Zodiac Signs : తులా రాశి వారికి ఆగష్టు నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 28 July 2022, 4:00 pm

Zodiac Signs : ఆగస్టు నెల, 2022, తులా రాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మాసంలో మేషరాశిలో కుజుడు, రాహువు కలిసి ఉన్నారు. ఇలా పదకొండవ తారీఖు వరకు కలిసి ఉండి కుజుడు 11 వ తారీఖు తర్వాత వృషభంలోకి వస్తున్నాడు. అలాగే మిథునంలో ఉన్న శుక్రుడు ఏడవ తేదీ నుంచి కర్కాటకంలోకి, అదేవిధంగా కర్కాటకంలో ఉన్న రవి 16వ తేదీ నుంచి సింహ రాశిలోకి వస్తున్నారు. సింహరాశిలో బుధ, చంద్రులు కలిసి ఉన్నారు. ఈ యొక్క బుధుడు 21 వ తారీకు వరకు సింహరాశిలో ఉండి ఆ తర్వాత కన్యా రాశిలోకి వెళతాడు. వృశ్చికంలో కేతువు, మకరంలో శని, మీనరాశిలో గురుడు ఉన్నారు. అయితే ఈ గ్రహ స్థితిని అనుసరించి ఈ మాసంలో తులా రాశి వారికి ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

తులారాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి చిన్నపాటి వైరాగ్యాన్ని, గొప్ప జ్ఞానాన్ని, ఉద్యోగంలో స్కిల్స్ ని పెంచుకోవడానికి ఇది తోడ్పడుతుంది. అలాగే కుటుంబ సభ్యులతో, భాగస్వామితో విదేశాలకు వెళ్లే విషయాలలో కొంత ఒత్తిడిని కలుగుతుంది. అయితే ఇవి 11వ తేదీ నుండి తగ్గే అవకాశం ఉంది. గతంలో జరిగినటువంటి కొన్ని పొరపాట్లు ఇప్పుడు క్లియర్ అయ్యే అవకాశం ఉంది. అలాగే విద్య, గృహము, పంట, తల్లి ఆరోగ్యం విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇలా జరగకుండా ఉండాలంటే నవగ్రహాలలో శని భగవానుడికి కేతు గ్రహం దగ్గర దీపారాధన చేయాలి. అలాగే ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి యొక్క స్తోత్రాలను పఠించాలి. ఇలా చేయడం వలన ఈ గ్రహాల అనుగ్రహం కలుగుతుంది.

horoscope august 2022 check your zodiac signs Libra

horoscope august 2022 check your zodiac signs Libra

అలాగే తులా రాశి వారు కొన్ని విషయాలలో తీసుకునే నిర్ణయాలలో జాగ్రత్త వహించాలి. అలాగే రుణాలు ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు వహించాలి. ధనయోగం కలుగుతుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి మంచి అనుకూలత కనిపిస్తుంది. విదేశీ సంబంధాలు కుదిరి అవకాశం ఉంది. తులా రాశి వారికి ఆగస్టు నెల అనుకూలంగా ఉండాలంటే చేయవలసిన దేవతరాదన ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించాలి. శని, కేతువు, రాహువు గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి. ఇలా చేస్తే అన్ని విధాలుగా బాగుంటుంది. తులా రాశి గురించి మీరు మరింత స్పష్టంగా తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Ravi Teja : అచ్చం రవితేజనే అనుకుంటారు.. ఈ వ్యక్తి వీడియో చూసి షాక్ అవుతున్న నెటిజన్లు!"

  2. "Bengaluru Triple Murder AI ని ఈ రేంజ్‌లో వాడుతున్నారా.. మర్డర్ నుంచి శ‌వం మాయం చేసేవ‌ర‌కు దర్యాప్తులో షాకింగ్ విషయాలు..!"

  3. "Gabbar Singh Actor Ramesh Brain Stroke : పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్’ నటుడు రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్.. ప‌రిస్థితి విష‌మం"

  4. "Uppal Beerappagadda : ఉప్పల్‌ బీరప్పగడ్డలో SIR ప్రచార రథానికి శ్రీకారం.. ఓటరు జాబితా సవరణపై పరమేశ్వర్ రెడ్డి కీలక పిలుపు"

  5. "Telangana Farmers : తెలంగాణ రైతులకు కేంద్రం బంపర్ గుడ్ న్యూస్ చెప్పిన మోదీ..!"

  6. "Uppal Congress : ఉప్పల్‌లో కాంగ్రెస్ భారీ నిరసన.. రాహుల్ గాంధీ అరెస్టుపై ఆగ్రహం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్"

  7. "NEET Protest Delhi : నీట్ ఆందోళనలో కొత్త ట్విస్ట్.. విద్యార్థుల సమస్యా? రాజకీయ పోరాటమా..? సీజేపీ నాయకులు ఎక్కడ?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి