Cancer : రానున్న 03 నెలల్లో కర్కాటక రాశి వారికి అదృష్టం.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Cancer : రానున్న 03 నెలల్లో కర్కాటక రాశి వారికి అదృష్టం..

 Authored By aruna | The Telugu News | Updated on :2 September 2023,7:00 am

Cancer : జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కర్కాటక రాశి వారికి అదృష్టం పట్టబోతోంది. ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే చాలు.. ఇక డిసెంబర్ వరకు మీరు ఊహించని ధన ఐశ్వర్య, ఆరోగ్య అదృష్ట ఫలితాలను చూస్తారు. కర్కాటక రాశికి చెందినవారు జల సంబంధిత విషయాలు ఇబ్బందులకు గురిచేసిన అవే జీవితం లో పురోగతిని కలిగిస్తాయి. అన్ని విషయాలకు పోరాటం ఉంటుంది. ప్రతి చిన్నపనికి ఒకటికి నాలుగు సార్లు కష్టపడాల్సి వస్తుంది. సెప్టెంబర్ 2023 కర్కాటక రాశి ఫలాలు కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. పలుకుబడి మరింతగా పెరుగుతుంది.

శత్రువులకు కూడా సహాయం అందించే మంచితనాన్ని చాటుకుంటారు. ఆస్తి వ్యవహారాలలో చికాకుల కలుగుతాయి. వాహనాలు గృహము కొనుగోలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.ఎవరిని గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. తలపెట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. ఇతరుల విషయాలకన్నా సొంత విషయాలు మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వివాదాలకు అవకాశం ఉంది. ఆప్తులు మీ అభివృద్ధిలో కీలకంగా కాగలరు. ఇంట, బయట ఎదురులేని పరిస్థితి ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహన యోగం వ్యాపారాలుగా ఉంటాయి. కళా రంగం వారికి నూతన అవకాశాలుఉంటాయి. మరిన్ని మంచి ఫలితాల కోసం కర్కాటక రాశి వారు పాటించవలసిన పరిహారాలు మెరుగైన వ్యాపార అవకాశాల కోసం విద్యాసంస్థలు లేదా దేవాలయాల్లో చెట్లు నాటి వాటిని సంరక్షించండి.

good luck to cancer in the next three months

Cancer : రానున్న 03 నెలల్లో కర్కాటక రాశి వారికి అదృష్టం..

ప్రతిరోజు ఉద్యోగా వ్యాపారాలు అభివృద్ధి కోసం ఓం అనే ప్రణవ మంత్రాన్ని ఐదు నిమిషాలు జపిస్తూ ధ్యానం చేయండి. బ్రాహ్మణులకు పెద్దలకు ఆలయ పూజారులకు సేవ చేయండి. వస్తువులను దానం చేయండి. విష్ణు సహస్రనామం ఇతర విష్ణు స్తోత్రాలను పటించండి. ఇంట్లో వాళ్ళు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కుంకుమ కలిపిన నీళ్లను వారికి దిష్టి తీసి ప్రవహించే నీళ్లలో కలపాలి. ఇలా చేయడం వల్ల వారిపై ఉన్న నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది