Aquarius Horoscope : ఎవరు అవునన్నా.. కాదన్నా.. ఏప్రిల్ నెలలో కుంభ రాశి వారికి ఒక అద్భుతం జరగబోతోంది…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Aquarius Horoscope : ఎవరు అవునన్నా.. కాదన్నా.. ఏప్రిల్ నెలలో కుంభ రాశి వారికి ఒక అద్భుతం జరగబోతోంది…!

 Authored By tech | The Telugu News | Updated on :16 March 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Aquarius Horoscope : ఎవరు అవునన్నా.. కాదన్నా.. ఏప్రిల్ నెలలో కుంభ రాశి వారికి ఒక అద్భుతం జరగబోతోంది...!

Aquarius Horoscope : కుంభ రాశి వారు రాశి చక్రంలో 11వ రాశి రాశి వారి యొక్క అధిపతి శని ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు.. శతభిషా నక్షత్రం నాలుగు పాదాలు.. పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు ఈ కుంభరాశి కిందకు వస్తూ ఉంటారు. ఏప్రిల్ నెలలో వృత్తిపరంగా వీరికి సానుకూలమైన ఫలితాలు ఉన్నాయి. వృత్తి పరంగా వీరు ఎన్నో విజయాలను సాధించుకుంటారు. వృత్తిలో ఇప్పటివరకు వీరు ఎదుర్కొంటున్నటువంటి వత్తిళ్లు కూడా చాలా ఘనంగా అధిగమించగలుగుతారు. ఇతరులను ఒత్తిడి మేరకు మీకు ఇష్టం లేకపోయినా కొన్ని పనులు అయితే చేయాల్సి వస్తుంది. దాని కారణంగా మీరు మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అయితే ఈ సమయంలో కుజని గోచారం అనుకూలంగా ఉండదు.. కాబట్టి నీలో కోపం ఆవేశం ఎక్కువ ఉంది. అయితే దీనిని మీరు గనుక కంట్రోల్ లో పెట్టుకోగలిగితే కచ్చితంగా మీరు అనుకున్నది సాధించవచ్చు.. ఈ సమయంలో వీలైనంతవరకు మీ పై అధికారులతో కానీ మీ సహోదయోగులతో కానీ అనవసరమైన వివాదాలు పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది.

ముఖ్యంగా ఈనెల మొదట్లో ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సిన రావడం గానీ లేదంటే మీకు నచ్చని చోట పని చేయాల్సిన రావడం కానీ జరగొచ్చు. ఈనెల మధ్యలో నుంచి మీకైతే కచ్చితంగా మీ పరిస్థితుల్లో మార్పు వస్తుంది. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో మీరు చేపట్టిన పనుల్లో కచ్చితంగా విజయం సాధిస్తారు. అంతేకాకుండా మీ పొజిషన్ అభివృద్ధి కలగడం పేరు ప్రఖ్యాతలు పెరగడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి.. ఇక ఏప్రిల్ నెల ద్వితీయ అర్థంలో చూసుకున్నట్లైతే వ్యాపారంలో మీకు విపరీతమైనటువంటి అభివృద్ధి వస్తుంది. గతంలో ఉన్న సమస్యలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. కాబట్టి మీరు మీ వ్యాపారంపై విపరీతంగా దృష్టి పెట్టగలుగుతారు. అంతేకాకుండా వ్యాపార విస్తరణ పెట్టుబడిన కూడా చాలా మంచి సమయంగా కనిపిస్తుంది. కాబట్టి మీరు చేపట్టే ప్రతి పని కూడా విజయవంతమవుతుంది. మీ యొక్క సలహాలు సూచనల తోటి వాళ్ళు వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్న కూడా ఈ సమయం మీకు బాగా కలిసివస్తుంది.. కాబట్టి మీ పేరు మీద గనక మీ ఇంట్లో వాళ్ళు ఏదైనా వ్యాపారం పెట్టినా కూడా అది కచ్చితంగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మీరు ఏ పనిలో అయితే ముందుకు వెళ్లాలి అనుకుంటారో.. ఆ పని మీకు ఎక్కువగా ఆనందాన్ని విజయాన్ని తెచ్చిపెడుతుంది. ఎందుకంటే ఈ సమయంలో మీ యొక్క అదృష్టం అనేది విపరీతంగా ఉంటుంది. ఇంకా విద్యార్థులకు చూసుకున్నట్లయితే ఏప్రిల్ నెల మిశ్రమంగా ఉండబోతుంది.

అంటే ఈ నెలలో ప్రధమార్ధంలో సూర్యుడు, కుజుడు మరియు బుధుని గోచారము అనేది విద్యార్థులకు కొంచెం అనుకూలంగా ఉండదు. కాబట్టి మీరు చదువులో విషయంలో ఇంకా అదనపు శ్రద్ధ తీసుకోవాలి అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అంశం. కొన్ని విషయంలో ఇంకా ఆవేశం పెరిగిపోవడం వల్ల కొన్ని అనవసరమైన వివాదాలపై విషయాలపై వాదాలు ప్రతి వాదాలు వివాదాలు ఎక్కువైతాయి. ఈ విధంగా ఎక్కువ సమయాన్ని వ్యక్తం చేసుకునేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా పరీక్షల విషయంలో కూడా వారు నిర్లక్ష్య ధోరణి కలిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అయితే ద్వితీయ అర్థంలో అంటే 15వ తేదీ తర్వాత నుంచి కూడా గ్రహస్తిని మారుతుంది. ఏది మన సూర్యుడు ఇంకా కుజుడు వీళ్ళ యొక్క గ్రహస్థితిలో మారడం వల్ల విద్యార్థుల్లో చదువుపై ఉండేటటువంటి నిర్లక్ష్య ధోరణి తగ్గిపోతుంది. ఈ నెలలో పరీక్షలు రాసినప్పుడు జాగ్రత్తగా ఉండండి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించడానికి మొదటి పరిహారాలు చేయండి. కచ్చితంగా మీరు శుభవార్తలు వింటారు…

Advertisement
WhatsApp Group Join Now

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది