Zodiac Signs : మకర రాశి వారికి, ఆగస్టు నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే…
Zodiac Signs : ఆగస్టు నెల, 2022, మకర రాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మాసంలో మేషరాశిలో రాహువు, కుజుడు కలిసి ఉన్నారు. ఇలా 11 వ తారీఖు వరకు కలిసి ఉండి కుజుడు 11 వ తారీకు తర్వాత వృషభంలోకి వస్తున్నాడు. అలాగే మిథునంలో ఉన్న శుక్రుడు ఏడవ తేదీ నుంచి కర్కాటకంలోకి, అదేవిధంగా కర్కాటకంలో ఉన్న రవి 16వ తేదీ నుంచి సింహ రాశి లోకి వస్తున్నారు. సింహరాశిలో బుధ, చంద్రులు కలిసి ఉన్నారు. ఈ యొక్క బుధుడు 21వ తారీఖు వరకు సింహ రాశిలో ఉండి, ఆ తరువాత కన్యారాశి లోకి వెళతాడు. వృశ్చికంలో కేతువు, మకరంలో శని, మీనరాశిలో గురుడు ఉన్నారు. అయితే ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ మాసంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
మకర రాశి లో కేతువు యొక్క సంచాలకం జరుగుతుంది. ఈ రాశి వారికి కొన్ని విషయాల్లో స్పష్టత అనేది వస్తుంది. విదేశాలకు వెళ్లే అవకాశం 11వ తేదీ వరకు కనిపిస్తుంది. కొన్ని విషయాలలో బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. గవర్నమెంట్ సంబంధిత ఉద్యోగాలలో మంచి అనుకూలత ఉంది. ఈ రాశి వారు వాహనాలపై ప్రయాణం చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తలు వహించాలి. ఈ రాశి వారు తల్లి ఆరోగ్యం పట్ల కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయ నాయకులకు కొద్దిగా ఒత్తిడి తగులుతుంది. కాబట్టి కొన్ని విషయాలలో నిర్ణయాలను తీసుకునేటప్పుడు ఆచితూచి ఆలోచించి తీసుకోవాలి.
Horoscope August 2022 Check Your Zodiac Signs Capricorn
11 వ తారీకు తర్వాత ప్రేమ వ్యవహారాలలో, రాజకీయ విషయాలలో కొన్ని ఒత్తిడిలు రానున్నాయి. రుణ ప్రయత్నాలు 21వ తేదీ తర్వాత ఫలిస్తాయి. సంతానానికి సంబంధించి దత్తత తీసుకోవాలి అనుకున్న వారికి మంచి అవకాశం కలగనుంది. వివాహ ప్రయత్నాలు ఈ 16వ తేదీ తర్వాత ఫలిస్తాయి. ఉద్యోగ సంబంధిత విషయాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మకర రాశి వారికి ఈనెల అనుకూలంగా ఉండాలంటే చేయవలసిన దేవతారాధన ఏంటంటే శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయాలి. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయాలి. ఇలా చేస్తే అన్ని విధాలుగా బాగుంటుంది. మకర రాశి గురించి స్పష్టంగా తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి.
