Zodiac Signs : కన్యా రాశి వారికి ఆగష్టు నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Zodiac Signs : కన్యా రాశి వారికి ఆగష్టు నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Zodiac Signs : ఆగస్టు నెల, 2022, కన్యా రాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మాసంలో మేషరాశిలో రాహువు, కుజుడు కలిసి ఉన్నారు. ఇలా 11వ తారీకు వరకు కలిసి ఉండి కుజుడు 11వ తారీఖు తర్వాత వృషభంలోకి వస్తున్నాడు. అలాగే మిథునంలో ఉన్న శుక్రుడు ఏడవ తేదీ నుంచి కర్కాటకంలోకి, అదేవిధంగా కర్కాటకంలో ఉన్న రవి 16వ తేదీ నుంచి సింహరాశిలోకి వస్తున్నారు. సింహరాశిలో బుధ, చంద్రులు […]

 Authored By prabhas | The Telugu News | Updated on :27 July 2022,4:00 pm

Zodiac Signs : ఆగస్టు నెల, 2022, కన్యా రాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మాసంలో మేషరాశిలో రాహువు, కుజుడు కలిసి ఉన్నారు. ఇలా 11వ తారీకు వరకు కలిసి ఉండి కుజుడు 11వ తారీఖు తర్వాత వృషభంలోకి వస్తున్నాడు. అలాగే మిథునంలో ఉన్న శుక్రుడు ఏడవ తేదీ నుంచి కర్కాటకంలోకి, అదేవిధంగా కర్కాటకంలో ఉన్న రవి 16వ తేదీ నుంచి సింహరాశిలోకి వస్తున్నారు. సింహరాశిలో బుధ, చంద్రులు కలిసి ఉన్నారు ఈ యొక్క బుధుడు 21వ తారీకు వరకు సింహరాశిలో ఉండి, ఆ తర్వాత కన్యారాశి లోకి వెళతాడు. వృశ్చికంలో కేతువు, మకరంలో శని, మీనరాశిలో గురుడు ఉన్నారు. అయితే ఈ గ్రహ స్థితిని అనుసరించి ఈ మాసంలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ కన్యారాశి వారు వేరే దేశాలకు వెళ్లే అవకాశం ఉంది.

గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలలో సేవలు అందుకుంటారు. 21వ తేదీ నుంచి ఎప్పుడైతే ఈ రాశిలో బుధుడు యొక్క బలం పెరుగుతుందో దాని వలన వ్యాపారం, ఉద్యోగం, వైద్య సంబంధించిన రంగాలలో అన్ని మంచి ఫలితాలు వస్తాయి. గతంలో ఉద్యోగానికి సంబంధించిన ధనం ఏదైతే ఆగిపోయిందో ఇప్పుడు అది వస్తుంది. అలాగే ఈ రాశి వారు వాహనాలు నడిపేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆస్తులకు సంబంధించిన విషయాలలో కొన్ని మార్పులు జరుగుతాయి. సంతానానికి సంబంధించిన విషయాల్లో కొద్దిగా ఒత్తిడి తగులుతుంది. ఇలాంటి ఇబ్బందుల నుంచి బయట పడాలంటే కేతువు గ్రహానికి దీపారాధన చేయాలి. కేతువు గ్రహం దగ్గర ఒక దీపం పెట్టి కొన్ని పుష్పాలు, కొంచెం కుంకుమ వేసి ప్రదక్షిణలు చేయాలి.

horoscope august 2022 check your zodiac signs Virgo

horoscope august 2022 check your zodiac signs Virgo

అలాగే ఈ రాశి వారికి గృహ సంబంధిత రుణాలు లభిస్తాయి. అలాగే 11వ తేదీ వరకు అగ్నికి సంబంధించిన విషయాలలో జాగ్రత్తగా వహించాలి. బ్యాంకు ట్రాన్సాక్షన్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారి సహోదరులు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. రాశి వారికి దైవానుగ్రహం ఉంటుంది. అన్ని పనులలో విజయాలను అందుకుంటారు. అయితే కన్య రాశి వారికి ఈ నెల అనుకూలంగా ఉండాలంటే చేయవలసిన దేవతారాధన ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించాలి. శని భగవానుడి దగ్గర దీపారాధన చేయాలి. ఇలా చేస్తే అన్ని విధాలుగా బాగుంటుంది. కన్య రాశి గురించి మరింత స్పష్టంగా తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది