Zodiac Signs : జూలై మాసం, 2022, వృశ్చిక రాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మాసంలో మేషరాశిలో రాహువు, కుజుడు కలిసి ఉన్నారు. అలాగే వృషభ రాశిలో బుధుడు, శుక్రులు కలిసి ఉన్నారు. ఆ బుధుడు రెండవ తేదీ నుంచి వృషభం నుంచి మిధునంలోకి చేరుకుంటాడు. మిధునంలో 17వ తేదీ వరకు ఉండి ఆ తరువాత రోజు నుండి బుధుడు, రవి కలిసి కర్కాటకంలోకి వస్తున్నారు. ఇక తులా రాశిలో కేతువు, మకర రాశిలో ఉండాల్సిన శని కుంభంలో నుండి మకరంలోనికి వస్తున్నాడు. అదేవిధంగా మీన రాశిలో గురువు యొక్క సంచారం జరుగుతుంది. అయితే వృశ్చిక రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది, అలాగే వృశ్చిక రాశిలోని నక్షత్రాల వారికి ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
వృశ్చిక రాశి వారికి జూలై నెలలో వివిధ విషయాలలో కాంపిటేషన్ బాగా ఉంటుంది. అలాగే పట్టుదల కూడా ఎక్కువ ఉంటుంది. ఆస్తులను కానీ వస్తువులను కానీ అమ్మాలి అనుకునేవారు ఈ నెలలో ఆ పనులు ఆగిపోతాయి. అలాగే వృశ్చిక రాశిలో గల మూడు నక్షత్రాల గురించి తెలుసుకుందాం. ముందుగా వైశాఖ నక్షత్రం వారు జూలై నెలలో కొత్త నిర్ణయాలను తీసుకుంటారు. ధనం విషయంలో వృద్ధి పెరుగుతుంది. అనురాధ నక్షత్రం వారికి ధన సంబంధిత విషయాల్లో చాలా చక్కగా ఉంటుంది. అలాగే ఏమైనా ఆస్తులను అమ్మడం కానీ కొనడం కాని చేస్తారు. జ్యేష్ట నక్షత్రం వారు విద్యా విషయంలో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పూర్వీకుల ఆస్తులు లభించే అవకాశం ఉంది. ఆస్తి విషయాలలో గల చిక్కులు తొలగిపోతాయి. అలాగే వృశ్చిక రాశి వారికి జులై నెలలో ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
ముఖ్యంగా పోలీస్, సెక్యూరిటీకి సంబంధించిన అంశాలలో ఉద్యోగాలను పొందే అవకాశం ఉంది. ధన విషయాలలో ఎటువంటి సమస్యలు లేవు. అలాగే వివాహ విషయంలో మీరు ఇష్టపడిన వారిని చేసుకోవాలనే ప్రయత్నం ఫలించే అవకాశం ఉంది. 12వ తారీకు నుంచి 17వ తారీకు మధ్యలో ప్రయత్న చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈనెల 17వ తారీకు తర్వాత కొత్త ఉద్యోగాలు వస్తాయి. వ్యాపారంలో మంచి పురోగతి ఉంది. అలాగే వృశ్చిక రాశి వారు చేయవలసిన దేవతారాధన ఏమిటంటే గణేషుడిని పూజించాలి. అలాగే దక్షిణామూర్తిని ఆరాధించాలి. గోవులకు క్యారెట్లు, అరటికాయలు తినిపించాలి. శని, కుజ, రాహు విగ్రహాల దగ్గర దీపారాధన చేయాలి. ఇలా చేస్తే అన్ని విధాలుగా బాగుంటుంది. మీరు మరింత స్పష్టంగా తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియో లింకును క్లిక్ చేయండి.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.