లు అవుతుంది…

– మీ దగ్గర ఎవరైనా వేరే వారి గురించి చెడుగా మాట్లాడితే అప్పుడు కూడా మీరు మౌనంగా ఉంటేనే మంచిది. ఎందుకంటే వారు మీ దగ్గర ఒకరి గురించి చెడుగా మాట్లాడుతున్నారు,రేపు మీ గురించి కూడా చెడుగా మాట్లాడుతారు. కాబట్టి ఆ టైమ్ లో మీరు మౌనంగా ఉండడమే మంచిది…

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది