Zodiac Signs : తులా రాశి వారికి జూలై నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Advertisement

Zodiac Signs : జూలై మాసం 2022 తులా రాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మాసంలో మేషరాశిలో రాహు, కుజుడు కలిసి ఉన్నారు. అలాగే వృషభ రాశిలో బుధుడు, శుక్రులు కలిసి ఉన్నారు. తులా రాశిలో రాహువు, కేతువు కలిసి ఉన్నారు. బుధుడు రెండవ తేదీ నుంచి వృషభం నుంచి మిధునంలోకి చేరుకుంటాడు. మిథునంలో 17వ తేదీ వరకు నుండి ఆ తరువాత రోజు ఉండి బుధుడు, రవి కలిసి కర్కాటకంలోకి వస్తున్నారు. ఇక తులా రాశిలో కేతువు మకర రాశిలో ఉండాల్సిన శని కుంభంలో నుండి మకరంలోకి వస్తున్నాడు. అదేవిధంగా మీన రాశిలో గురువు యొక్క సంచారం జరుగుతుంది. అయితే తులా రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది,

అలాగే తులా రాశి లోని నక్షత్రాల వారికి ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. తులా రాశి వారికి జూలై నెలలో వారు కన్న కలలు నిజమవుతాయి. గృహ నిర్మాణం చేయాలనుకున్నవారు ఈ మాసంలో చేస్తారు. ఎవరికైనా ధనం ఇచ్చేటప్పుడు జాగ్రత్త వహించాలి. భూములను కొంటారు. కొన్ని ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకుంటారు. అలాగే తులా రాశిలో గల మూడు నక్షత్రాల గురించి తెలుసుకుందాం. ముందుగా చిత్తా నక్షత్రం వారికి విదేశీ వివాహ సంబంధాలు ఫలించే అవకాశం ఉంది. అలాగే వివాహ విషయంలో కొద్దిగా ఒత్తిడి తగులుతుంది. స్వాతి నక్షత్రం వారు తమ జీవిత భాగస్వామిని విదేశాలకు పంపించే ప్రయత్నం ఫలించే అవకాశం ఉంది. కొన్ని సామాజిక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. విశాఖ నక్షత్రం వారికి రుణ సంబంధిత విషయాలు జరిగే అవకాశం ఉంది.

Advertisement
horoscope July 2022 check your zodiac signs Libra
horoscope July 2022 check your zodiac signs Libra

ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. అలాగే తులా రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా నెరవేరుతాయి. ధనం విషయంలో రాబడి పెరుగుతుంది. రుణాలు ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లలను విదేశాలకు పంపించే ప్రయత్నం ఫలిస్తుంది. తాతల ఆస్తి లభించే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగాలలో ప్రమోషన్స్ కూడా వస్తాయి. వివాహ ప్రయత్నాలు 17 వ తారీకు తరువాత జరుగుతాయి.నల్లరేగడి భూములు ఉన్న రైతులు మంచి లాభాలను చూస్తారు. అయితే తులా రాశి వారు చేయవలసిన దేవతారాధన ఏంటంటే విష్ణు సహస్రనామాలు, వెంకటేశ్వర స్వామి నామాలు చేయండి. వీలైతే కాళికామాతను పూజించండి. గోవులకు బెల్లం, గ్రాసం తినిపించాలి. ఇలా చేస్తే అన్ని విధాలుగా బాగుంటుంది.

Advertisement
Advertisement