SSC Notification 2022 Central organization Staff Selection Commission is good news for unemployed
SSC Notification 2022 : సెంట్రల్ సంస్థ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. భారీ ఉద్యోగ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఇందులో మొత్తం 1,411 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఆప్లయ్ చేసుకునే అవకాశం కల్పించింది. కానిస్టేబుల్ (డ్రైవర్) ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఢిల్లీ పోలీస్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ లో వివరించింది.
వివిధ కేటగిరీల్లో ఉన్న ఖాళీలను ప్రకటించింది. జనరల్ లో 604, ఈడబ్ల్యూఎస్ కింద 142 పోస్టులు, ఓబీసీలో 353, ఎస్సీ కేటగిరిలో 262, ఎస్టీ కేటగిరిలో 50 పోస్టులు ఖాళీలు ఉన్నట్లు తెలిపింది. అలాగే ఇందుకు సంబంధించిన అర్హతలు ఇప్పుడు తెలుసుకుందాం.. 10+2 (సీనియర్ సెకండరీ) విద్యార్హతలు కలిగి ఉండి హెవీ మోటార్ వెహికిల్స్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా వాహనాల నిర్వహణపై అవగాహన కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకునే వారి యస్సు జులై 1 నాటికి 18-27 ఏళ్ల వయస్సు ఉండాలి.
SSC Notification 2022 Central organization Staff Selection Commission is good news for unemployed
అలాగే ఎంపిక షెడ్యూల్ కూడా విడుదల చేసింది. దరఖాస్తుల ప్రక్రియ జులై 7 నుంచి ప్రారంభం కాగా అప్లికేషన్స్ జులై 29 వరకు చివరి తేదీ ఉంది. ఇక ఆన్ లైన్ లో ఫీజు చెల్లించడానికి చివరి తేదీ జులై 30 గా ఉంది. ఇక అక్టోబర్ లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించనుంది. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకున్న అభ్యర్తులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించి తుది ఎంపిక చేపడతారు. ఈ ఎగ్జామ్ కోసం తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, గుంటూరు, చీరాల, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, నెల్లూరు, విజయనగరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో ఎగ్జామ్ నిర్వహించనున్నారు.
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
This website uses cookies.