Home » Devotional » Horoscope July 2022 Check Your Zodiac Signs Leo
Devotional

Zodiac Signs : సింహ రాశి వారికి జూలై నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Authored By
Anusha V
The Telugu News | Published on: July 8, 2022, 4:00 pm
Advertisement

Zodiac Signs : జూలై మాసం, 2022, సింహ రాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మాసంలో మేషరాశిలో రాహువు, కుజుడు కలిసి ఉన్నారు. అలాగే వృషభ రాశిలో బుధుడు, శుక్రులు కలిసి ఉన్నారు. ఆ బుధుడు రెండవ తారీకు నుంచి వృషభం నుంచి మిథునంలోకి చేరుకుంటాడు. మిథునంలో 17వ తేదీ వరకు ఉండి ఆ తరువాత రోజు నుండి బుధుడు, రవి కలిసి కర్కాటకంలోకి వస్తున్నారు. ఇక తులా రాశిలో కేతువు మకర రాశిలో ఉండాల్సిన శని కుంభంలో నుండి మకరంలోకి వస్తున్నాడు. అదేవిధంగా మీనరాశిలో గురువు యొక్క సంచారం జరుగుతుంది. అయితే సింహ రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది, అలాగే సింహరాశిలోని నక్షత్రాల వారికి ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

సింహ రాశి వారు ఈ నెలలో ఎప్పటినుంచో ప్రయత్నం చేస్తున్న రుణ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. భూములను కొనేటప్పుడు కాస్త జాగ్రత్త వహించాలి. అలాగే విద్యార్థులు చదువు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులతో కొన్ని మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి. దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. సింహరాశిలోని మూడు నక్షత్రాల గురించి తెలుసుకుందాం. ముందుగా మఖ నక్షత్రం వారు కాస్త దగ్గర ప్రయాణాలు చేస్తారు. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, కొన్నింటికి సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే పుబ్బ నక్షత్రం వారికి ఉద్యోగ అవకాశాలు ఒకటవ తేదీ నుండి 12వ తేదీ వరకు అధికంగా ఉంటాయి. వ్యాపారాలు చేసేవారికి 12వ తేదీ తర్వాత నుంచి అనుకూలంగా ఉంటాయి. ఉత్తర నక్షత్రం వారు వ్యాపారాలలో మంచి విజయాన్ని సాధిస్తారు. విదేశాలకు వెళ్లాలి అనుకునే వారు ఈ నెలలో వెళతారు.

horoscope July 2022 check your zodiac signs leo

Advertisement

అలాగే సింహ రాశి వారికి ఆర్థికపరంగా చక్కగా ఉంటుంది. భూములను కొనేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు కాస్త జాగ్రత్త వహించాలి. రియల్ ఎస్టేట్స్ వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. శత్రువులతో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. వివాహ సంబంధాలు ఈ నెలలో కుదరకపోవచ్చు. వృత్తి వ్యాపారాల యందు మంచి పురోగతి ఉంది. తండ్రి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే సింహ రాశి వారికి ఈ నెల యందు అనుకూలంగా ఉండాలంటే చేయవలసిన దేవతారాధన ఏంటంటే దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం చేయాలి. శని, కుజ, రాహువుల విగ్రహాల దగ్గర దీపారాధన చేయాలి. గోవులకు అరటికాయలు, క్యారెట్ లను తినిపించాలి. ఇలా చేయడం వలన సింహ రాశి వారికి ఈ నెలలో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి.

Anusha V

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి